Others

సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్శనః
ఇయేష పదమనే్వష్టుం చారణా చరితేపథి
తన దర్శన మాత్రం చేతనే శత్రువులను కృశింపజేయగల ఆంజనేయస్వామి సీతానే్వషణం కొరకు చారణా మార్గంలో బయలుదేరాడు.
చారణ విధ్యాధర కిన్నర కింపురుష గంధర్వాది దేవతాగణములు తమతమ యోగ బలస్థాయిల ననుసరించి ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు.
వారిలో భూమికి దగ్గరగా ఆకాశ సంచారంచేస్తూ ఉండేవారు. శుభవార్తలను అందిస్తూ ఉండేవారు- విశ్వహితం కలవారు చారణులని మనకు సుందరకాండలోనే కనిపిస్తుంది.
అదిగో- ఆ చారణ సామర్థ్యంతో స్వామి బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు.
పారాయణ సంప్రదాయంలో దీన్ని శ్లోకం అనరు. మంత్రమనే అంటారు. అటువంటి ఈ మంత్రంలో-
‘రావణ’ శబ్దంలోని ‘వ’అనే అక్షరం గాయత్రీ మహామంత్రలోని భర్గోదేవస్య అనేచోట 12వ అక్షరమైన ‘వ’
బాలకాండ తరువాత గాయత్రీ బీజంతో ప్రారంభమైన కాండ ఇదే. ఇదొక విశేషం.
భౌతి భాసయితే లోకాన్ రేతి రంజయతే ప్రజాః
గ ఇత్యాగచ్ఛతే జన్రం భరగో భర్గ ఉచ్యతే.
ఈ వ అనే బీజాని భర్గుడు దేవత అయితే మైత్రా వరుణుడు అంటే అగస్త్యుడు ఋషి. సీతాదేవి లంకను చేదడానికి ఈయనే కారకుడు.
భర్గాఖ్యం రుద్ర సంజ్ఞంతు జ్ఞాత్వాత్వమృతమిచ్ఛతి ‘్భర్గః‘ స్వసాక్షాత్కారేణ అవిద్యా తత్కార్యదాహకః
‘దేవస్య’ ద్యోతమానస్య హ్యానందాత్క్రీడతో పివా
‘దీమహ్యం’ సేవేతి తేనైవా భేద సిద్ధయే.
(విశ్వామిత్ర కల్వే యోగ యాజ్ఞవల్క్వః)
అందువలన ఆంజనేయస్వామి రుద్ర సంజ్ఞకలవాడై మన అవిద్యా దాహకత్వానికి కారణమవుతున్నాడు. మన అమృత స్థితికీ కారణమవుతున్నాడు. ఆయన ఆనందంలో క్రీడిస్తాడు. మనల్ని క్రీడింపజేస్తాడు.
ఇదీ సుందరకాండ వలన వాల్మీకి మహర్షి మనకు అందింపవలసిన మహాఫలం.
ఈ మంత్రంలో చారణాపథి అంటే యోగ మార్గం.
మేరు దండం ద్వారా యోగులు మూలాధారమునుండి సహస్రారానికి సహస్రారం నుండి మూలాధారానికి సంచరిస్తూ ఉంటారు. అందుకని స్వామి మహాయోగియై బయలుదేరుతున్నాడు.
అందుకని చారణామార్గమని సంకల్పం చేసేడు.
ఇది బాహ్య స్థితి.
మానసిక స్వామి ఇంతకుముందే లంకలో ఉన్నాడు. అది ఇచ్ఛా (ఉత్సాహ) శక్తి. ఇప్పటిది క్రియాశక్తి. రామానుజ్ఞ రూపమైన ప్రభు (జ్ఞాన) శక్తి స్వామికి ఇదివరకే ఉన్నది.
సీతాదేవిని చూడడానికి స్వామి శక్తిత్రయనమన్వితుడై బయలుదేరుతున్నాడు.
ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి స్వరూపిణీ అని లలితాస్తుతి చేస్తాం. దేవతా శక్తిని ఉపాసకుడు ఒంటబట్టించుకొని (అంగన్యాస కరన్యాసాదులవలన) తానాదేవతా రూపమైనట్లు అభేద భావనచేసి ఉపాసిస్తాడు. అదీ ఈ స్థితి-
అందుకే స్వామి ఎంతటి దుష్కరకార్యమైనా చేయసంకల్పించేడు.
దుష్కరం నిష్ప్రతి ద్వంద్వ చికీర్షన్కర్మవానరః
సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ
దుష్కరమై కర్మ అంటే వానర దుష్కరమైన కర్మ. అట్టిదాన్ని స్వామి చేయాలని సంకల్పించేడు. అలా సంకల్పించిన స్వామి ఆ మహేంద్రగిరి శిఖరమీద నిలిచి తలపైకెత్తి చూస్తూన్నాడు. - అలా ఉన్న స్వామిని మహర్షి ‘‘గవాంపతిరివాబభౌ’’ అంటారు.
- అంటే నందీశ్వరునిలా ఉన్నాడని అర్థం.
పరాశక్తియొక్క స్వరూపాన్ని మొదట తాను ఉపాసించి తెలిసికొని చూసాడు.

- కాశీభొట్ల సత్యనారాయణ