Others

మధురభాషణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికముగా మాట్లాడిన వదరుబోతని, మాట్లాడనిచో ముంగి అని మాటలు వచ్చిన వారిగురించి పలు వ్యాఖ్యానాలు చేస్తుంటారు. జ్ఞానులు మితభాషిణులు, మూర్ఖులు అతి ప్రసంగము చేస్తారని కూడా అంటారు. మాట కన్నా వౌనం గురించి తెలుసుకొంటే అందరూ మాటలు వదిలేసి ఆ వౌనంలో ఉండే మాధుర్యాన్ని గ్రోలడానికే ఇష్టపడుతారని చాలామంది పండితులు అంటారు.
నిజమే. ఎందుకంటే ఎన్నో పుణ్యకార్యాలు చేసి సంపాదించుకున్న పుణ్యంతో వచ్చిన జన్మ మానవజన్మ. ఈ జన్మలోనే మంచిచెడు వివేకం ఉండేది. పుణ్యాన్ని పాపాన్ని సంపాదించుకోగల శక్తి ఉండేదీ జన్మలోనే. కనుక మాట తో ఎదుటి వారిని బాధించి కాస్త పుణ్యమేథైనా మన ఖాతా భగవంతుడు వేసి ఉంటే దాని ఖర్చు చేసుకోవడ మెందుకు? ఈర్ష్యాసుయలు, రాగద్వేషాలు, పోటీతత్వము ఇవన్నీ సాధారణ మనుష్యుల్లో ఉండేదే. చాలామంది అందరికన్నా గొప్పగా ఉండాలన్న తాపత్రయంతో ఎన్నో అబద్ధాలు లేని సంపద ఉన్నట్టుగాను లేనిపోని అబద్ధాలు చెప్పి దాన్ని నిజం చేసుకోవడానికి మళ్లీ అబద్ధాలు ఇలా తప్పులు మీద తప్పులు చేస్తూ వెళ్లి పాపసంచయాన్ని పెంచుకుంటుం టారు.
ఈ ప్రపంచంలో ఎవరు తక్కువ కాదు. ఎవరూ ఎక్కువకాదు. ధనము, వస్తువా హనాలు, ఆభరణాలు ఇలాంటి వాటి ల్లో ఎక్కవ తక్కువలు చూసుకుంటేఇవన్నీ శాశ్వతమైనవి కాదు. ఒకరోజు ఉంటాయ,. మరుసటి రోజు పోతాయ. వీటిని చూసుకొని తామే గొప్పవారిమి అని భావిస్తే చివరకు ఏమీ లేనివారిగామారుతారు. అందుకే ఏది శాశ్వతమైనదో ఏది నిత్యమైనదో ఏది సత్యమైనదో తెలసుకొని ఆ తర్వాత మాటా లడితే అపుడు మాటలు కన్నా పరమాత్మ గురించి తెలసుకోవడమే మేలు అని పిస్తుంది. ఎపుడెప్పుడు ఈ దేహంలో ఉన్న ప్రాణి లేదా జీవుడుండగనే మంచి పనులు చేసి ఆ పుణ్యంతో భగవంతుని సన్నిధానానికి వెళ్దామా అని ఆలోచిస్తారు. భగవంతుని గురించి తెలసుకోవడానికి తనలోకి తాను చూడడం మొదలుపెడతాడు. అంతర్ముఖుడు అవుతాడు. దానితో ఇక మాటల ప్రసక్తి ఉండదు. ఒకవేళ మాటలు వచ్చినా అవి అన్నీ భగవంతుని విభూతులగురించి యే ఉంటాయ. కనుక అవి అన్నీ మధుర భాషణాలుగా కీర్తించబడుతాయ.
భగవంతుని కిష్టమైన పనులు చేయడంలో చేతులు ఉత్సాహం చూపించడంతో మనసా వాచా కర్మణా భగవంతుని సేవ చేస్తూ కాలయాపన చేయడం ఆరంభవౌతుంది. ఆ ఆరంభ మమే మంచిమాటలు నుడవడానికి ప్రాతిపదిక అవుతుంది. మాట విలువ తెలిసి, మసలుకోవాలి. సందర్భశుద్ధి, సంయమనము కల్గి తగు రీతిలో మాట్లాడుతూ ఎవరి స్థాయి వారు నిలబెట్టుకోవాలి.
అందుకే ఎక్కడ మాట్లాడుతున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, ఏ సందర్భమిది అన్నదాన్ని జ్ఞప్తిలో ఉంచుకుని మరీ మాట్లాడాలి. కాని ఎదుటివారిని కించపరిచేటట్టుగానో, ఎవరినో అనవసరంగా పొగడడమో అధికప్రసంగం చేయడమో అదీ కాకపోతే ఏమీ తెలియకపోయనా బాగా తెలిసినట్టుగా మాట్లాడడమో చేయాలి. అసలు బాగా తెలసిన వారు ఎంత అవసరమో అంతవరకే మాట్లాడుతారు. అనవసరపు మాటలు మాట్లాడరు. ఇట్లా చేయడం వల్ల ఎవరినీ బాధపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడదు.

- కూచిబొట్ల వెంకటలక్ష్మి