Others

పగబట్టే దోమలకు పొగబెడదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శీతాకాలంలో దోమల వ్యాప్తి అధికంగా ఉంటుంది గనుక మనం అనారోగ్యాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండక తప్పదు. ఒకప్పుడు రాత్రి సమయాల్లోనే దోమల బాధ వుండేది. ప్రస్తుతం వాటికి రాత్రింబవళ్ల తేడా వుండడం లేదు. పగటి పూట విజృంభించే దోమల వల్లే ప్రమాదం హెచ్చుగా వుంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎనాఫిలస్ అనే జాతిలోని ఆడదోమల వల్ల మనకు మలేరియా వ్యాధి సోకుతుంది. క్యూలెక్స్ దోమ కారణంగా బోదకాలు వస్తుంది. ఇంటి పరిసరాల్లో మురుగునీటిలో గుడ్లుపెట్టి వృద్ధి చెందే క్యూలెక్స్ దోమల ద్వారా ఒకరినుంచి మరొకరికి వ్యాధి వ్యాప్తి చెందుతుంది. డెంగీవ్యాధి ‘ఎడిస్ ఈజిప్ట్’ దోమ వల్ల సంక్రమిస్తుంది.
డెంగ్యూకు కారణమయ్యే దోమలు పగటిపూట కూడా మనల్ని కుడతాయి. ఇవి గుడ్లు పెట్టకుండా ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తపడాలి. గదుల మూలల్లో, చీకటి ప్రదేశంలో, చల్లని ప్రాంతంలో ఈ దోమలు విశ్రాంతి తీసుకుంటాయి. గనుక ఇల్లంతా గాలి, వెలుతురు, సూర్యరశ్మి పర్చుకునేలా చూసుకోవాలి.ఆరుబయటి నుంచి దోమలు ఇంట్లోకి రాకుండా కిటికీలకు మెష్ అమర్చుకోవాలి. ఖాళీ ప్రదేశాల్లో కొబ్బరి చిప్పలు, పాడైన డ్రమ్ములు, టైర్లు, పారేసిన కూలర్లు మొదలైన వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంట్లో వాడని డ్రమ్ములను బోర్లించి పెట్టడం మంచిది. ఇంట్లో ఉన్నప్పుడు వొంటినంతా కప్పి ఉంచేలా దుస్తులను ధరించాలి. హాప్‌స్లీవ్స్ కంటే ఫుల్ స్లీవ్స్ ఉత్తమం. కాళ్లను పైజామాలు, సాక్స్‌తో కవర్ చేసుకుంటే మంచిది.
దోమలు ముదురు రంగులకు ఎక్కువగా ఆకర్షితమవుతాయి. గనుక లేత రంగుల దుస్తులను ధరించడం మేలు. ‘మస్కిటో కాయిల్స్’ వాసన కొందరికి పడకపోవచ్చు. రాత్రిపూట దోమతెరల్ని వాడటం చాలా ఉత్తమమైన మార్గం. బాగా ఎండబెట్టిన వేపాకులతో గదుల్లో పొగ పెడితే దోమల బెడద తీరుతుంది. ఇంటిమూలల్లో కర్పూరపు ఉండలు (నాప్తలీన్ గోళీలు) పెడితే దోమలే కాకుండా ఇతర హానికారకమైన క్రిములూ నశిస్తాయి. సాధారణంగా సాయంత్రం కాగానే దోమలు ఇళ్ళలోకి వస్తాయి. తలుపులు, కిటికీలు బార్లా తెరిచి వుంటే అవి ఇంట్లోకి చేరతాయి. పొద్దుగూకే సమయంలో కిటికీలు, తలుపులను మూసివేస్తే దోమలను నిరోధించవచ్చు.చిన్నకప్పులో నీళ్లు పోసి అందులో కర్పూరం బిళ్ళలువేసి మంచం పక్కన ఉంచితే, ఆ వాసనకు దోమలు దూరంగా పోతాయి. పల్చటి పొడిగుడ్డలో కర్పూరం మూట కట్టి దానిని పిల్లల పక్కలో వుంచాలి లేదా వాళ్ళ మొలతాడుకు కట్టాలి. కర్పూరపు వాసనకు దోమలు పిల్లల దరి చేరవు. ఇంట్లో, పరిసరాల్లో మురుగునీరు, చెత్తాచెదారం నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. పూలకుండీల్లో నీరు ఎప్పటికప్పుడు బయటికి పోయేలా జాగ్రత్తలు తీసుకోవాలి. సెప్టిక్ ట్యాంకుల నుండి దుర్వాసన పోయే గొట్టాలకు చివరన తీగ జల్లెడలు బిగించాలి. ఖాళీ స్థలాలు, రోడ్లపై గోతులు ఉండడం వల్ల నీరు నిల్వ ఉండిపోతూ దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చేయడమే దోమల నివారణకు ఏకైక పరిష్కార మార్గం. దోమల్ని తరిమికొట్టేందుకు జనావాసాల్లో తరచూ ఫాగింగ్ చేయాలి.
ప్రాణాంతక వ్యాధుల బారిన పడటం కన్నా- ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిది. లేకుంటే దోమల చెలగాటం మనకు ప్రాణసంకటం అవుతుంది.

-కైపు ఆదిశేషారెడ్డి