Others

తెలిమంచు.. (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతికిరణం చిత్రంలోని -తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ.. అన్న పాట నాకు చాలా ఇష్టం. భూపాలరాగ సమయంలోని కాస్మిక్ నేచర్‌ని మనసు పొరల్లోకి తీసుకొస్తున్నంత గొప్పగా ఉంటుంది. ప్రకృతి నుంచి పాట తీయమంటే మైమర్చిపోయి రాసే సిరివెనె్నల సీతారామ శాస్ర్తీ మమతపెట్టి రాసిన గీతమిది. ‘ఈ దోవ పొడవునా కువకువల స్వాగతం/ నీ కాలి అలికిడికి మెలకువల వందనం’ అన్న ఎక్స్‌ప్రెషన్ అత్యద్భుతం.
ఈ పూల రాగాల పులకింత గమకాలు/ గారాబు కవనాల గాలి సంగతులు/ నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు/ పల్లవించును ప్రభూ పవళించు భువనాలు/ భాను మూర్తీ../ నీ ప్రాణ కీర్తన విని/ పలుకనీ ప్రణుతులని ప్రణవ శ్రుతిని/ పాడనీ ప్రకృతినీ ప్రథమ కృతినీ.. అంటూ చరణమిచ్చిన సీతారామశాస్ర్తీ కలానికి వందనం సమర్పించాల్సిందే. ఇదొకవంతైతే సంగీత దర్శకుడు కెవి మహదేవన్ ఈ పాటకిచ్చిన స్వరబాణీని పొద్దునే్న వింటే -మానసిక రోగాలన్నీ మటుమాయమన్నంత హాయి కలుగుతుంది. దూరంగా కొండకోనలు రారుూరప్పలు, వాటిమధ్యనుంచి ఉరకలేస్తూ పరుగులెత్తే గోదావరి.. ఒడ్డున పెద్ద చెట్టు.. దానికింద బాలనటుడు మంజునాథ్. ఈ పాటలో కె విశ్వనాథ్ మనోహర దృశ్యం ఇక్కడినుంచే మొదలవుతుంది. ప్రకృతి ప్రథమ కృతికి ఆచార సంప్రదాయాన్ని నేపథ్యంగా చూపిస్తూ -్భనోదయంలో ఆడియన్స్‌ని తడిసి ముద్ద చేసిన విశ్వనాథ్‌కు హ్యాట్సాఫ్. ఇక పాటకు అత్యంత ప్రాణప్రథంగా చెప్పుకోవాల్సిన సంగతి -వాణీ జయరాం గొంతు. పూజ గంటతో మొదలయ్యే పాట శృతికి మృదంగనాదం తోడైనపుడు -వాణీ (సంగీత సరస్వతి) గొంతు ప్రకృతినుంచి వినిపించే ఓంకారనాదంలా అనిపిస్తుంది. తారాస్థాయిలోనూ గొంతులోని మాధుర్యాన్ని రుచిచూపిస్తూ ‘ప్రభూ..’ (సూర్యభగవానుడు) అని పిలిచే విధానం అత్యద్భుతం. ఆ నాద మాధుర్యాన్ని అనుభవించాలే తప్ప, మాటల్లో చెప్పడం కష్టం. పాట కుర్రాడు మంజునాథ్ పాడతాడు కనుక అదే పసితనాన్ని గొంతులో చూపించి, పాట ముగింపు పంక్తిని రాధిక పాడుతుంది కనుక ఆ ఉచ్ఛారణలో మెచ్యూరిటీ చూపించిన వైనం వాణీ జయరామ్‌కే చెల్లింది. ఈ పాటంటే నాకు చాలా చాలా ఇష్టం.

-కావ్యసురేష్, జగన్నాథపురం