Others

‘ఆవు’లను కాపాడటం కోసం వేరే సుంకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హర్యాణా రాష్ట్రంలో గోవధ నిషేధం వుంది. గోవంశ సంరక్షణ, గోసంవర్థన చట్టం అమలులో వుంది. ఆవులను కాపాడేటందుకు పోలీసు శాఖలో వేరే విభాగం కూడా వుంది. ఆవుల్ని కబేళాలకి తరలించినా, వధించినా భారీ జరిమానాలు, జైలుశిక్షలూ అన్నీ వున్నాయి. గోసంరక్షణకు నిధులు అంతంతమాత్రంగానే వున్నాయి. కనుక గోరక్షణా సుంకం విధించాలన్న ప్రతిపాదనల్ని గవర్నమెంట్ పరిశీలిస్తోంది.
రాష్ట్రంలో గోశాలలో పోషణ పొందుతూ వున్న ఆవుల సంఖ్య మూడు లక్షల ఇరవై వేలు! కాగా, రోడ్లంట తిరిగే గోమాతల సంఖ్య ఉజ్జాయింపుగా లక్షా డెబ్భైవేలు దాటుతుంది. వీటి పోషణ నిధుల కోసం గోసేవా ఆయోగ్ చాలా ప్రతిపాదనలు పెట్టింది. ఫంక్షన్ హాల్స్ పెళ్లిమంటపాలు వగైరాలమీద 2100 రూపాయలదాకా ‘సెస్సు’ వెయ్యాలి. వినోదం పన్ను అంటే సినిమా టిక్కెట్లమీద ఐదు శాతం సర్‌ఛార్జి వెయ్యాలి. అలాగే ఆహార ధాన్యాల క్రయ విక్రయాలలో సంచీకి రూపాయి వంతున సెస్సు వెయ్యాలి. ఇక దేవాలయాలనుంచి బాగా విరాళాలు వసూలు చెయ్యాలి అన్న ప్రతిపాదనలున్నాయి.
నిజానికి పంజాబ్ ప్రభుత్వం పరిశీనలో రుూపాటికే ‘గోసుంకం’ ప్రతిపాదనలున్నాయి. మోటారు కార్లు, ద్విచక్రవాహనాల క్రయంమీద సెస్సు- ఎ.సి కల్యాణమందిరాలమీద సెస్సు, సిమెంటు, మద్యం బాటిల్స్‌మీద గోసంరక్షణ సెస్సు వేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోసంరక్షకశాలలకు ప్రభుత్వ సబ్సిడీలు రుూవరకే వున్నాయి.

-వీరాజీ veeraji.pkm@gmail.com