Others

మానవ సేవే మాధవ సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుడు ఇచ్చిన మానవ జన్మను సార్థకం చేసుకోవడం అందరూ కోరుకో వలసింది. సృష్టిలో మానవ జన్మ ఉత్కృష్టమైనది. ఏ ఇతర జీవికి భగవంతుడు ఇవ్వని వరం మనిషికి మాట్లాడే రూపంలో ఇచ్చాడు. మన మాటలు, చేతలు ఇతరులకు బాధ కలిగించకూడదు. ఇతరులను వేధించే విధంగా ఏదీ ఉండకూడదు. ప్రతి మనిషి తోటి వారికి సాయం అందించాలి. మనకు సాయం చేసే వారికే కాకుండా, అపకారం చేసే వారికి కూడా ఉపకారం చేయగలడం దైవత్వం. ఇది అందరికీ రాదు. కానీ ఎవరికీ హాని చేయకపోవడమే అన్నింటికన్నా మంచిది. వ్యాసుడు పరులకు ఉపకారం చేయడమే పుణ్యకార్యమని పరులకు అహితం చేయడమే పాపకార్యమని చెప్పారు కదా. అందుకే మనం మంచి చేయకపోయనా ఎవరూ అడగరు కానీ చెడు మాత్రం చేయకూడదు. ఎదుటి మనిషికే కాదు ఏ ప్రాణికీ చెడు చేయకూడదు. ప్రకృతి లో ఉన్న నీరు , గాలి, ఛెట్లు అన్నీ పరోపకారం చేస్తూ మనిషిని కూడా స్వార్థం ఇంచుక మానుకొని ఇతరులకు సాయం చేయాలని చెప్తుంటాయ.
గంధపుచెట్టు తనను నరికేవాడికి కూడా సుగంధాలు అందించే విధంగా మన జీవన విధానం ఉండాలి. ఎపుడైనా సరే మనకు తెలియకుండా ఎదుటివాడికి మన వల్ల నష్టం, కష్టం కలిగితే, అది తెలుసుకుని పశ్చాత్తాపపడి, మరోపర్యాయం అలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి.
భగవంతుడి సేవ చేస్తూ, ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి. పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తూ ఉండాలి. భగవంతుడు మనకు ఇచ్చిన సంపదలో కొంతభాగమైనా పేదలకు, తోటివారికి ఇచ్చి ఆదుకోవాలి. ప్రతిరోజూ కొంత సమయాన్నైనా భగవన్నామస్మరణలో గడపాలి.్భగవద్గీతలో చెప్పినట్టు మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి, దాని వల్ల వచ్చే ఫలితాన్ని భగవంతుడికే వదిలివేయాలి. మనిషి జీవితం భగవంతుడి చేతుల్లో నడుస్తుంది. మనం నిమిత్తమాత్రులం. అంతా మనం అనుకున్నట్టు సాగదు. ఎంతటివారికైనా కర్మానుసారం జీవితం నడుస్తుంది. భగవంతుడు ఇచ్చిన గడువు తీరిపోగానే ఈ లోకం వదిలి వెళ్లిపోక తప్పదు. తనువు చాలించిన సమయంలో మేలు చేసినవాళ్లు, చేయంచికున్నవాళ్లు, లేదా మనం ద్వేషించిన వారు ఎవరూ రారు. కాని ద్వేషం, ఆశ అనేవి వాసనారూపంలో పాపపుణ్యాల రూపంలో వెంట వస్తాయ. వాటి వల్లనే మరుజన్మలో సుఖదుఃఖాలు కలుగుతుంటాయ. అందుకే ఎపుడైనా కష్టం వస్తే ఏ జన్మలో చేసుకున్న పాపమో అని వాపోతుంటాం. తెలిసి ఏ పాపమూ మానవ జన్మలో చేయకూడదు.
ఈ లోకంలో పనికిరాని వస్తువు కాని ప్రాణి కానీ లేదు. ఏ ప్రాణికి ఉండాల్సిన అర్హత వాటికి కలిగిఉన్నాయ. అందుకే నేను ఎక్కువ నీవు తక్కువ అనే తారతమ్యాలను పెట్టుకోకూడదు. సమభావం అలవర్చు కోవాలి. సమబుద్ధితో ప్రాణులన్నిటీ చూడాలి. అసలు అందరిలోను, అన్నింటిలోను పర మాత్మ చైతన్యరూపంలో ఉన్నాడన్న సత్యాన్ని నమ్మితే ఎవరికీ ఎగ్గుచేయాలని అనిపించదు.
అత్యాశవల్ల మనిషి తనను తానే పతనావస్థకు చేర్చుకుంటున్నాడు. జరిగిందేదో మంచికే జరిగింది, జరుగుతున్నది మంచికే జరుగుతుంది, జరగబోయేది కూడా మంచికే జరుగుతుందన్న సత్యాన్ని తెలుసుకోవాలి. జీవితంలో నీతిగా, నిజాయితీగా ఉంటూ ప్రశాంతంగా జీవించాలి. ఇతరులకు ఆదర్శంగా నిలవాలి

- వాణి ప్రభాకరి