Others

ఎమోజి నయ్యా!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినదగు నెవ్వరు చెప్పిననే
విజ్ఞుల అభిభాషణ అవసరం లేదు
ఆహ్వాన విన్నపం చాలనే -
అతిరధులు, మహారధులనబడే
మహా నాయకుల మహోపన్యాసాల
ఆకర్షణలతో హాజరయే
నేల ఈనిందా,
చీమలపుట్ట పొదిగిందా అనిపించే
పిడికిలి తెరచిన హస్తాలు
రెపరెపలాడించే రెండు వ్రేళ్లు
ఎవరు చెప్పినా, ఏమి చెప్పినా
వీడు పిలిచినా, వాడు పిలిచినా
వీటికి, వాటికి, వేటికైనా
స్వచ్ఛందంగా, చేరవేతగా అయనా వచ్చే
ఎప్పుడో, ఏదో జరుగుతుందనే మేలు కోసం
ఎదురుచూపుల ఆశాజీవులు!

పునీతుల మైపోవావాలనే తపనతో
పుష్కరిణి స్నానాలాచరించే
భక్తజన సందోహ సమావేశ
కరతాళ ధ్వనుల ఆలయ ప్రాంగణం.

మొదటిరోజు సినిమా టిక్కెట్ క్యూ
తదనంతర నిష్క్రమించే జనం
మ్యాచ్‌కై క్రిక్కిరిసిన క్రికెట్ ప్రాంగణం
జబ్బుల జనాలతో నిండిన ప్రజావైద్యశాలలు
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న
కూడళ్లలోని స్కూళ్ళలోంచి
గార్ద్భ భారంతో పరుగులు తీసే
భావి భారత బాలలు
వేచి వేచి విసిగిపోయ
రావలసిన బస్సు రాగానే
రయ్‌మని పరుగులు తీసే జనం

జనం, జనం, ప్రభంజనం!
జల ప్రవాహం లాంటి జన ప్రవాహం!
జన సందోహ దర్శనానంతర కెవ్వు కేకతో
చరవాణి చాటింగ్‌లో
ఆలోచనాత్మక, విస్మయ
భావ వ్యక్తీకృత సంకేత
ఎమోజి నైపోయాను!

మెరిసిందో చిన్న చిలిపి ఆలోచన
ఉద్భవించిందో ఉన్న విషయం
అప్పటి విన్న విషయం
‘ముగ్గురు వద్దు, ఇద్దరు హద్దు,
ఒక్కరు ముద్దు’
‘పరిమిత కుటుంబం..
పండంటి సంసారం’ -
ఆ ఊసప్పటి మాట
ఇంకా నీ సంతతి నింతింత చేస్కోమంటున్న
ఏలినవారి సూచనతో
ఎమోజి నయపోయా!

- వేదం సూర్యప్రకాశం, 9866142006