Others

మల్టీ విటమిన్స్ గర్భిణీకి మంచివేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గర్భిణీకి మల్టీ విటమిన్స్ టాబ్లెట్స్ వల్ల ఉపయోగం లేదని నిపుణులు అంటున్నారు. ఇవి వేసుకోవటం వల్ల డబ్బులు వృథా మినహా ఎలాంటి ప్రయోజనం లేదని వీటిపై చేసిన పలు పరిశోధనలు చెబుతున్నాయి. చాలామంది తల్లులకు ఈ విటమిన్స్ టాబ్లెట్లు అవసరం లేదని వారు అంటున్నారు. మందులు, చికిత్సకు సంబంధించి విడుదల చేసే హెల్త్ బులెటన్‌లో పరిశోధకులు ఈ విషయాన్ని స్పష్టంగా రాశారు. దీనికి సంబంధించిన ఆధారాలతో సహా అందులో పొందుపరిచారు. వీటి వల్ల తల్లీబిడ్డలకు ఎలాంటి బలాన్ని ఇవ్వటం లేదని చెబుతున్నారు. ఫోలిక్ యాసిడ్, విటమిన్ డి టాబ్లెట్లను వైద్యులు తప్పక వేసుకోవల్సిందిగా వైద్యులు గర్భిణీలకు సూచిస్తారు. అంతేకాదు పోషకాహారం కూడా తీసుకోమని చెబుతారు. కొంతమంది మహిళలు తల్లీబిడ్డలకు అవసరమైన పోషకాహారం తీసుకోవటం లేదని, అందుకే వైద్యులు ఈ టాబ్లెట్లను వీటి రూపంలో తీసుకోమని రాస్తారు. ఫోలిక్ యాసిడ్ 400 మిల్లీ గ్రాములు, విటమిన్-డి 10 మిల్లీగ్రాముల టాబ్లెట్లను ప్రతిరోజూ క్రమం తప్పకుండా వేసుకోమంటారు. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ వల్ల నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని, విటమిన్-డి టాబ్లెట్ వల్ల తలీ లబిడ్డల ఎముకలు పటిష్టంగా ఉంటాయని వైద్యులు ఈ మందులను రాస్తారు. మనదేశంలోప్రభుత్వం అందించే ఈ టాబ్లెట్లను కొంతమంది ఉచితంగా పొందుతుండగా.. మరికొందరు తప్పనిసరిగా కొనుగోలు చేసి ప్రతిరోజూ వేసుకుంటారు. ఎందుకంటే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని ప్రతి తల్లి ఆశపడటం సహ జం. కాని వీటిని వేసుకోవటం వల్ల తల్లీబిడ్డలకు అనుకున్న మేరకు ఆరోగ్య ఫలితాలు రావటం లేదని పరిశోధకులు అంటున్నారు. దీనిపై రాయల్ కాలేజీ నర్సులు మాట్లాడుతూ... గ్రామీణ మహిళలకు గర్భధారణ జరిగితే వారిని ఈ టాబ్లెట్లు బదు లు తాజా కూరగాయలు, పండ్లు తీసుకోమని సల హా ఇస్తుంటామని, దీనివల్ల ఫోలిక్ యాసిడ్ తల్లీబిడ్డలకు అందుతుందని చెబుతుంటామని తెలియజేస్తున్నారు. ఈ రెండు టాబ్లెట్ వల్ల గర్భిణీలకు ఎలాంటి ఉపయోగం లేదని తాము కూడా చెబుతుంటామని వారు సైతం వెల్లడించటం గమనార్హం. ఈ రెండు విటమిన్లనూ ఆహారం ద్వారా తీసుకోవటమే మంచిదని పౌష్టికాహార ఉత్పత్తిదారుల అసోసియోషన్ సైతం తెలియజేస్తోంది.