Others

గణితంలో ఘనాపాఠీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(నేడు గణిత దినోత్సవం)
అన్ని రంగాలలో నూతనోత్తేజంతో ఉరకలేస్తున్న భారతదేశం గణితంలో కూడా అసమాన ప్రతిభా పాటవాలను కలిగిన ఎందరో మహానుభావులను తనలో ఇముడ్చుకున్న దేశంగా ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. గణిత శాస్త్రం సుమేరియన్,బాబిలోనియన్, ఈజిప్ట్, గ్రీక్, చైనా ,హిందూ నాగరికత (అవిభక్త భారతదేశం) లలో అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధికి ఎంతో మంది తమ శక్తిని. కృషిని జతచేసి ‘సున్నా’ను కనుగొనడంతో మొదలు పెట్టి, భారతదేశ కీర్తిని అగణితంగా కొనియాడేలా చేశారు. వీరిలో ముఖ్యంగా శ్రీనివాస రామానుజన్ తాను నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ ప్రతిభకు ఇవేవి ఆటంకం కాదని తన అపూర్వ మేధా సంపత్తితో నిరూపించారు.
1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో జన్మించిన రామానుజన్ కుంభకోణం టౌన్ హైస్కూల్లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి, గవర్నమెంట్ కాలేజీలో చేరాక కొన్ని ఆర్థిక, అనారోగ్య కారణాల వల్ల ఎఫ్.ఎ పూర్తి చేయలేక పోయాడు. గణితం పట్ల ఉన్న ఆసక్తితో ఉన్నా, తగిన విద్యార్హత లేని కారణంగా ఉద్యోగం రాకపోవడం వంటి ప్రతికూల పరిస్థితులలో కూడా వింత చదరాలు , వితత భిన్నాలు, ప్రధాన సంఖ్యలు, పార్టిషన్ అఫ్ నెంబర్స్, ఎలిఫ్టిక్ ఇంటి ఇంటిగ్రల్ వంటి అంశాలపై ఆయన పలు పరిశోధనలు చేశాడు.
శ్రీనివాస రామానుజన్ తన పరిశోధనల ఫలితాలను పావుఠావు నోటు పుస్తకాలపై రాసుకునేవాడు. అది చూసిన ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ వి.రామస్వామి అయ్యర్ ఆయనకు నెలసరి ఉపకార వేతనం వచ్చేటట్లు చేశాడు. ఒక ఉన్నత శ్రేణి గణితశాస్తజ్ఞ్రుడు మాత్రమే రాయగల సూత్రాలను ఒక సా ధారణ గుమస్తా అయన రామా నుజన్ ప్రతిపాదించడం చూసి డాక్టర్ వాకర్ ఆశ్చర్యపోయాడు. తన పరిశోధనలను పరిశీలన నిమిత్తం కేంబ్రిడ్జ్ ప్రొఫెసర్ జి హెచ్ హార్డీకి రామానుజన్ పంపారు. అది చూసి ఆశ్చర్యపోయిన ఆయన రామానుజన్‌ను ఇంగ్లండ్‌కు సాదరంగా ఆహ్వా నించాడు. 1914 మార్చిలో ఇంగ్లాండ్ వెళ్లిన రామానుజన్ ఆరేళ్ల కాలంలో 32 పరిశోధనా పత్రాలను సమర్పించి- ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజీల నుంచి గౌరవాలను పొందిన మొదటి భారతీయుడు అయ్యాడు.
1919 మార్చిలో ఇండియాకు తిరిగి వచ్చిన ఆయనకు అభిమానులు అన్ని విధాలా వైద్య, వసతి సదు పాయాలు కల్పించినప్పటికీ ఫలితం లేకుం డాపోయింది. 1920 ఏప్రిల్ 26న శ్రీనివాస రామానుజన్ మరణించారు. ఆయన కేవలం ఒక గణిత శాస్తవ్రేత్త మాత్రమే కాదు, మానవ మేధస్సుకు ఏ అడ్డంకులు ఉండవని, అది ఏం చేయాలనుకున్నా చేసి తీరుతుంది.. అని నిరూపించిన వ్యక్తి. అప్పట్లో ఆయన సాధించిన ఫలితాలు- నంబర్ థియరీకి సంబంధించినవి కాబట్టి ప్రస్తుత గణితంలో వాటి ప్రయోజనాలు ఏమీ ఉండవని పెదవి విరిచిన మేధావులు ముక్కున వేలేసుకునేలా ప్రస్తుతం స్ట్రింగ్ థియరీ వంటివి క్యాన్సర్ పరిశోధనలలో ఉపయో గపడుతున్నాయి. మాక్ తీటా ఫంక్షన్ వంటివి విజ్ఞాన శాస్త్ర పరిశోధనలను ఎంతగానో ప్రభా వితం చేస్తున్నాయి. శ్రీనివాస రామానుజన్ స్మారకార్థం- రామా నుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథ మెటిక్స్‌ను 1950లో ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వం తపాలా బిళ్లను 1962 డిసెంబర్ 22న విడుదల చేసింది. ఏటా డిసెంబర్ 22న భారత పౌరులు ఆయనను గుర్తుంచుకునే విధంగా- గణిత దినోత్సవంగా పాటిస్తున్నారు. ఆయన 125వ జయంతి సందర్భంగా 2012 సంవత్సరాన్ని గణిత సంవత్సరంగా ప్రభుత్వం ప్రకటించింది.
నేటి బాలలు.. గణితం
భారత దేశంలో ఇంతటి పేరు ప్రఖ్యాతులు పొందిన గణిత శాస్తవ్రేత్తలు అనేక మంది ఉన్నప్పటికీ, గణిత దినోత్సవాలు జరుగుతున్నప్పటికీ, కొన్ని ప్రాథమిక పాఠశాలలో ఇప్పటికీ దాదాపు 40 శాతం మంది పిల్లలకు ప్రాథమిక భావనలు రావని తేలడం బాధపడవలసిన విషయం . కొద్దిమంది పిల్లల్లో గణితం అంటే విపరీతమైన భయం వల్ల తగిన ప్రమాణాలను అందుకోలేకపోతున్నారు. వారు గణితం పట్ల అంతటి భయాన్ని ఎందుకు కలిగి ఉన్నారో అన్న విషయాన్ని కనుగొనాల్సిన అవసరం ఉంది. పదవ తరగతి తరువాత సైన్సు ,ఆర్ట్స్ గ్రూపులలోని విద్యార్థులకు గణితం అవసరం లేదన్న భావనను కొన్ని కార్పొరేటు పాఠశాలలు కల్పించడం ఈ దుస్థితికి కారణం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న నినాదాన్ని నిజం చేయాలంటే భారతదేశాన్ని గణిత పరంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కేవలం నినాదాలతో సరిపెట్టకుండా పిల్లల స్థాయిని అర్థం చేసుకొని వారికి బోధించాల్సిన అవసరం ఉంది. బోధనలో మెలకువల వల్ల వారికి గణితం పట్ల ఉత్సాహాన్ని, ఆసక్తిని కలుగజేయవలసిన ఉంది. గణితం కూడా ఒక అభివృద్ధి సూచిక నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే దేశం విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందుతుందని భావించవలసి ఉంటుంది. అందుకు ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు గణితానికి సంబంధించిన అవార్డులు ఇస్తూ ప్రోత్సహించాలి. పిల్లలకు ప్రత్యేకంగా గణితంలో పోటీ పరీక్షలు నిర్వహించడం ద్వారా వారికి మానసిక ఉల్లాసం కలుగుతుంది.

-సింగంపల్లి శేష సాయి కుమార్ 86396 35907