Others

గోళ్లు కొరికితే అలెర్జీ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకు నోట్లో వేలు పెట్టుకోవటం, నాలుక చీకటం చేస్తుంటారు. ఈ రెండు అలవాట్ల వల్ల అలెర్జీలు సంభవిస్తాయని పిల్లల వైద్య నిపుణులు అంటన్నారు. కొన్ని రకాల క్రిములు శరీరంలోకి వెళ్లి వ్యాధి నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతాయని అంటున్నారు. న్యూజిలాండ్‌లో 5 నుంచి 32 సంవత్సరాల వయసు ఉన్న దాదాపు వెయ్యిమందిపై పరిశోధనలు చేశారు. ఈ అలవాటు వల్ల రొంప జ్వరం, అస్తామా వ్యాధులు వచ్చినట్లు కనుగొన్నారు. పిల్లల వయసు 5,7,9,11 సంవత్సరాలు ఉన్నపుడు ఈ రెండు దురలవాట్లు నేర్చుకుంటే దీని దుష్ప్రభావం 13,32 ఏళ్లమధ్యలో కనిపిస్తున్నట్లు గ్రహించారు. ఎందుకంటే పిల్లలు దుమ్మూధూళిలో ఆడుతుంటారు. అలాగే పెంపుడు జంతువులను పట్టుకుంటారు. దీంతో అవే వేళ్లను నోట్లో పెట్టుకోవటం వల్ల అలర్జీ సంబంధిత వ్యాధు లు సంభవిస్తున్నాయని ఒటాగో యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడిస్తున్నారు.