Others

వ్యవస్థలను భ్రష్ఠు పట్టించిందెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్యకాలంలో ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు, యింకా 2019 ఎన్నికల దాకా రాహుల్‌గాంధీ, ఆయన అనుచరులు, ఆయనతో కొత్తగా కాంగ్రెస్ కండువా వేయించుకున్న చంద్రబాబునాయుడు- వీరందరినోట మోగుతున్నమాట ‘మోడీ ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టుపట్టించిందట.’ ప్రజాజీవితంలో దశాబ్దాలుగా చలామణీ అవుతున్న ఈ నాయకుల నోట యింతకన్నా పెద్ద అబద్ధం మరోటి వుండదు. ప్రజాస్వామ్య దేశంలో పార్టీలకు సిద్ధాంతాలుంటాయి. ఇక కమ్యూనిస్టులు కాసేపు రష్యాకు, కాసేపు చైనాకు భజన చేస్తూ వచ్చారు. మనదికాని ఏదో రాద్ధాంతంతో వారందుకునే 2,3 రాష్ట్రాల్లోకంటె ఎక్కువ పరిపాలనలోకి రాలేకపోయారు. ఈ మూడు విచారధారలకు భిన్నంగా ఉంటామని బయలుదేరిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పురుడు పోసుకుంది. యుపిలో సమాజవాది పార్టీ, బీహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్, మహారాష్టల్రో ఎన్‌సిపి, యుపిలో బిఎస్‌పి, కర్ణాటకలో జెడిఎస్ యివన్నీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడినవే. కాని నేడు ఈ పార్టీలన్నీ ‘మహా గటబంధన్’అంటూ ఏకమవడం ఏ తరహా ప్రజాస్వామ్యమవుతుంది. ఏ విలువల వ్యవస్థ నిర్మాణానికి యిది దోహదపడుతుంది. తమతమ రాష్ట్రాలలో పరస్పరం నొకరినొకరు తలపడుతూ, కేంద్రంలో మాత్రం చేతులు కలుపుతున్న ఈ పార్టీలు 30 ఏళ్ళ తరువాత 2014లో మళ్ళీ స్థిరమైన ప్రభుత్వం రావడం సహించలేకపోయాయి. మోడీని చూసి గుళ్ళచుట్టూ తిరిగిన రాహుల్‌గాంధీ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి రాగానే మళ్ళీ కొత్త పల్లవినందుకున్నాడు. కాంగ్రెస్ ముస్లింల పార్టీ అంటూ ఘీంకరిస్తున్నాడు. ‘ఇంక్విలాబ్’ అనే ఉర్దూ పత్రికలో దీనికి సంబంధించి ముస్లిం బుద్ధిజీవుల సమావేశంలో ఆయనన్నమాటలు ప్రచురింపబడ్డాయి. స్వతంత్ర సమరంలో నాడు అనేక మంది దేశభక్తులకు వేదిక అయి, స్వాతంత్య్రానంతరం సెక్యులర్ రాజ్యాంగం రాసుకున్న దేశంలో 133 సం.ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు 2019 ఎన్నికల్లో కుర్చీమీద కూర్చునేందుకు చేస్తున్న ఈ ప్రేలాపనలు ఏ వ్యవస్థనుద్దేశించి చేస్తున్నది? ఆయన నాయినమ్మ ఇందిరాగాంధీ 1975-77 మధ్య అత్యవసర పరిస్థితి దేశంలో విధించి నియంతలా అనేకమందిని జైళ్ళల్లో బంధించి సాగించిన అత్యాచార పర్వం గురించి దేశానికి తెలియకపోలేదు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసి ఇండియా ఈజ్ ఇందిర అని చేసిన గాండ్రింపును 1977 ఎన్నికల్లో ప్రజలు ఈసడించుకున్నారు. జనతాపార్టీని అధికారంలోకి తెచ్చారు. 1984లో శ్రీమతి ఇందిరాగాంధీ హత్యకు గురై తదనంతరం సిక్కుల ఊచకోత జరిగింది. రాహుల్‌గాంధీకి అపుడు 15 ఏళ్ళు. ‘నేను చిన్న పిల్లవాణ్ణి, నాకేం తెలియదు’ అని బుకాయించే రాహుల్‌గాంధీ సిక్కు అల్లర్లలో కాంగ్రెస్ నేతలున్నట్లు గత ఏడాది వొప్పుకున్నాడు. తాజాగా సజ్జన్‌కుమార్‌కు శిక్ష పడితే రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఆయన్ను వెనకేసుకొస్తోంది. 1984 గురించి తెలియని రాహుల్‌గాంధీ 1948లో జరిగిన గాంధీ హత్య గురించి మాత్రం ఆర్.యస్.యస్.ను పదే పదే ఎందుకు నిందిస్తాడు? నేర రాజకీయాలను ప్రోత్సహిస్తున్న రాహుల్‌గాంధీ ఏ తరహా రాజకీయ వ్యవస్థను కోరుకుంటున్నారు? సిక్కు అల్లర్లలో పాలుపంచుకున్న కమలనాథ్‌ను మధ్యప్రదేశ్‌కు ముఖ్యమంత్రిని చేసి ఆయన ఏ సదాచారాన్ని నెలకొల్పాలనుకుంటున్నారు? కర్ణాటకలో తెరచాటు ప్రయత్నాలు చేసి జెడిఎస్‌తో కలిసి ప్రభుత్వ అధికార పీఠం కబళించిన రాహుల్‌గాంధీ ఏ తరహా ప్రజాస్వామ్యవాది అనుకోవాలి? ఆంధ్రప్రదేశ్‌లో ఐటి దాడులు జరిగితే చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారు. జగన్ అక్రమాస్తుల విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టు జగన్‌కు సమన్లు జారీచేయలేదా? ఇవే దాడులు టిడిపి ఎమ్.పి. సుజనాచౌదరిపై జరిగితే ఇడి వ్యవస్థను మోడీ భ్రష్ఠు పట్టించారని చంద్రబాబు అంటున్నారు. ఆయన ప్రత్యర్థి జగన్ మీద ఏం జరిగినా ఫరవాలేదు. కాని తమ మీద తమవారి మీద మాత్రం అవి జరగకూడదు. నీరవ్ మోడీ, విజయమాల్యాల మీద కూడా యివి జరిగాయి. నిజానికి గతంలో యిలాంటి నేరస్థులకు ప్రభుత్వాలు రక్షణనిచ్చేవి. అందువలనే దేశంలో బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు 8 లక్షల కోట్లకు చేరాయి. మోడీ ప్రభుత్వం ఇన్‌సాల్వెన్సీ అండ్ బాంక్రప్టసీ కోడ్‌పై ఆర్డినెన్సు తెచ్చి ఆర్థిక నేరస్థుల ఆస్తులు జప్తు చేయడం, అప్పుల వసూళ్ళను తీవ్రతరం చెయ్యడం వంటి మోడీ చర్యలవల్ల 2 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లు బ్యాంకులకు తిరిగి చేరాయి. ఇది వ్యవస్థను భ్రష్ఠు పట్టించడమా? బలోపేతం చెయ్యడమా? పరిశ్రమాధిపతులతో పైసలతో రాజకీయాలు నెరపుతున్న చంద్రబాబు వంటి నాయకులకు ప్రజల సొమ్మును రక్షించడంకంటె పరిశ్రమాధిపతుల్ని రక్షించడమే ముఖ్యం అవుతున్నది. రిజర్వు బ్యాంకు గవర్నరు ఉర్జిత్‌పటేల్ రాజీనామా చేయడాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. కాని మోడీ ప్రభుత్వం రఘురాం రాజన్‌ను పూర్తికాలం కొనసాగించారు. ఆయన్ను మోడీ వొక్క మాటనలేదు. తాజాగా సిబిఐ గురించిన చర్చ జరుగుతున్నది. సిబిఐ అధిపతులు నేరస్థులు కావడం మన దేశంలో కొత్తకాదు. అయినా సిబిఐ అధిపతులు పైనుంచి ఊడిపడ్డారా? వారికే వ్యక్తి సహజమైన బలహీనతలుంటాయి. కాదనలేం. అసలు అవినీతి లేకుండానే వుండాలి కాని, అవినీతి నిరోధించేందుకు ఒక అధికారిని నియమిస్తే ఆ అధికారి మీద యింకోరు నిఘా పెట్టాల్సిన అవసరం ఎప్పుడూ వుండనే వుంటుంది. యుపిఎ హయాంలో నియుక్తుడైన సిబిఐ అధిపతి- రంజిత్‌సింహపై బొగ్గు కుంభకోణం కేసు దర్యాప్తు చేయమని సుప్రీం ఆదేశాలిచ్చింది కూడ. ఆయనపై సిబిఐ, ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది కూడ. ఆయన కదలికలపై నిఘా వుంచాలని కూడా నాడు పత్రికలు వ్యాఖ్యానించాయి. సిబిఐ మాజీ అధిపతిపై అవినీతి ఆరోపణలు కూడా వున్నాయి. ఆయనకోసం వచ్చే అతిథులపై కూడా కనే్నసి వుంచాలని నాడు సుప్రీం కోరింది.
అలాగే ప్రస్తుతం వున్న రాకేష్ అస్థానా, అలోక్‌వర్మలపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో వారిని తొలగించకుండా విచారణ జరిగేవరకు వారిని నిరవధిక సెలవుమీద పంపిన మోడీ ప్రభుత్వంపై రాహుల్‌గాంధీ అనవసర ఆరోపణలు చేస్తున్నారు. వారి నియామకం, తొలగింపు, ప్రక్రియ గురించి మోడీకి తెలియక కాదు, కాని అత్యున్నత సంస్థలో జరిగిన నష్ట నివారణను యుద్ధప్రాతిపదికన సరిచేయడం ప్రభుత్వ బాధ్యత. పైగా దీనికి రాఫెల్ డీల్‌తో సంబంధం కలుపుతూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని తేలిపోయింది. సుప్రీంకోర్టు ఈ విషయమై ప్రభుత్వం పారదర్శకతకు కితాబిస్తూ తీర్పునిచ్చింది. ఏ న్యాయ వ్యవస్థ విషయంలో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై అభిశంసనకు ప్రయత్నించి రంజన్‌గొగొయ్ యింకా ఇతరులను రాహుల్ సమర్ధించారో అనే రంజన్ గొగోయ్ తీర్పులను నేడు రాహుల్ వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ బీరువో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్‌గా సిబిఐకు 50 ఏళ్ళపైచిలుకు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ హయాంలో మంచి పేరే వుంది. ఈరోజు రాహుల్‌గాంధీకి గురువింద గింజనీతిని గుర్తుచేయాల్సిన అవసరం వుందా? తమ రాష్ట్రంలోకి సిబిఐని అనుమతించబోమని చంద్రబాబు చేసిన ఉత్తర్వులు ఆయన ‘అవినీతి’ని కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నమే. ఏ తప్పు జరగనప్పుడు ఆయన, ఆయన పార్టీ, ఆయన ప్రభుత్వం సిబిఐకి భయపడడమెందుకు? పదవిలో వున్నాం గదా అని వ్యవస్థల మీద పటాటోపం చూపిస్తున్నదెవరు? కోర్టుల ఆదేశాలుంటే సిబిఐని ఎవ్వరూ ఆపలేరు. సిబిఐని కట్టడి చేస్తే అవినీతి మరీ ప్రబలే అవకాశముందని మాజీ సిబిఐ ఇడి శ్రీ లక్ష్మీనారాయణ కూడా వ్యాఖ్యానించారు. బిజెపివల్ల ప్రమాదం బూచి చూపిస్తూ వ్యవస్థలను భ్రష్ఠుపట్టిస్తున్నదెవరు? ఎన్నికల్లో తాము ఓడిపోతే ఇవిఎమ్‌ల టాంపరింగ్ జరిగినట్లు, గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్లు రాహుల్‌గాంధీ ద్వంద్వ వైఖరి అవలంభించడం సిగ్గుచేటు. మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తాము ఓడినా బిజెపి ఓటమిని హుందాగా స్వీకరించి ఎన్నికల్లో గెలిచిన గౌరవాన్ని పొందిందే కాని, ఎలక్షన్ కమిషన్, ఇవిఎమ్‌ల గురించి ఏ తరహా వ్యాఖ్యలు చేయలేదు. జియస్‌టిని అందరితో ఆమోదింపజేసి అమలుచేయగలిగిన వ్యవహార చతురత ఎన్‌డిఎ బలం. భారత్ ఆర్థిక వ్యవస్థ ఈరోజు పరుగులు పెడ్తోంది. 10 ఏళ్ళు అర్ధశాస్తవ్రేత్త చేయలేని పని ఓ చాయ్‌వాలా చేయగలిగాడు. దేశం మీద 32 బిలియన్ డాలర్ల అప్పు పెట్టి వెళ్ళిన యుపిఎ అప్పును తీర్చి ఖాజానాను కళకళలాడించిన మోడీ సత్తాను సవాలు చేయడం కాంగ్రెస్ పార్టీ రాజకీయ దివాళాకోరుతనాన్ని తెలియజేస్తున్నది. ఆధార్ కార్డును దేశ ద్రవ్య వినిమయ, చెల్లింపుల వ్యవస్థకు ఆధార స్తంభం చేసి ఏటా లక్ష కోట్లు పక్కదారి పట్టకుండా చేసిన మోడీ ప్రభుత్వ పనితీరును ప్రశంసించే వాస్తవికత వ్యవస్థల పేరున రంకు బొంకులాడుతున్న రాజకీయులకేం తెలుస్తుంది? యుపిఎ పదేళ్ళ పదవీ కాలంలో ముంబై, ఢిల్లీ, గౌహతి, హైద్రాబాద్, జయపూర్, వారణాసి, గుజరాత్‌లలో ఉగ్రవాదుల పేలుళ్ళకు సుమారు వెయ్యి మంది దేశ ప్రజలు బలి అయ్యారు. ఉగ్రవాదులకు వరసపెట్టి ఉరిశిక్షలు అమలుజరుపుతున్న ఎన్‌డిఎ అంతరంగిక భద్రతా వ్యవస్థను ఆక్షేపించే హక్కు కూడా కాంగ్రెస్ నాయకులకు లేదు. గత 4 సం.లలో ఉగ్రవాదుల భయం నుండి ప్రజలు కోరుకుని శాంతియుతంగా జీవిస్తున్నారు. బాధ్యతగల రాజకీయ పార్టీలు వ్యవస్థలు సరిగా నడిచేందుకు సూచనలు, సలహాలు యిచ్చి ప్రభుత్వానికి సహకరించాలి. నిందించడం కన్నా స్పందించడం ముఖ్యమని తెలుసుకోవాలి.

- తాడేపల్లి హనుమత్‌ప్రసాద్