Others

అవగాహనతో అసౌకర్యం దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడుపుతో ఉన్నప్పుడు సహజంగానే శరీరంలో చాలా మార్పులు సంభవిస్తాయి. వీటికి తోడు రకరకాల అనారోగ్యాలు, అసౌకర్యాలు నిరంతరం కలుగుతూనే ఉంటాయి. కొన్ని సహజంగా కలిగే అసౌకర్యాల గురించి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ అవగాహనతో వాటిని ఎదుర్కోవడం కూడా సులువు అవుతుంది.
వికారం
దాదాపుగా 70 శాతం మహిళలు తేలికపాటి నుండి సాధారణ స్థాయి వికారం, వాంతి సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. దీనే్న ‘మార్నింగ్ సిక్‌నెస్’ అంటారు. అనడానికి మార్నింగ్ సిక్‌నెస్ అన్నా దీని ప్రభావం రోజంతా ఉంటుది. కొద్ది మొత్తంలో ఎక్కువసార్లు తినడం వల్ల మార్నింగ్ సిక్‌నెస్‌ను అరికట్టవచ్చు. ఎక్కువ ప్రొటీన్ ఉన్న పదార్థాలు తినడం, ఎక్కువసేపు కడుపులో ఏమీ లేకుండా ఉండకుండా చూసుకోవడంతో మార్నింగ్ సిక్‌నెస్‌ను నియంత్రించవచ్చు.
అలసట
పిల్లలను కనడం అంత తేలికైన విషయం కాదు. గర్భం శరీరంలోని శక్తిని, రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్‌ను పీల్చేసి శరీరాన్ని ఒక రకమైన అలసటకి గురిచేస్తుంది. ఈ అలసట ప్రతి నిముషం ఉంది అన్న భావన కలిగేలా చేస్తుంది. పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవడం, గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయడం వల్ల అలసట తగ్గుతుంది.
తిమ్మిర్లు
కడుపుతో ఉన్నప్పుడు అత్యంత సహజంగా కలిగే మరో సమస్య తిమ్మిర్లు.. ప్రత్యేకించి కాళ్లలో.. కడుపులోని బిడ్డ వల్ల, తద్వారా పెరిగిన బరువు వల్ల మోకాళ్ళపై అధిక భారం పడుతుంది. దీనితో తిమ్మిర్లు వస్తాయి. ఇలాంటి సమయంలో అధికంగా కాల్షియం ఉన్న ఆహారాలు, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల దీన్ని అధిగమించవచ్చు.
మలబద్ధకం
కడుపుతో ఉన్న సమయంలో సాధారణంగా మలబద్ధకం తలెత్తుతుంది. ప్రోగేస్తేరోన్ అనే ఎంజైమ్ అధికంగా విడుదల అవ్వడం వల్ల డైజెస్టివ్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. దీనివల్ల ఆహారం చిన్న ప్రేగులో చాలా నిదానంగా జరుగుతుంది. ఇది మలబద్ధకానికి దారితీస్తుంది. ఈ సమయంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు, అధిక మొత్తంలో ఫ్లూయిడ్స్ తీసుకోవడం ద్వారా దీన్ని అధిగమించవచ్చు.