Others

ప్రకృతి ప్రకోపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అకాల వర్షం దండెత్తి పంటలని
తెగనరికినప్పుడు
మొదలంటా కుదుళ్లని
పెకలించి మట్టిని ఏడిపిస్తుంది

రా రమ్మని వేడుకోళ్లని తిరస్కరించి
చిత్తం వచ్చినప్పుడే హాజరు వేసి
సమూలంగా తుడిచిపెట్టే గాలి బీభత్సానికి
నేలరాలిన విత్తుల కన్నీళ్లు

గోదాములలో వెచ్చగా నిద్రించాల్సిన
రేపటి బువ్వగింజలు
అల్పపీడనానికి భయపడి
నిలువెత్తు తడిసిపోయాయ

మనిషి చేసిన తప్పిదమో
కనిపించని అదృశ్య శక్తో తెలియదు కాని
కాలం కాని కాలం పగబట్టి
అన్నదాతను అనాధను చేస్తున్నాయ

మట్టిని నమ్మినోడు
జలాన్ని ఈదేవోడు
అడ్డాపై ఆకలిని పరిచేవోడు
వృత్తులేవైనా
ప్రకృతి విసిరిన పంజాకి
కకావికలం కావాల్సిందే

అతివృష్టి అనావృష్టి చక్రంలో
రాష్ట్రాలన్నీ భయవిహ్వలులై పరిగెడితే
ఆపన్నహస్తం కోసం
ఎన్నో వేల కళ్లు
ఎదురుచూస్తున్నాయ

మనిషెంత గొప్పోడైనా
ఎన్ని విజయాలని సొంతం చేసుకున్నా
పంచభూతాత్మకతకి
తలవంచాల్సిందే

తుపాను పేరేదైనా విధ్వంసం మిగిల్చే
వేదనొక్కటే...
ప్రమాదం రాకమునుపే
నిద్రావస్థ నుంచి మేలుకోవాలి
నష్టాన్ని తగ్గించే క్రమంలో
విజయం చేకూరాలి...

- పుష్యమీ సాగర్, 9010350317