Others

నాలుగో అతిపెద్ద మానవహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ర్తి-పురుష సమానత్వానికి ప్రతీకగా పేర్కొంటూ కేరళలో అతి పెద్ద మానవహారం జరిగింది. జనవరి ఒకటో తేదీన కేరళ ఉత్తరభాగంలో కాసరగాడ్‌లో ప్రారంభమైన ఈ మానవహారం, దక్షిణ కేరళలోని తిరువనంతపురంలో గల 3వెల్లయంబాలమ్2 వరకు సముద్రతీరం వెంబడి రహదారుల మీదుగా కొనసాగింది. ఇందులో దాదాపు 50 లక్షల మంది మహిళలు, యువతులు, బాలికలు చేరుూచేరుూ కలిపి 620 కిలోమీటర్ల పొడవైన మానవహారంగా నిల్చున్నారు. ఇది ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద మానవహారంగా కేరళ మహిళల మానవహారం రికార్డు సాధించింది. ప్రపంచంలోనే అతి పొడవైన మహిళా మానవహారంగా ఈ 3విమెన్ వాల్2 రికార్డులకెక్కనుందని గిన్నిస్ బుక్ జ్యూరీ తెలిపింది.
గణాంకాల ప్రకారం 2017లో బీహార్‌లో నిర్వహించిన మానవహారం ప్రపంచంలోనే అతి పెద్దది. ఇక్కడి నితీశ్‌కుమార్ ప్రభుత్వం పూర్తిస్థాయి మద్యనిషేదాన్ని తీసుకొచ్చింది. దీనికి మద్దతు పలుకుతూ దాదాపు రెండు కోట్ల మంది ప్రజలు 12, 670 కిలోమీటర్ల పొడవైన మానవహారంగా నిల్చున్నారు. ప్రపంచంలోకెల్లా ఇదే అతి పెద్ద మానవహారం. ఇక 1986లో యునైటెడ్ స్టేట్స్‌లో నిర్వహించిన 3హ్యాండ్స్ అక్రాస్ అమెరికా2 రెండో అతి పెద్ద మానవహారం. పేదప్రజలు, ఆకలితో అలమటిస్తున్న నిరాశ్రయులకు సాయం చేసేందుకు అమెరికాలోని ఓ ఛారిటీ సంస్థ ఏర్పాటుచేసిన ఈ మానవహారంలో దాదాపు 65 లక్షల మంది పాల్గొన్నారు. 2004లో బంగ్లాదేశ్‌లో చేపట్టిన అవిశ్వాస మానవహారం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మానవహారంగా రికార్డు నమోదు చేసింది. ఇందులో యాభై లక్షల మందికి పైగా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, ప్రజలు పాల్గొని 1,050 కిలోమీటర్ల పొడవైన మానవహారంగా నిల్చున్నారు.