Others

‘సెల్ఫీ’ల వ్యామోహంతో బంధాలు బలహీనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక వెబ్‌సైట్లలో వెల్లువెత్తుతున్న ‘సెల్ఫీ’ల కారణంగా మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. స్మార్ట్ఫోన్లతో సెల్ఫీలు తీసుకోవడం, వాటిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోకి ‘పోస్ట్’ చేయడం అనేది నేడు చాలామందిలో ఓ వ్యసనంగా మారుతోందని అమెరికాలోని ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెల్ఫీల పుణ్యమాని ముఖ్యంగా ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయని అధ్యయనంలో కనుగొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సెల్ఫీలకు సంబంధించి జెస్సీకా రిడ్‌గ్వే, రస్సెల్ క్లేటన్ నేతృత్వంలో జరిగిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయని ఫ్లోరిడా విశ్వవిద్యాలయం తాజాగా ప్రకటించింది. కొంతమంది శృంగార జీవితంలో సైతం సమస్యలకు సెల్ఫీలు కారణమవుతున్నట్లు పరిశోధకులు గమనించారు. అనేక విపరిణామాలకు కారణమవుతున్నప్పటికీ యువతలో సెల్ఫీల జోరు తగ్గడం లేదు. సెల్ఫీల వల్ల తమ శారీరక ఆకృతికి సంబంధించిన విషయాలు ప్రపంచానికి బహిర్గతం అవుతున్నాయని అధ్యయనంలో పలువురు యువతీ యువకులు ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఆకర్షణీయంగా లేకుంటే ఆ వివరాలన్నీ సెల్ఫీల వల్ల ఇతరులకు తెలిసిపోతున్నాయని పలువురు చెప్పారు. సోషల్ మీడియాలో తమ ఫొటోలు ఉండడం ఇష్టం లేకున్నా సెల్ఫీల వల్ల తమ వ్యక్తిగత వివరాలు బహిరంగమవుతున్నాయని సర్వేలో చాలామంది తెలిపారు. సెల్ఫీలను ‘పోస్ట్’ చేశాక కొన్ని సందర్భాల్లో ప్రేమికులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాజుకుంటున్నాయి. అధ్యయనం సందర్భంగా 18 నుంచి 62 ఏళ్లలోపు వయసు కలిగిన 420 మంది ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదార్ల మనోభావాలను తెలుసుకున్నారు. ‘పోస్ట్’ చేసిన సెల్ఫీల సంఖ్య, వాటిని చూశాక పలువురి స్పందన, వ్యక్తుల మధ్య ప్రస్తుత సంబంధ బాంధవ్యాల పరిస్థిత వంటి అంశాలను లోతుగా అధ్యయనం చేశారు. తమ శరీర ఆకృతి, వ్యక్తిగత విషయాలు ఇతరులకు తెలియడం పట్ల చాలామంది తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ శరీరాకృతిని సెల్ఫీల్లో చూసి, పరిచయం లేనివారు సైతం ఇష్టానుసారం ‘కామెంట్లు’ చేయడం మానసిక వ్యధ కలిగిస్తోందని పలువురు తెలిపారు. ఈ పరిణామాలు నిజజీవితంలో కొన్నిసార్లు అనుబంధాలకు చేటు కలిగిస్తున్నాయి. అందచందాలను పొగిడేవారి సంఖ్య తక్కువగానే ఉంటోందని, వ్యతిరేక వ్యాఖ్యలు చేసేందుకే చాలామంది ఉత్సాహం చూపుతున్నారని సర్వేలో తేలింది. ప్రేమికులైనా, స్నేహితులైనా పరస్పరం ఆమోదం లేకుండా సెల్ఫీలను పోస్ట్ చేయడం వాంఛనీయం కాదని పరిశోధకులు సూచిస్తున్నారు.