AADIVAVRAM - Others

మనసునకెన్నో గాయాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మది ఊరటకేనేమో
మరి గేయాలు!!
తీయని వలపులు అవి ఎన్నటికి వీడని తలపులు
కన్నులలో కర్పూరం వికసించిన
ఆ రూపం
వలచిన ఎడదకు అపురూపం
నా మనుగడకు ఆశాదీపం
మొట్టమొదటగా..
మదనుని శరంలా..
ఆమె నన్ను కన్నులతో
కలసినప్పుడు
నన్నామె మూగమనసు
వలచినప్పుడు
ఆమె మేని పసిడిరంగు చాయలో
ఆ కాంత ఏకాంత సాయంత్ర వేళలో
కాలమక్కడే ఆగినప్పుడు
ఎద వీణ తంత్రులు మ్రోగినప్పుడు
ఆ గతమంతా వైభవమై
తలుపు తట్టినప్పుడు
మొదలయే గుండె చప్పుడు...
వీడిపోదు ఆ మధుర భావన
ననె్నప్పుడు-
గుట్ట మీద గువ్వల గుంపు
కట్టమీద కముజుల సవరింపు
ప్రేమికులకు కవ్వింపు
ఏకాంత సాయంత్రమే ఇంపు
కురులలో మల్లి విరిసి మెరిసి మురియు
చిరుగాలికి విరి పరిమళాల గుభాళింపు
చిగురాల చిలకమ్మలు ఓరగ గొరవంకల
గుబురాకుల ఎలకోయిల
చిగురులు మేసి కుహూకుహూ గీతికల
తీగసాగె ఆలాపన...
జగమూగసాగె సుఖ సరసున
చీకటులను పారద్రోలి వెనె్నలారబోసింది
పుచ్చపువ్వుల విచ్చి వెనె్నల
మిలమిలమనె ఎంకి కన్నుల
తళతళమనె ఏటి గలగలల తేలియాడు నురగల
జలజలమనె చిరుగాలి పరుగుల
గోదారి మురిపెంగ దరిసేరి
పడవోడ.. పల్లోడ.. వలపున్న పిల్లోడ
ముద్దుల నీ ఎంకి అద్దరిని ఉన్నాది
పొద్దుగుంకక ముందే పోయి రమ్మన్నాది
ఎంకాడ.. నీ నీడ.. బింకమ్ము నడుమాడ...
ముసిముసిగ నసిగేసి మురిపెంగ దరిసేరి
ఎద ఏరుల రసికత ముచ్చట ముప్పిరిగొన
మబ్బుమాటు జాబిలాయె
ఎంకి.. బావ ఎడదచేరె

-ఆచార్య క్రిష్ణోదయ 7416888505