Others

నేను పుట్టాను.. (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆప్యాయత అందుకోలేనివాడు, అభిమానం పొందలేనివాడు అనురాగం దక్కనివాడు, చాలా దురదృష్టవంతుడు. మనసు చంపుకు బ్రతుకుతాడు. మనసును బుజ్జగించి ఓదార్చుతాడు. మత్తును మింగి మైకంలో ఉండిపోతాడు. ఆలోచనల్ని నిద్రపుచ్చుతాడు. ప్రేమను పొందలేని జీవి ఎలా బ్రతుకుతాడో, పాడతాడో అలాంటి పలుకులు కూర్చి నేను పుట్టాను రాసాడు ఆత్రేయ. ఆత్రేయ పాటలు రాసినా, మాటలు రాసినా వాటిలో క్లుప్తత, ఆప్తత, ఆర్ద్రత కనిపిస్తాయి. నేను పుట్టాను లోకం మెచ్చింది/ నేను ఏడ్చాను లోకం నవ్వింది/ నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది/ నాకింకా లోకంతో పని ఏముంది.. డోన్ట్‌కేర్... -వ్యతిరేక లోకాన్ని లెక్కచేయనంటారు హీరో.
నేను తాగితే కొందరి కళ్ళూ గిరగిర తిరిగాయి/ నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి/ నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిసాయి/ తెల్లవారితే వెనకన చేరి నవ్వుకుంటాయి.
లోకం తీరుపై ఆత్రేయ సెటైర్. ఇంతకంటే గొప్పగా ఏముంటుంది? ఆత్రేయ మాటలే పాటలు. పాత్ర చిత్రణే ముఖ్యం ఆయన రచనకు.
మనసును దాచేటందుకె పైపై నవ్వులు ఉన్నాయి/ మనిషికి లేని అందంకోసమే రంగులు ఉన్నాయి/ ఎరుగక నమ్మిన వాళ్ల నెత్తికె చేతులు వస్తాయి/ ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి.. డోన్ట్ కేర్...
తన అనుభవాలను పాత్ర పేరుతో మనకు ఇలా పంచాడు ఆత్రేయ.
ఈ పాట ‘ప్రేమనగర్’ చిత్రంలోది. ఘంటసాల పాడారు. అక్కినేని నాగేశ్వరరావు నటించారు. ఆత్రేయ రాసారు. చిత్రంలో పాట సందర్భం, దానికి తగ్గట్టుగా కెవి మహదేవన్ సంగీతం కుదర్చటం, భావార్ధాలు అన్నీ సమపాళ్లలో కుదరటంతో చిరకాలం గుర్తుండిపోయే పాట అయ్యంది. ఈ పాట నాకు నచ్చిన పాట. ప్రేమనగర్ చిత్రానికి ఈ పాట ఓ హైలెట్. 1971లో ఈ సినిమా విడుదలైంది. ఇప్పటికీ ఈ పాట, ఆనోట ఆచోట వినపడుతూనే వుంటుంది. దర్శకత్వం కె సూర్యప్రకాశరావు, నిర్మాత డి రామానాయుడు, కథ, కోడూరి కౌసల్యాదేవి.

-తాడినాడ భాస్కరరావు, తణుకు