AADIVAVRAM - Others

మచ్చలు (సండేగీత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నప్పుడు దెబ్బలు తగలని వ్యక్తులు అరుదుగా వుంటారు. పరుగెడుతూ దెబ్బలు తాకిన వ్యక్తులు కొందరైతే, ఆటల్లో పడి దెబ్బలు అయిన వ్యక్తులు మరెందరో. ఈ దెబ్బలవల్ల అయిన గాయాలు మాని మచ్చలు కూడా ఏర్పడతాయి.
ఆ గాయాలను, మచ్చలను చూసినప్పుడల్లా ఆ సందర్భం గుర్తుకొచ్చి మనస్సు బాధతో నిండిపోతుంది.
మళ్లీ గాయాలు కాకుండా జాగ్రత్తగా వుండటానికి ప్రయత్నిస్తాం. అవసరమైన జాగ్రత్తలు కూడా తీసుకుంటాం.
ఆ మచ్చలు అయిన సంఘటనలు బాధాకరమైనవి. ఈ మచ్చలతో బాధ లేదు.
ఇలాంటి గాయాల మచ్చలు కాకుండా భావోద్వేగంతో కూడా అయిన మచ్చలు ఉంటాయి. అవి గుర్తుకొచ్చి కొన్నిసార్లు ఆవేదనకి లోనవుతాం. సిగ్గుతో తలదించుకుంటాం. అవి మాట్లాడుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి ఇష్టం ఉండదు.
అది భార్యాభర్తల మధ్య కావొచ్చు.
స్నేహితుల మధ్య కావొచ్చు.
బంధువుల మధ్య కావొచ్చు.
అలాంటి భావోద్వేగ మచ్చలను గుర్తుకు తెచ్చుకొని బాధపడటంలో ఫలితం లేదు. అందుకని వాటి గురించి ఆలోచించడం మానేస్తే మంచిది. అలాంటి ఆలోచనలు రాకుండా ఓ కోట గోడ కట్టాలి.
అంతేకాదు.
ఆ భావోద్వేగ మచ్చలని మరో రకంగా చూడటం అలవర్చుకోవాలి. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి.
మచ్చల గురించి బాధపడటం మానెయ్యాలి. ఆ మచ్చలు అయినప్పటికీ మనం ఇంకా బతికి వున్నామన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి.
గాయాలూ, మచ్చలు మనలని భయపెట్టకూడదు. వాటిని ఓ అనుభవంగా మనం చూసే పరిస్థితిని మనం తయారుచేసుకోవాలి.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001