Others

శ్రీకాళహస్తీశ్వరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిన్ను నమ్మినరీతి నమ్మనొరులన్, నీకన్న నాకెన్న లే
రన్నల్దమ్ములు తల్లిదండ్రులు గురుండాపత్సహాయుండు నా
యన్నా! యెన్నడు నన్ను సంస్కృతి విషాదాంబోధి దాటించి యు
చ్ఛిన్నానంద సుఖాబ్ధిఁ దేల్చెదొ కదే! శ్రీకాళహస్తీశ్వరా!
భావం:ఈశ్వరా! నేను నిన్ను నమ్మినట్లు ఇతరులను ఎవరినీ నమ్మను. నాకు నీకంటే అన్నలుగానీ, తమ్ములుగానీ, తల్లిదండ్రులుగానీ, గురువులుగానీ, కష్టాలలో ఆదుకొను ఆప్తులుగానీ ఇంకెవ్వరూ లేరు. నన్ను ఈ సంసార విష సముద్రమును దాటించి చిదానంద స్వరూపమైన సౌఖ్యసముద్రంలో ఎప్పుడు తేలియాడిస్తావో కదా! అంతా నీ దయ.
నీ పంచం బడియుండగాఁ గలిగిననన్భిక్షాన్నమే చాలు ని
క్షేపం బబ్బిన రాజకీటకముల నే సేవింపగా నోప, నా
శాపాకాశంబులఁ జుట్టి త్రిప్పకుము సంసారార్థమై, బంటుగాఁ
చేపట్టడం దయగల్గెనేని మదిలో శ్రీకాళహస్తీశ్వరా!
భావం: ఈశ్వరా! నీ చూరుకింద నిలబడగలిగినచో, నాకు ఆ అదృష్టమే చాలు; భిక్షాన్నమైనా తిని బ్రతుకుతాను. పురుగుల వంటి అధములైన ఈ రాజులను సేవింపలేను. నీవునీ సేవకునిగా అంగీకరించునంత దయ కలిగితే, నన్ను ఇంక ఆశాపాశములతో బంధించి ఈ సంసార తాపత్రయంలో పడేయక విముక్తున్ని చేయి.
నీ పేరున్, భవదంఘ్రి తీర్ధము, భవ న్నిష్ఠ్యూత తాంబూలమున్
నీ పళ్ళెంబు ప్రసాదమున్ గొని కదా నే బిడ్డనైనాడ! న
న్నీ పాటిం కరుణింపు మోపనిక నే నెవ్వారికిం బిడ్డగాన్
చేపట్టందగుఁ పట్టి మానఁదగదో శ్రీకాళహస్తీశ్వరా!
భావం: ఈశ్వరా! నీ నామస్మరణం, నీ పాద తీర్థం, నీవు నమిలి విడిచిన తాంబూలం, నీకు నివేదన చేసిన ప్రసాదం వీనిని స్వీకరించి కదా నీ పుత్రుడనైనాను! నీకిలా కొడుకు అయిన తర్వాత మరెవ్వరికీ కొడుకుగా పుట్టలేదు. నన్ను నీ దగ్గరికి చేర్చుకో. చేరుకున్న తరువాత మరలా విడిచిపెట్టకూడదు సుమా! (అనగా ‘నీ సేవ చేయు నాకు పునర్జన్మ లేని మోక్షమును ప్రసాదింపుము’ అని భావం)
అమ్మా యయ్య యటంచు నెవ్వరిని నే నన్నన్శివా! నిన్ను నే
సుమీ! నీ మదిఁ తల్లిదండ్రుల నటంచుజూడగాఁబోకు, నా
కిమ్మైఁ తల్లియుఁ తండ్రియున్ గురుఁడు నీవే కాన సంసారపుం
జిమ్మం జీకటి గప్పకుండఁ గనుమా! శ్రీకాళహస్తీశ్వరా!
భావం: అమ్మా అని, నాన్నా అని నేను ఎవ్వరినీ, ఏ జన్మలో పిలిచినా, ఆ పిలుపులన్నీ నినే్న అని గ్రహించు! ఆ జన్మలనిచ్చిన తల్లిదండ్రులను కాదని గ్రహించు. ఇపుడు నే నీ జన్మ ఎత్తాను. నాకిప్పుడు కూడా నీవే తల్లి, తండ్రి, గురువు. కావునా నన్ను ఈ జనన మరణరూప సంసారం అనే చీకటిలో పడకుండా కాపాడు. (కొడుకు చీకటిలో దారి తెలియక తల్లడిల్లుతుంటే, తల్లిదండ్రులు చూసి ఊరుకుంటారా? వానిని వెలుగులోకి తీసుకురారా? అలాగే నన్ను జ్ఞానప్రకాశంలోకి తెచ్చి రక్షించు)