Others

హితవాక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూఢ! జహీహి ధనాగమతృష్ణాం
కురు తనుబుద్ధే! మనసి వితృష్ణాం!
యల్ల భసే నిజకర్మోపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తమ్

జగద్గురువులైన శ్రీ ఆదిశంకరుల లలితాదేశ కశాఘాతం అది.
ధన + ఆగమ తృష్ణాం అంటే ధనమింకా రావాలనే తృష్ణను, జహీహి అంటే విడచిపెట్టుము అని భగవత్పాదులు బోధించారు. ‘‘డబ్బింకా రావాలి, డబ్బింకా రావాలి’’ అనే అనంతమైన తృష్ణ అంటే దాహం మానవుణ్ణి ఏ అకృత్యానికైనా ప్రేరేపిస్తుంది. సాధారణంగా కోరికలు రెండు విధాలు- సహజములైనవి, కృత్రిమమైనవి.
సహజమైన కోరికలు అవసరాలను దాటిపోవు. తగినంత అన్నం తింటే ఆకలి తీరుతుంది. నీటిని త్రాగితే దాహం తీరుతుంది. కాని కృత్రిమములైన కోరికలు అలా కాదు. అర్థకామాలు శ్రుతిమించితే అనర్థహేతువులు. అల్లంత ఎత్తుకు ఎగిసిపోవాలనే ఆరాటం అశాంతికి సోపానం.
కాబట్టి ఓ అల్పబుద్ధీ! మనస్సులో తృష్ణకు తావివ్వకు. నీ శ్రమకు లభించిన ధనంతో హాయిగా జీవించు. మనస్సును సంతృప్తి పథం వైపు మరల్చుకో! అదే సుఖజీవన మార్గం! అప్పుడే ఇలపై స్వర్గం!

-వ్యాఖ్యాత:డి.ఎన్.దీక్షిత్