Others

భారతీయ సంస్కృతీ మూల సూత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ అనే మాటకు ’ భా ’ అనే ధాతువు ఆధారం. భ యంటే ప్రకాశించు అని అర్థం. సమ్యక్ కృత అంటే బాగుగా చేయబడిన అని తాత్పర్యం. మానవుడు ప్రకృతిసిద్ధంగా సాగిపోతుంటాడు. అందుకు భిన్నంగా జీవిస్తే వికృతి. ప్రాకృతిక జీవనం సానపట్టినట్లయితే సంస్కృతి భారతీయ సంస్కృతిని శ్రేయస్సు అభ్యుదయము అనే రెండు మూలసూత్రాలపై ఆధారపడింది. సుఖము శాంతి రెండింటినీ లక్ష్యంగా చేసుకున్నది. సుఖము శరీర ధర్మము- శాంతి మనోధర్మము- శరీరము- మనస్సు- బుద్ధి- ఆత్మ నాల్గింటి సంతులనాన్ని భారతీయ సంస్కృతి సాధిస్తున్నది. ఇందుకు మూల సూత్రాలు వేదములలో ఉపనిషత్తులలో చెప్పబడ్డాయి. ఈ గ్రంథాలు భారతదేశంలోనే పుట్టినా వాటి ప్రయోజనం విశ్వమానవాళిని ఉద్దేశించినవే.
‘‘సర్వేజనాఃసుఖినోభవంతు
సర్వేః సంతునిరామయాః
సర్వేభద్రాణి మశ్వంతు
మాకశ్చిత్ యఃఖ భాన్ భవేత్’’
ఈ మూల సూత్రంతో భారతీయ ధర్మం నిలబడింది. దేశంలో ఒక మనిషి కాదు, కుక్క పస్తుపడుకున్నా స్వాతంత్య్రం వచ్చినట్లు కాదు అన్నాడు స్వామి వివేకానంద. శ్రుతులు శాశ్వతము స్మృతులు దేశకాలముల కనుగుణంగా మారుతాయి. ధర్మార్ధకామమోక్ష చతుర్విధ పురుషార్ధ సాధన మానవ జీవన లక్ష్యంగా మనవారు నిర్వచించారు.
‘ఒక జాతి అనేక కాలములలో ఫురోగమించిన సంవిధానమునందు సముద్భవించిన సౌమసేన విశేషమే సంస్కృతి.’’
ఈ వాక్యానికి అర్ధం ఏమిటంటే ఒక జాతి తన జీవన ప్రవాహంలో అనేక ఘట్టములను దాటి ముందుకు సాగిపోతున్నప్పుడు కాలక్రమంలో గుబాళించిన మానవీయ మూల్యములు మూలములు పాలపై మీగడ తరగలవలె మిగిలినవి. సంస్కృతిగా నిర్వచింపబడుతాయి. ఇట్టి సంస్కృతి ప్రతి జాతికీ ఆయా జాతుల జీవనక్రమాన్నిబట్టి రూపొందింపబడుతుంది. ప్రతి జాతిలోను కొందరు మహాపురుషులు జన్మిస్తారు. వారి త్యాగములు జీవనశైలి తర్వాతి తరముల వారికి పాధేయముగా ఉపాదేయముగా మిగిలిపోతుంది. ఈ మార్గదర్శక మూల సూత్రములనే సంస్కృతి అంటున్నాము. ఈ జీవ భావగతమైన ప్రేరణ క్లిష్ట పరిస్థితులలో ఆయా ఋషులు ఎలా ఆవిష్కరించారో దానిని ధర్మము అని నిర్వచిస్తున్నాము. ధర్మము వ్యక్తిగతమైనది కావచ్చు. జాతిగతమైనది కావచ్చు. ప్రాచీన కాలంలో ధర్మము అనే పదం ఎక్కువ ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది. నేడు సంస్కృతి అనే మాట ఆ స్థానాన్ని ఆక్రమించింది. ధర్మశబ్దం తెలుగులోవాడే అర్ధం వేరు. హిందీలో అర్ధం వేరు. హిందీలో ‘్ధర్మం’ అంటే మతం అనే అర్ధంలో ప్రయోగిస్తున్నారు (రెలిజియన్). ఈ సంస్కార సారాంశమే సంస్కృతి. సంస్కృతి లేనివాడు సంస్కారహీనుడు. అట్టి వాడు నేడు భారత జాతిలో ఉన్నాడు. అమెరికా గడ్డపై నిలిచినప్పుడు ఆ జాతిలోని పుణ్యపురుషులైన లింకన్ ప్రభృతులను గౌరవించటం సంస్కృతి. మరి భారతదేశంలో ఉన్నప్పుడు ఈ జాతిని నిర్మించిన ప్రాచీన మహాకవులు వ్యాస భాస వాల్మీకులును ఈ జాతి దేవతలుగా భావించిన రామకృష్ణ పరమహంసను గౌరవించవలసిన బాధ్యత ఈ జాతీయుల మీద ఉంది. అందుకు భిన్నంగా ప్రవర్తిస్తే సంస్కారహీనులు అనిపించుకుంటారు.
ఇలియడ్ రచించిన ట్రామ్ కథ గమనించాలి. అందలి కథానాయిక హెలెన్ వారి సంస్కృతికి చిహ్నము. భారతీయుల రామాయణం చూడండి. మన రామాయణంలోని సీత భారతీయుల సంస్కృతికి సంకేతము. ఎడ్వర్డు చక్రవర్తి ప్రేమకోసం సింహాసనం త్యజించాడు. రాముడు ధర్మంకోసం భార్యను త్యజించాడు. ‘ఆరాధనాయ లోకస్య’అనే రాముని ధర్మం ఇది భారతీయ ఆదర్శం.
అహింసా పరమోధర్మః అని భారతీయ వేదాంత ఆదర్శము ఐతే రాముడు కేవలం ఒక్క స్ర్తికోసం అంతటి లంకానగరిని ధ్వంసంచేయటం తగునా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతములో స్వాతంత్య్ర సముపార్జన చేశారు కదా- అని ఉదాహరణ చూపిస్తున్నారు. మహాత్ముడు నౌకాళీ దురాగతాలు జరిగిన తర్వాత అక్కడికివెళ్లి చూచాడు. ఎందరో స్ర్తిలు చెరచబడ్డారు. ఎందరి ఆస్తులో ధ్వంసమైనాయి. ఎందరినో పాకిస్తానీయులు పొట్టనబెట్టుకున్నారు. ‘ఏమయ్యా’ మీకింత అన్యాయం జరుగుతుంటే ఎట్లా సహించి ఊరుకున్నారు? అని ప్రశ్నిస్తే మీరేకదా స్వామీ! అహింసా బోధ చేశారు. అని వారు ఎదురుప్రశ్న వేశారు. ‘అయ్యో నేను జీవించి ఉండగానే నా అహింసామార్గం ఇంతటి వక్ర భాష్యానికి గురిఅయిందే’ అని గాంధీగారు విలపించారు కాబట్టి భారతీయులలో హింస, శక్తిహీన సంస్కృతి కాదని తాత్పర్యం.
భారతీయ సంస్కృతికి స్ర్తి గోవు, వేదము మానబిందువులు. వాటికి అవమానము జరిగినప్పుడు చేసెడి హింస అహింసయేనని ధర్మసూక్ష్మము.
వ్యక్తిశీలము గొప్పది. సమాజశీలము ఇంకా గొప్పది. ఇదొక ధర్మసూక్ష్మము. శరణాగతి భారతీయ సంస్కృతి. ఐతే గోరీ మహమ్మద్‌ను పృథ్విరాజ్ క్షమించి వదిలిపెట్టటం శరణాగతి కిందికి రాదు. ఇదొక ధార్మిక అపార్థము. స్వతంత్ర వీర సావర్కార్ భాషలో ‘‘సజ్జన వికృతి.’’, విగ్రహారాధన మన సంస్కృతిలో భాగము. ఐతే నాస్తికులు దీనిని పరిహసిస్తారు. విగ్రహంముందు నిల్చొని భక్తుడు ‘సహస్ర శీర్షం దేవం’అని మంత్రము చదువుతాడు. అంటే జనతా జనార్హన భావము ఇందులో దీని ప్రబోధము. ఇదే ఆలయ సంస్కృతీ సందేశము. ఐతే అదికూడా అఖండ భారత సంస్కృతిలో అంతర్భాగమే. సంస్కృతి ఆ జాతి సంగీతంలో సాహిత్యంలో జీవన విధానంలో కూడా ప్రతిబింబిస్తుంది. ఒక యుగంలోని ఒక దేశంలోని సాహిత్యాన్నిబట్టి ఆ యుగపు దేశపు సంస్కృతీ స్థాయిని మనం నిర్ధారింపవచ్చు.
ఆధునిక యుగంలో మనపై సాంస్కృతిక మతపరమైన దాడులు ఉధృతమైనాయి. ఇట్టి దశలో మహాకవులు తమ కలాలను గళాలను విప్పారు.
‘‘అతి మనోబుధ్య హంకృతులౌపనిషదు
వాత్తగండూషికత్రము లౌర్వవహ్ని
గర్ఛితాంతః తపస్కులు ఘనులు ఋషుల
కెవ్వరు విరోధి, తద్వధ కెత్తినయది’’అని విశ్వనాథ సత్యనారాయణగారు తన లేఖిని చూపించారు.
సంస్కృతి ఒక జాతియొక్క సర్వభావ సమాహారదృ వ్యక్తి- సమష్టి- సృష్టి- పరమేష్టి ఈ నాల్గింటి సమన్వయాన్ని భారతీయ సంస్కృతి సాధిస్తుంది. మానవునికి శరీరం ఉన్నట్లే ఒక దేశానికి భూభాగం (టెర్రిటరీ) ఉంటుంది. అందుకే రెండువేల సంవత్సరాల తర్వాత కూడా వారు కలియ గలిగారు. సంస్కృతి శిల్పంలో చిత్రలేఖనంలో సాహిత్య సంగీత రూపకాలల్లో ప్రతిబింబిస్తుంది. మన సమకాలీన సాహిత్య సంగీతాలనుబట్టి మన సంస్కృతిని అంచనా వేయవచ్చు.

-ప్రొ. ముదిగొండ శివ్రపసాద్