Others

ఎరుకతోసుఖదుఃఖాలు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనభై నాలుగులక్షల జీవరాశుల్లో పూర్తిగా జన్మపరంపరల గూర్చి ఎవరికీ తెలియదు. గత జన్మలో తనది ఏ జన్మో, ఇంకా రాబోయేది ఏ జన్మ అనేది కూడా అసలు తెలియదు.
ఇంకా చెప్పాలంటే ఒక్క మనిషి అనేకానేక ఊహాగానాలతో, అనుకుంటారే తప్ప, ఇతర జీవులకు, తమ జన్మ ఇదని, పుట్టుక, మరణం, గూర్చి ఏమితెలియదు. అందుకే జీవులన్నిటిలో ఉత్కృష్టమైన జన్మ మనిషి జన్మగా పేర్కొనడం జరిగింది అది యదార్థము.
ఏదో గత జన్మల మంచి ఫలమనో, పుణ్యఫలమనే కారణంగా మనుష్య జన్మ దొరుకుతుంది. మనిషి జన్మలో గొప్ప సువర్ణావకాశం కూడా ఉంది. జన్మ రాబోయేది మంచిగా దొరికే అవకాశం కూడా మనిషి జన్మలోనే సాధ్యం.
‘‘మనుష్యులు అనేకనేక స్థితిగతులతో జీవించడం కూడా ఆ ఫలమే. అందుకే పరమాత్మ గీతలో ఎన్నో సుద్దులు, బుద్ధులు చెప్పారు. ఉత్తమగతులు పొందడంకోసమే. ‘‘మనిషికి మనస్సు, దేహం, ఇతర జీవుల ద్వారా దైనికముగా ఎన్నో కష్టాలలో ఎక్కువ భాగం. తన మనసు ద్వారా ఎక్కువగా బాధల్ని తెచ్చుకోవడం జరుగుతుంది.
‘‘్భగవద్గీతలో 15వ అధ్యాయంలో 8వ శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ ఈ విధంగా చెప్పారు.
శ్లో॥ శరీరం యద వా ప్నోతి.... వాశయాత్!
గాలి వాసనలను ఒకచోటనుండి మరొకచోటుకి తీసుకుని పోయినట్లుగా శరీరంలో జీవాత్మ ఒక శరీరం విడిచిపెట్టేటప్పుడు ఆ శరీరంనుండి మనసు ఇంద్రియాలను - అనుగ్రహించి వాటితోగూడా మరొక శరీరమును పొందుతుంది.
శ్లో॥ మనః ఏమనుష్యాణాం కారణం
బంధ మోక్షయాః! ఈ జీవాత్మ అలాగే పంచేంద్రియాలతో మనసును ఆశ్రయించి ఆ ఇంద్రియాలవలన వచ్చే విషయాలను అనుభవిస్తుంది. శరీరంలో ఇంద్రియాలు బలీయము, శ్రేష్టము, సూక్ష్మము అని అనిపిస్తుంది. ‘‘ఇంద్రియాలకంటె మనస్సు బలమైనది. మనసుకంటె బుద్ధి శ్రేష్టమైనది, ఆ బుద్ధికంటె, అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది ఆత్మ అనికూడా చెప్పడం జరిగింది.
‘‘మనసు బుద్ధి మాట వినకుండా, అంతెందుకు మనసుకు, బుద్ధికి కూడా అనేకానేక ఆకర్షణ పరిస్థితులను మాయచే ఆవరించబడి ఉంటాయి. సూక్ష్మమైన ఆత్మను పట్టకోవడం సామాన్యులకు అందని విషయం.
‘‘సాధారణంగా పరమాత్మ అంశగా, ఆత్మ తనలో ఉందని విషయం సాధారంగా అవగాహన పడడం జరగదు. పరమాత్మను విడిచి తన మనసును ఆవరించి ఉన్న రాగద్వేషాలకు లోబడి తాము ఉన్న విషయం ఏంటని తెలుసుకోలేకపోవడమే. ‘‘మనిషి శరీరాన్ని అంటిపెట్టుకునే అంతర్ధార్ధంగా ఉన్న ఆత్మవేరు శరీరం వేరనేది వ్యవహారంలో మనిషి గ్రహించలేని విషయం. ఎంతసేపు మాయాజనితములైన రాగద్వేషాలను మనసు వశమవడం, ఎలాగంటే అలా తమ మనసువశమైన విషయం కూడా గ్రహించలేనంతగా, మమేకమవడం.
‘‘మనసు ఎంతసేపూ తనను అందరూ గుర్తించాలని తన మాట జరగాలని, ఇంటాబయటా వ్యవహారాలన్నీ జరగాలని ఎంతగా కోరుకుంటుందంటే ఏమాత్రం దీనికి భిన్నంగా ఎక్కడ జరిగినా విపరీతంగా బాధపడటం ఇంకా పట్టింపులు-పంతాలు పర్యవసానం, ద్వేషాగ్నిలో తాను కాలుతూ ఇతరులను కాల్చడం.
‘‘మనిషి తన మనసును అదుపుచేయగలిగితే అంతా తనకు సానుకూలమే. వ్యతిరేకత ఎక్కడా కనపడదు. విషయం, పరిస్థితి అర్ధంచేసుకోవడం జరుగుతుంది. అవగాహనా రాహిత్యం ఏదో ఒకటి మాట్లాడడం, తద్వారా మనసు గాయపడడం అనుకోవడం.
‘‘ఏదైనా పరిస్థితి సామ, దాన, బేధ, దండోపాయంతో చక్కపరచాలంటారు కదా! అలాగే మనసును కూడా, అలాగే అదుపు చేసుకోవాలి. రాగద్వేషాల మాయాజాలం, అరిషడ్వార్గాల ఉచ్చులోనుండి మనసు బయటపడ కలుగుతుంది.
‘‘మనసు నిర్మోహంగా మారితే బుద్ధివికాసానికి తద్వారా ఆత్మ జాగృతమునకు అవకాశం. ఇవి జరిగిననాడు పరమాత్మకు చేరువ కావడానికి మార్గం సుగమం అవుతుంది. మాయాజాలంనుండి బయటపడిన మనసు ‘నకారాత్మకత’అంటే ‘నేను’నాది ‘నా మాట’వీటన్నిటిని పట్టించుకోవడం తగ్గుతుంది. క్రమేణా అహంకారం, మమకారాలు ప్రాధాన్యత తగ్గుతుంది.
‘‘రాగద్వేషాల ఉచ్చులోపడి చరిత్ర హీనులుగా మారిపోయిన వారెందరో చరిత్రలో కలరు. కామానికి కీచకుడు క్రోధానికి ‘హిరణ్యకశిపుడు’ లోభానికి ‘దుర్యోధనుడు’, మోహానికి ‘్ధృతరాష్ట్రుడు’రావణాసురుడు’, మాత్సర్యానికి ‘విశ్వామిత్రుడు’గా చెప్తూంటారు. ‘మాత్సర్యపడినా తన తప్పు తెలుసుకుని ‘‘రాజర్షి’’గా మారారు. తన పేరు ‘విశ్వామిత్రుడు’ అనేది నిలుపుకున్నారు.
‘పురాణాలు చరిత్ర చెప్పుకోవడం ఎందుకంటే ఆ అరిషడ్వార్గాలతోనే రాగద్వేషాలు పుట్టేది, మనసును అతలాకుతలం చేస్తాయి. దానివలన మనిషి అసుర ప్రవృత్తికిలోనవడం, పతనమవడం జరుగుతుంది.
‘‘్భగవంతుడు’’ జ్ఞాన, ఐశ్వర్య, శక్తి, బల, వీర్య తేజో, మహితమైన ఆరువిధములైన అంశలతో ప్రకాశించే శక్తి ఎవరిలోనైనా ఈ ఆరు సంపదలు భగవంతుని దయా, ప్రసాదములే అగును. ‘‘ఆ షడ్గుణైశ్వర్య సంపన్న రూపంగల భగవంతుని గాంచాలన్న షడ్గుణ, దుర్గుణాలు లేకుండా మనసును ప్రక్షాళనము చేసుకోవాలి.

- శ్రీమతి గంటి కృష్ణకుమారి 9441567395