Others

సౌందర్యారాధనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌందర్యాధనం చాలామంది చేస్తుంటారు. అందం అంటే ఇష్టం లేనివారు ఎవరూ ఉండరు. అందులోను శారీరిక సౌందర్యం కాదు ఆత్మసౌందర్యం అంటే ప్రీతి చెందని వారు ఎవరూ ఉండరు. ఆ ఆత్మ సౌందర్యానికన్నా మించిన సౌందర్యం కృష్ణపరమాత్మది. ఆ దేవదేవుని సౌందర్యాన్ని చూడడానికి రెండు కనులూ చాలవంటారు కృష్ణ్భక్తులు. ఇపుడు అసలే మార్గశీర్షమాసం. గోదాదేవి ఆమె చెలికత్తెలందరూ పొద్దుపొద్దునే లేచి ఆ గోపాలబాలుని నందుగోపుని చూడరమ్మని ఒకరినొకరు పిలుచుకుని వెళ్తుంటారు.
అలా వెళ్లడానికి కారణం వారు ఆ పరమాత్మను మనసున నిలుపుకొనడం. ఆ పరమాత్ముని సేవించడానికి పూర్వజన్మ పుణ్యంకావాలి. యశోదాదేవికి గారాలతనయుడైన ఆ కృష్ణపరమాత్మ తమకూ తనయుడు కావాలని కొందరు కోరుకుంటే మరికొందరు రుక్మిణీ సత్యభామలకు ప్రియాతి ప్రియుడైన ఆ కృష్ణపరమాత్మ తమకు కూడానాథుడు కావాలని కోరుకుంటారు.
అందరూ మాత్రం చిన్ననాడు చిద్విలాసమూర్తియై చేసిన ఎనె్నన్నో దుష్టసంహారాలను, చూపిన లీలావిలాసాలను స్మరించి ఆనందిస్తుంటారు. అట్లాంటి ఆనందాల్లో కృష్ణపరమాత్ముని అంగాంగ సౌందర్యాన్ని వర్ణించుకుంటూ ఆ చిన్నివాడు గర్గముని దగ్గర నేర్చుకున్న పాఠాలు, తోడి గోపబాలురతో గోవులను కాయడానికి వెళ్లిచూపిన మహాత్మ్యాలు ఎనె్నన్నో ఉన్నాయి.
అట్లాంటివాటిల్లో పెరియాళ్వారు ఒకసారి కుంభకోణంలోని రాముల వారి కోవెలకు వెళ్లారట. అక్కడ కోదండపాణియైన రాముడు, ఆయన ప్రక్కన విల్లంబులు ధరించి లక్ష్మణమూర్తి కనిపించారట. అంతే ఆ స్వామిని వారి చేతిలోని కోదండాన్ని చూసి న పెరియాళ్వారుకు కృష్ణయ్య గుర్తుకువచ్చాడట.
ఆహా! ఇదేమి చోద్యం అలనాడు యశోదమ్మ ఒడిలో కూర్చుని పాలుకుడుపుతూ ఉంటే ఆ తల్లి కన్నయ్య ముఖారవిందంపై పరుచుకుంటున్న ముంగురులను సరిచేస్తూన్నపుడు కనీ కనబడుకుంటా కనబడిన కనుగొమ్మలు కదా ఇవి అనుకొన్నాడట. చూశారా! ఇది ఆళ్వారుల హృదయం. పైగా చిన్ని కృష్ణయ్య యశోద కస్తూరీ తిలకాన్ని, కాటుకను దిద్దుతున్నపుడు ఆ కన్నయ్య కనుగొమ్మలను చేతితో ముట్టుకుంటూ చక్కగా సరిచేస్తున్నట్టు భావన చేస్తున్నపుడు పెరియాళ్వారుకు ఎనలేని సౌందర్యం స్వామి ముఖారవిందంలో కనిపించిందట. ఆ స్వామి కనుగొమ్మలు ఎంత శక్తివంతమైనవో కదా అనిపించిందట.
ఆ స్వామిని పెంచడానికి ఈ యశోదా నందులు ఎంత పుణ్యం చేసుకొన్నారో కదా. దేవకీదేవులకన్నా వీరి పుణ్యం ఎంచగా వీలులేనిది లెక్కపెట్టగలేనన్ని పుణ్యరాశులను చేసుకొన్నారు కనుకనే ఈ కన్నయ్యను కడుపార కన్నట్టు, ఆతడే తమను పాలించే పాలకుడని అనుకుంటూ పెంచుతున్నారు. నిజమే వీరినేనా ఆయన పాలించేది అఖిల భువనాలను తన చిరు బొజ్జలో దాచుకున్న చిరుదరహాసమూర్తి కదా. వారినొక్కరినే కాదు కదా చరాచర జగత్తునంతా స్వామి కరుణార్ర దదృక్కులతో పాలిస్తున్నాడుకదా. అనుకొంటూ ఎంతో పొంగిపోయారట పెరియాళ్వారు.
ఆళ్వారులు స్వామిని ఎంతగా సేవించారో. లోకంలోని ప్రతీదీ వారికి స్వామి లాగే కనబడుతుంది. ఆ పెరియాళ్వారు ఆ కనుగొమ్మలను చూసి మన్మథుడు యువతీయువకులు ఒకరినొకరు ప్రేమించుటకై నల్లని బాణాలను వదిలాడు. ఈ రాముడు అజ్ఞాన అహంకారాలు కలిగిన ఈరావణాసురుని నిర్జించడానికి బాణా లు వదిలాడు. కానీ నా కన్నయ్య మాత్రం అందరూ తనను చూసి ప్రీతిచెంది హృదయానందాన్ని పొంది ఆ ఆనందంతో అడుగులు వేస్తూ వేస్తూ నా దగ్గరకు వచ్చి అచంచలమైన ప్రేమానందాబ్ధిలో మునిగి స్వధర్మాచరణను చేస్తూ అన్యథాశరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ ననే్న నమ్ముకునేట్లుగా చేసి వారి వారి పాపపంకిలాన్ని కడిగివేసి వారిని తనతోపాటుగా దివ్యపదానికి తీసుకెళ్లుదామని స్థిర నిశ్చయంతో రెండు నల్లని వంగిన కనుగొమ్మలను తన ముఖంపై పెట్టుకున్నారు కదా.
ఆహా కృష్ణయ్యా! నీకెంత వాత్సల్యమూ, కరుణ ఉన్నాయో కదా. స్వామి నీవే నాకు పరమపదానివి. నాకు నీవు తప్ప ఎవరునూ అక్కర్లేదు. సదా నీ నామస్మరణ చేసుకొంటూ నీ రూపాన్ని కనులారా చూస్తూ నీ తత్వాన్ని ఆకళింపుచేసుకొనే శక్తి నిమ్ము అని కోరుకుంటున్నారట పెరియాళ్వారు.
మరి ఇదే మంచికాలంకదా. మార్గళివ్రతాన్ని ఆచరించే మనమందరమూ ఆ అందాల యశోదాబాలుని సౌందర్యారాధనం చేస్తూ సేవించుదాం తరలిరండి తరణులారా!

- వాణి ప్రభాకరి