Others

సంఖ్యా ప్రాముఖ్యము ( పురాణాల్లో శాస్తవ్రిజ్ఞానం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ చక్రము- మానవశరీరము
ప్రతులకు H.No. 7-8-51, Plot No. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 79
==================================================================
భారతీయమైన సంస్కృత భాష ‘దేవభాష’యని వైదిక భాషయని ప్రసిద్ధిచెందిన విషయము మనమెరిగినదే. ఇది ఎంత రహస్య గర్భితమో అంత దివ్యత్వము గలది కూడా! అని చెప్పవలసియున్నది. వైదిక వాఙ్మయములోని ప్రతి పదము, ప్రతి వర్ణము(అక్షరము) తనదైన సంఖ్యా విలువను కలిగియున్నది కొన్ని పదములు కొన్ని ప్రత్యేక సంఖ్యా విలువను కలిగియున్నవి. ఆ విధముగా అక్షరములకు, పదములకు- సంఖ్యలకుగల సంబంధమును కొన్ని సూత్రముల ద్వారా నిర్వచింపబడినది. ఉదాహరణకు ‘‘కాదినవ-’ టాదినవ- యాదృష్ట్యా- పాదిపంచ’’ ఈ సూత్రములు కేవలము సాంకేతికములే కాదు. వీటియొక్క వైజ్ఞానిక మరియు స్వాభావికతనుబట్టి ఇవి చాలా పదముల- అర్థసంబంధ మరియు పార్యయత్వ విలువలను తెలుసుకొనుటకెంతయునుపకరించును. ఇట్టి కారణముచేతనే సంస్కృత వాఙ్మయ దివ్యత్వము నిర్ధారించబడుచున్నది.
ఉదాహరణకు ‘శ్రీరామ, రామ, రామేతి, రమేరామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే’అని పరమేశ్వరుడు పార్వతితో పలికినదాని అర్థమును సంఖ్యాపరముగా పరిశీలిస్తే ‘‘రామరామరామ’’అని మూడుసార్లు పలికితే విష్ణుసహస్ర నామములతో సమానమెట్లైనదో తెలుస్తుంది. రా=2, మ=5, రామ అంటే 2తి5=10, మరల రామ అంటే 10తి2తి5=100, మరల రామ అంటే 100తి2తి5=1000. సహస్ర నామములతో సమానమైంది. నామ ప్రపంచము యొక్క పారణ స్వరూపాన్ని, సంఖ్యాప్రపంచము తెలియచేస్తుంది.
ఇది పద రూపములను కలిపే లింక్ అన్న మాట కావున సంఖ్య అనేది నామరూపముల మధ్యన వుండి వాటి కార్యకారణ సంబంధమును తెలియచేస్తుంది. వేదపరమైన లేక వైదిక సాహిత్యానికి సంఖ్యా ప్రపంచంతోగల విడదీయరాని సంబంధము వేదానికి ‘‘్ఛందస్సు పర్యాయ పదముగా నిర్దేశించడమేనని తెలియచేస్తుంది. వేదంలోని ఛందస్సనే పదం సంఖ్యనే అర్థంగా సూచిస్తుందని తత్త్వజ్ఞులైన విజ్ఞులందరికి తెలిసిన విషయమే. వేదంలోని ప్రతి మంత్రమునకు తనదైన సంఖ్యాప్రాధాన్యాన్ని తెలియచేయడానికి దానికొక ఛందస్సు నిర్దేశించబడినది. కావున వేదాంత విషయపరంగా సంఖ్యా ప్రపంచానికి సంబంధించిన విషయానే్వషణ చేయడమనేది అత్యంత ఆవశ్యక విషయం. వేదాంత సిద్ధాంతములతో సంఖ్యలకుగల వైజ్ఞానికమైన సమన్వయాన్నొకింత పరిశీలిద్దాం. సంఖ్యాశాస్తమ్రంతయు ఒకటినుండి తొమ్మిదివరకు గల అంకెలు మరియు సున్నలయొక్క బహు విధ సంయోగ సమాయోజనమే తప్ప మరియొకటి కాదని తెలిసిన విషయమే. దీనికి ఎట్టి ప్రమాణావశ్యకత లేదు.
గణిత శాస్తమ్రందు లెక్కించుట కలవికాని దానిని ‘‘అనంతము’’అని సంకేతించినట్లే వేదాంతమందు ‘బ్రహ్మమును’ ‘పర’ ‘అపర’ అను పదములచే సూచించారు. ‘పరమ్’ అనే పదానికి సంస్కృతంలో ప్రత్యేకమైన స్థానం కలదు. ఈ పదం ‘పరః’అని పుంలింగములోను ‘పరా’అని స్ర్తి వాచకముగను, ‘పరం’అని నపుంసకలింగంలోను, మూడు విధములుగా ప్రయోగించబడుతోంది. ఇందు పుంలింగమైన ‘‘పరః’’అనే పదం ప్రతి వ్యక్తి తనను(శరీరాన్ని) ‘‘అహమని (నేను అని) వ్యవహరించు పురుషునిగా తెలియచేస్తుంది. ‘పరా’ శబ్దము అనంత సంఖ్యని, ‘పరమ్’ను ఈశ్వర శబ్దమునకు సూచితమైన యంత్రరూపమైన వృత్తమును తెలియచేస్తున్నాయి. ఇక్కడ సంఖ్యాత్మకమైన ‘‘అనంతము’’కూడా బ్రహ్మమునే సూచించు విషయాన్ని గమనించాలి. వేదముకూడా ‘బ్రహ్మము’ను ‘నవోనవోభవతి జాయ మానః’అని ఆవిర్భవించిన పురుషుని ‘నవవః’అని నవ శబ్దముచేత కీర్తించింది. ఈ నవ శబ్దముయొక్క నపుంసకలింగ వాచకమైన నవ సంఖ్య అనగా 9ని సూచిస్తోంది. బ్రహ్మవాచకమైన ఈ ‘నవ సంఖ్య’ ప్రణవమునకు కూడా సంకేతమని ‘‘తస్య వాచకః శబ్దఃప్రణవః’అని శాస్త్ర వచనమని పెద్దలు చెప్పియున్నారు. ముందుగా పురుషుడుగా అభివ్యక్తమైన బ్రహ్మమే ‘‘నమః’’అనియు, ‘‘పురుషః’’అనియు ప్రణవ స్వరూపుడనియు, అనంతుడనియు, ప్రజాపతియని వైదిక వాఙ్మయమున ప్రసిద్ధి.
ఇంకావుంది...

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9849560014