Others

యువత ప్రభావితం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ వివేకానంద స్వామీ జయంతి నుద్దేశించి జరుపుకుంటున్న ఉత్సవంలో నేడు ముఖ్యంగా నేటి యువతకు ఆయన ప్రబోధాలు ఎంతవరకు ఉపయుక్తమో తెలుపడానికి ఈ వ్యాసం! ఆయన పుట్టు పూర్వోత్తరాలు, ఆయన పర్యటనలు, ఆయన ప్రపంచ మహాసభ వివరాలు- నేను వ్రాయడంలేదు. హరినాథ్ నాకు ఓ పూర్వ విద్యార్థి. ‘ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారం’ అందుకుంటున్న సందర్భంలో ‘ది కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద’ వేదిక మీద నాకు బహూకరిచాడు. అన్నింటిని సమగ్రంగా చదవలేదు. ఎలాగైనా వాటిని కొంతైనా చదవాలని చదవగలిగాను.
అగమ్యగోచరంగా అల్లకల్లోలంగా వుంటున్న నేటి సమాజ వ్యవస్థను చూస్తున్న రేపటి పౌరులైన నేటి విద్యార్థులలో జీవన విలువల్ని, నైతిక జీవనవిధానం, సరియైన ఆలోచనలు, అవగాహనలను ఈ ఉద్బోధలు సముద్రానికి నీటి బొట్టు లోపం కాకుండా వారిలో నిర్మలత, నిస్వార్థత పెంపొందించగలవని ఆశ! యువత, యువకులు.. అనడంలో శ్రీ వివేకానందుడు యువకుడు. యువకులు ఆయనకు ప్రీతిపాత్రులు, భరతమాత ముద్దుబిడ్డలు, అందరూ బిడ్డలే కాని యువతను ఆయన సింహాలన్నారు.
‘‘్భరతమాత వేలకొద్దీ యువకుల త్యాగాన్ని ఎదురుచూస్తోంది, కావలసింది అలాంటి యువకుల మనోబలం, పశుబలం కాదు, కావలసింది శాంతమూ, నిరాడంబరమూ, అచంచలమైన కృషి- అంతేకానీ పేరు ప్రతిష్ఠలకై ఉబలాటం కాదు. ఈ సంగతి యువత జ్ఞప్తిలో ఉంచుకోండి’’ అన్నారు స్వామి. ‘‘యువకులారా! దరిద్రులను, దీనులను, అజ్ఞానులను లేవనెత్తే ఈ సానుభూతిని, ఈ కార్యదీక్షను, ఈ పోరాటాన్ని స్థిరాస్తిగా నేను మీకు ఒసగుతున్నాను. భగవంతుడే మన నాయకుడు. ముందుకు సాగిపోండి’’ అని ఉత్తేజపరిచారు ఆనాడు వివేకానందులు! ఎందుకంటే ఆయన దృష్టి అంతా యువకుల మీదే లగ్నమై ఉండేది.
శ్రద్ధ, సహనం, చిత్తశుద్ధి యువతలో మూర్త్భీవించి ఉంటుందన్నాడాయన. దానికితోడు ఉడుకురక్తం వారిది. అలాంటి యువతను కొందరు స్వార్థపరులు తమ ప్రయోజనాలకై వారిలో అవిద్య, నిరాశ, నిస్పృహ, నిరుద్యోగం వంటి లోపాలను తమకుపయుక్తంగా వారిని అసాంఘికంగా సమ్మెలు, ఆర్సన్సు, హత్యలు, హర్తాళ్ళు వంటి సంఘ విద్రోహక చర్యలకు వినియోగించి మన దేశ ప్రగతికి వలసిన యువత వనరులను నాశనం చేసి లాభపడుతున్నారు. ప్రజల ధనాన్ని స్వార్థానికి వినియోగించి, ఎందరినో దారిద్య్ర రేఖకు అడుగులోకి అణచి అన్నమో రామచంద్ర అన్న అరుపులు వినని చెవిటివారవుతున్నారు. వీరి ఆట కట్టు ఎప్పుడు? ఎవరు ఉద్యమిస్తారు? అలాంటి అన్నార్తులకు మతబోధలు ఎందుకు? అంటూ స్వామి వివేకానంద అందుకు యువత దుష్టశక్తుల నెదిరించాలి. అందుకు వారు విద్యాబుద్ధులతో బాటు విచక్షణాజ్ఞానాన్ని పొందాలి అన్నారు.
ఆయనకు తల్లే ఉత్కృష్టమైన గురువయ్యారు. దానగుణం, పెంపుడు జంతవులు, పక్షులపట్ల ప్రేమపాత్రునిగా తీర్చిదిద్ది ధీర గంభీర హృదయునిగా ఆ తల్లి ‘‘తండ్రీ! నీలో దోషం లేకపోతే నీకేం భయం? ఏ కర్రలో నిప్పు ఉంటుందో, ఆ కర్రే కాలుతుంది. నిశ్చయంగా నీకు న్యాయమని తోచేదాన్ని హరిహరబ్రహ్మాదులు అడ్డుపడ్డా ఆచరించడం మానకు’’ అంటూ ఉద్బోధ చేసేది. మూఢ విశ్వాసం, భయం అన్ని బలహీనతలనుంచి ఆయన్ను విముక్తుణ్ణి చేసిన గొప్ప గురువు స్వామి తల్లిగారు! అందుకే ఆయనకు భయమంటే అసహ్యం. ‘‘వీర భరత పుత్రా! ధైర్యం వీడకు. నేను భారతీయుణ్ణి. భారతీయుడు నా సోదరుడు, నా ప్రాణం. కార్యనిర్వహణలో త్యాగం చేయడానికి, నా సహోదరులపట్ల ప్రేమ ఔదార్యాలను పాటిస్తాను’’ అని యువతకు ఆయన మేల్కొలుపు. ‘ఆత్మ స్వాతంత్య్రాన్ని అరికట్టకు, అజ్ఞానం నుండి బయటపడు’ అని ప్రవచించారు.
సాహసం యువతకు సహజం! అందులో స్వామి విక్రమార్కుడు. అందుకే ప్రపంచ పర్యటన చేయగలిగాడు. 14 ఏళ్ళ వయస్సులో ఆ నరేంద్రుడు అందరితోబాటు నాటకాన్ని వీక్షిస్తున్నాడు. ఇంతలో ఎవరో ఒక నటుణ్ణి పట్టుకోవడానికి అరెస్టు వారెంట్ పట్టుకొచ్చాడు. అంత చిన్న వయసులో నిర్భయంగా జనంలోనుండి ఆ చిన్నారి అరవడం, దాంతో అందరు ప్రేక్షకులు గొంతు కలపి ఆ వ్యక్తిని తరిమారట! అందుకే యువత మంచిని పెంచడానికి, చెడును నిరోధించడానికి సాహసం చేయగలరు. అతనిని మించిన ప్రేమమూర్తి, పరోపకారి లేరు. గానం, ధ్యానంలో ఆయనకు ఆయనే సాటి. ఇక ఆయనను మించిన వక్తలు లేరట!
‘‘వక్తలకు వక్తృపంచాస్యమట! ఆచార్యులకు అపర శంకరాచార్యులట! పండితులకు విద్యవాచస్పతట!’’- ఇక ప్రజానాయకోత్తముడు కావడంలో ఆశ్చర్యం లేదు. అంతటి నాయక లక్షణాలు, లైటింగ్ ఓరేటర్ కాబట్టి విశ్వ సభల్లో పిన్‌డ్రాప్ సైలెన్స్‌తో మంత్రం వేసినట్లు చెవులిచ్చి ఎందరో శిష్యులయ్యారంటే అతిశయోక్తి కాదు!
ఆటల్లో, పాటల్లో, భజనల్లో, ప్రార్థనల్లో ఆయన నాయకుడట. యువకులలో ఏ సంఘం ఏర్పడినా, ఏ సమాజం స్థాపించబడ్డా దాన్లో ఆయన లేకుంటే తీరని వెలితిగా కనిపించేదట.
ధ్యానం బాల్యం నుండే అలవరచుకున్న నరేంద్రుడు ‘‘తల్లీ! వినిర్మల భక్తి మాత్రం ప్రసాదించు’’ అని వేడే ఆతనికి ధ్యానంలో ఉండగా, చెంత పాము నడయాడి హాని చేయక, తన దారిని పోయిన విషయం తెలుసుకుని స్వామి, ‘‘చిన్నతనంలో ధ్యానంలో నేనెంత హాయిగా ఉన్నానో’’ అన్నారుట.
ఓ యువకుడు స్వామిని దర్శించి ‘‘తాను గది తలుపులు బిడాయించి కళ్ళు మూసుకుని రోజూ ధ్యానం చేస్తున్నానని, కాని శాంతి లభించలేదని, మార్గం చూపమని’’ కోరారట. అందుకు ఆయన ప్రేమపూరితుడై ‘‘నా మాటల్లో నీకు గురి ఉంటే మొదట నీవు నీ గది తెలుపులు తెరచి, మూసుకున్న కళ్ళు విప్పి నీ చుట్టూ వున్న పరిస్థితులను పరికించు. నీ ఇరుగు పొరుగుల్లో వందలాది దీనులు నిస్సహాయులుగా పడి ఉన్నారు. నీ శక్తి మేరకు వారిని సంరక్షించు. రోగులకు మందులిచ్చి సేవించు. క్షుదార్తులకు భోజనం పెట్టు. విద్యావిహీనులకు నీవు నేర్చినవిద్య గరపు. మనశ్శాంతికి నీకిదే మార్గం’’ అన్నారుట.
‘‘బలిష్టుల్ని, మేథానిధులను రూపొందించే జాతీయ విశ్వవిద్యాలయాలు స్థాపించబడాలి’’ అని ప్రబోధించారు. ‘కామినీ కాంచన వాంఛలు ఆత్మహత్యగా పరిగణించాలి’, ‘ఏనుగు దంతాలు ముందుకు వస్తాయే కానీ వెనుకకు ఎన్నడూ పోవు’’- ఇదే ఆయన యువతకిచ్చిన ప్రబోధ.
‘‘వివేకానందాస్ వర్డ్స్ ఆర్ గ్రేట్ మ్యూజిక్, ఫ్రేజెస్ ఇన్ ది స్టైల్ ఆఫ్ బిథోవెన్, స్టిరింగ్ రిథిమ్స్ లైక్ ది మార్చ్ ఆఫ్ హాండిల్ కోరస్’’

-పరిమి శ్యామలా రాధాకృష్ణ