Others

నవభారత నిర్మాణం నరేంద్రుడి స్వప్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం నిజంగానే ఒక విప్లవాన్ని సృష్టించింది. పాశ్చాత్య దేశాలలో జాతీయ భావాలు బలపడి జాతీయ రాజ్యాలు ఏర్పడుతున్న సమయమది. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జాతీయ చైతన్యం బలం పుంజుకుంటున్న సమయమది. ఆ సమయంలో ప్రపంచంలో ఇద్దరు గొప్ప వ్యక్తులు జన్మించారు.. 1818లో కారల్ మార్క్స్ జన్మించాడు. భారత్‌లో 1863లో వివేకానందుడిగా ప్రసిద్ధి పొందిన నరేంద్రుడు జన్మించాడు. అందులో ఒకరు మానవ చరిత్రను గతితార్కిక భౌతిక వాద పద్ధతిలో వ్యాఖ్యానించి భావి నాగరికతను విప్లవాత్మకం చేసేందుకు ప్రయత్నించారు. మరొకరు భౌతిక వాద నాగరికత ఉత్థాన పతనాలను పరిశీలించి ప్రాక్పశ్చిమ మత వ్యవస్థలను హేతుబద్ధమైన, చైతన్య శీలమైన తిరుగులేని వేదాంతపు తర్కంలో విప్లవీకరించారు.
ప్రపంచంలో క్రైస్తవానికి తిరుగులేదని నిరూపించుకొనేందుకు 1893లో ‘ప్రపంచ మత మహా సమ్మేళనం’ అమెరికాలో ఏర్పాటు చేయగా, భారతీయ వేదాంతం, ఆధ్యాత్మిక జ్ఞానానికి తిరుగులేదని నిరూపించాడు స్వామి వివేకానంద. ఏ విప్లవానికైనా మానవుని నైతిక, ధార్మిక ప్రవర్తనే కీలకమని ఆయన చెప్పాడు. ఆధ్యాత్మిక శక్తిసంపద లేకపోతే మతం కూడా అంధకారమైపోతుందని, అందుకే భౌతిక వాదానికి కొనసాగింపుగా ఆధ్యాత్మికత అనేది ఎంతో అవసరమని స్వామి వివేకానంద భావించాడు.
స్వామి వివేకానందుడు తన ఆధ్యాత్మిక జ్ఞానంతో మానవ నాగరికతా వికాసానికి, సాంస్కృతిక జాతీయ వాదానికి బీజం నాటాడు. ఆ విత్తనం ఈరోజున ఒక ఫల రూపంలో ప్రపంచమంతటా కనబడుతున్నది. ఆధ్యాత్మికత ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. మతం వద్దు ఆధ్యాత్మిక జ్ఞానం కావాలని కోరుకొనే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెరుగుతున్నది.
చాలా దేశాలలో జీవన శైలిలో వస్తున్న మార్పులు, సుఖాల కోసం వెంపర్లాడడాన్ని వివేకానందుడు ఆమోదించలేదు. ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన జీవితం గడపటానికి కావలసిన కనీస సౌకర్యాలు అందరికీ సమకూరాలని, అదే మనిషికి ఆధ్యాత్మిక సాధనకు కావలసిన వెసులుబాటు కలిగిస్తుందని, మానసిక శక్తిని అందిస్తుందని వివేకానందుడు భావించాడు. ‘‘అత్యధిక సంపదల వల్ల కలిగే భోగ లాలసత గాని, తీవ్ర దారిద్య్రం వల్ల కలిగే దైన్యం కాని లేని స్థితిలో క్షణికమైన ప్రాపంచిక ప్రలోభాలపట్ల వైరాగ్యం, నిస్సంగత్యం జనిస్తాయి. సామాజికంగా ఆర్థికంగా మధ్యస్థ స్థితివల్ల జనించే వైరాగ్యానికి ఆధ్యాత్మిక సాధనను ప్రేరేపించగలిగే ప్రభావశీలురైన వ్యక్తులు భారతదేశంలో తయారుకావాలి. అటువంటి వ్యక్తులు భారత దేశ సందేశాన్ని ప్రపంచానికి అందించగలుగుతారు’’ అని చెప్పారు. స్వామి వివేకానందునిలోని ప్రగాఢమైన దేశభక్తి, ఈ దేశ జన సామాన్యం సముద్ధరణపై ఆయన పడిన తపనలో వౌలికమైన ఆకాంక్షలను గ్రహించకుండా ఆయనను దేశభక్తియుతుడైన స్వాతంత్య్ర యోధునిగానో, మాయ ముసుగు ధరించిన కమ్యూనిస్టు మేధావిగానో భావిస్తూ వివేకానందుడి గురించి అపోహలు సృష్టించినవారు కూడా ఉన్నారు. వివేకానందుడు సామ్యవాదే కాని మార్క్సులాగా భౌతికవాది కాదు.
సామ్యవాదం- వివేకానంద - మార్క్స్
ఈ దేశంలో సామ్యవాద భావజాల వికాసంలో వివేకానందుని ప్రాముఖ్యతను మొట్టమొదటిగా గుర్తించినవారు కే.దామోదరన్ అనే భారతీయ కమ్యూనిస్టు మేధావి. ‘ఇండియన్ థాట్’ అనే పుస్తకంలో- ‘రష్యాలో సామ్యవాద విప్లవం రావటానికి రెండు దశాబ్దాల ముందే వివేకానందుడు సామ్యవాద నినాదాన్ని లేవనెత్తాడు. నవతరానికి ఆయన గొప్ప స్ఫూర్తిదాయకుడు’ అని అనటంలో ఆశ్చర్యం లేదని వివరించాడు. స్వామి వివేకానంద వ్యక్తిత్వాన్ని, ఆయన సందేశాన్ని సామ్యవాద దేశాలు ప్రస్తుతించాయి. రష్యా,చైనాలలో స్వామివివేకానంద 120 జయంతిని అధికార పూర్వకంగా నిర్వహించారు. వివేకానంద ఆదర్శాలను ప్రస్తుతిస్తూ రష్యా, చైనాలలో అనేక పుస్తకాలు కూడా వచ్చాయి.
సామాజిక పరివర్తన అనే యంత్రానికి తగిన ఇంధనం కావాలి, ఆ ఇంధనమే వేదాంతమని వివేకానందునికి స్పష్టమైన అవగాహన ఉంది. వివేకానందుని సామాజిక చింతనలో మరో స్పష్టత జాతీయ సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థానంలో ఉన్న వారిని పడగొట్టటం కాదు, దిగువున ఉన్న వారిని ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళటం. మార్క్స్ మాత్రం భారమంతటినీ కేంద్రీకృత సమాజంపైన, సామూహిక జీవనంపై ఉంచాడు. మార్క్స్‌కు భౌతికవాదమే మూలాధారం, వివేకానందునికి సత్య సిద్ధాంతమైన వేదాంతం ముఖ్యమైనది. ‘తత్వమసి’ అనే మహావాక్యంలో అద్వైత సిద్ధాంత సారమున్నది. అందుకే వివేకానందుడు ఈ దేశం బాగుపడాలంటే జన సామాన్యాన్ని జాగృతపరచాలని చెప్పేవాడు. మన జాతి చేసిన అతి పెద్ద పాపం జనసామాన్యాన్ని నిర్లక్ష్యం చేయడం, ఆ జన సామాన్యులను ఎదగనిస్తే ఈ సమాజం బాగుపడుతుంది అని చెప్పారు. ఈ నూతన మంత్రమే ఈ దేశంలో గొప్ప పరివర్తనకు నాంది అని చెప్పవచ్చు.
జాతీయత- మార్క్స్- వివేకానంద
జాతీయత విషయంలో మార్క్స్, వివేకనాందుల అభిప్రాయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. 19వ శతాబ్దంలో ప్రపంచమంతటా జాతీయభావాలు ఉప్పొంగాయి. ఐరోపా ఖండంలోని వివిధ దేశాలలో జాతీయ భావాలు ప్రభావంతో రాజ్యవ్యవస్థ కూడా ఏర్పడింది. భారతదేశంలో కూడా బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా జాతీయ చైతన్యం నిర్మాణమైంది. ఆ కాలంలో మార్క్స్ మాత్రం జాతీయభావంపై అంతగా దృష్టి పెట్టలేదు.
ఆర్థిక శక్తులు ఆడే ఆటలో నుంచి జాతుల పుట్టుకను వెతికి పట్టుకోవలసి ఉందని మార్క్స్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో వివేకానందుని ఆలోచనలు చాలా భిన్నంగా ఉన్నాయి. వివేకానందుడు సాంస్కృతిక జాతీయవాదానికి చాలా పెద్దపీట వేసాడు. ‘జాతీయతకు సంస్కృతే ఆధారం. ప్రపంచంలో ప్రతి దేశం పుడుతుంది కాని పుట్టించబడదు. ప్రతి దేశం ఒక లక్ష్యాన్ని నెరవేర్చటానికి దైవ సంకల్పంతో జన్మిస్తుందని’ ఆయన చెప్పారు.
హిందూత్వం- మార్క్స్- వివేకానంద
‘్భరతీయులు’ అనే అర్థంలో హిందువులని, ‘్భరతదేశం’ అనే అర్థంలో హిందుస్థాన్ అని మార్క్స్ మాట్లాడుతూ ఉండేవాడు. భారతదేశంలో ఏ మతానికి చెందిన వారైనా అందరూ హిందువులేనని, ఒకవేళ మతాలు వేర్వేరుగా చెప్పవలసి వచ్చినప్పుడు హిందువులు, ముస్లింలు అని చెప్పేవారు! భారతదేశస్థులను ఉమ్మడిగా చెప్పవలసి వచ్చినప్పుడు హిందువులు అనే పదం వాడారు. మన స్వాతంత్య్రం చాలావరకు హిందువులపైన, హిందువుల ఐక్యతపైనే ఆధారపడి ఉందని మార్క్స్ అన్నారు.
హిందుత్వంపై స్వామి వివేకానంద ‘నేను హిందువునని గర్వంగా చెప్పుకుంటే వేల సంవత్సరాల మహాపురుషుల పరంపర, చరిత్ర, సంస్కృతి మనకు గుర్తువస్తాయి. హిందుత్వాన్ని సమరశీలంగా చేయటమే నా జీవన లక్ష్యం’’ అని చెప్పారు. ‘సనాతన ధర్మం’ పాటించబడాలని ఆయన గట్టిగా చెప్పేవారు. ‘ప్రస్తుతం మనకు ముంచుకువస్తున్న అతి పెద్ద ముప్పు ఇతర మతాలలోకి మనవారు మతం మార్చబడటం, దానివల్ల హిందువుల సంఖ్య క్షీణించబడుతున్నది. చాలావరకు దానికి మన చట్టాలు కూడా దోహదం చేస్తున్నాయి. మన మొదటి తక్షణ కర్తవ్యము మతం మార్పిడులు ఆగిపోయేట్లు చేయటం. హిందూ ధర్మంలోకే తిరిగి రాదలచుకొన్న వారిని గౌరవంగా స్వాగతించాలి. మన పొరపాటులను సరిచేసుకొని ఒక నూతన శక్తిని నిర్మాణం చేయాల’ని వివేకానంద చెప్పేవారు. వ్యక్తి నిర్మాణమే సాంస్కృతిక జాతీయ వాదానికి పునాది అని చెప్పారు. స్వామి వివేకానందుడు హిందూ సమాజ పునరుజ్జీవనానికి, సాంస్కృతిక జాతీయ వాదాన్ని శక్తివంతం చేయటానికి, హిందూ సమాజం సామాజికంగా శక్తివంతంగా ఉండటానికి కృషిచేసినవారు. వివేకానందుడు ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక దార్శనికుడు, ఒక సామాజిక పరివర్తకుడు, వివేకానందుని భావజాలంతో సాగుతున్న జాతి పునర్నిర్మాణ కార్యంలో మనమందరం పాల్గొని వివేకానందుడు కలలుగన్న భారతాన్ని నిర్మాణం చేద్దాం. ఆ సంకల్పమే ఈ జాతికి శ్రీరామరక్ష.

-ఆర్.మల్లికార్జునరావు