Others

‘సంహిత’ మేధను కాదని సాయుధ బీభత్సమా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌కు చెందిద సంహిత అనే అమ్మాయి 16 సంవత్సరాలకే బీటెక్ పూర్తిచేసి ఇటీవల ‘క్యాట్’ పరీక్షలో మంచి స్కోర్ సాధించి వార్తల్లోకెక్కింది. ఈ అమ్మాయి పదేళ్ళకే పదవ తరగతి ప్యాసయింది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలామ్‌తో చిన్నప్పుడే కలసి ముచ్చటించింది. తనకున్న జ్ఞాపకశక్తిని నమ్ముకుని ముందుకు దూసుకుపోతోంది. భవిష్యత్‌లో గొప్ప ఆర్థికవేత్త కావాలన్నదే తన లక్ష్యమని సంహిత అంటోంది.
వర్తమాన పరిస్థితుల్లో ఆధునిక టెక్నాలజీ ఆధారంగా కొనసాగుతున్న డిజిటల్ ఎకానమీకి మరింత వనె్న తెచ్చేలా సంహిత కృషి చేయగలదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల అమెరికాలో జరిగిన ‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఎక్స్‌పో-2019’లో విజ్ఞాన విశ్వరూపం ప్రదర్శితమైంది.
సంహిత జ్ఞాన సంచయానికి, వాస్తవిక అంచనాలకు, ముందుచూపునకు దేశంలోని మావోయిస్టుల అంచనాలకు, ముందు చూపునకు హస్తిమశకాంతరముంది. ఇటీవల ఒడిశాలో మావోయిస్టులు రోడ్డు నిర్మాణంలో ఉన్న ఐదు వాహనాలను దగ్ధం చేసి అక్కడ కాపలాగా ఉన్న రబీంద్ర మల్లిక్ అనే వ్యక్తిని కాల్చి చంపారు. ఈ ఘటన కొందమాల్ జిల్లా పుల్చాణీ సదర్ పోలీసుస్టేషన్ పరిధిలో జనవరి తొలి వారంలో జరిగింది. ఈ దుశ్చర్యకు కొండమాల్- కొలహండి నయాగఢ్- బౌద్ద్ డివిజన్‌కు చెందిన మావోలు పాల్పడ్డారు. ధ్వంసం... విధ్వంసం... హింస... హత్యలు... అడవుల్లో మకాం... ఈ రకమైన కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందా?... సంహిత లాంటి కొత్తతరం ఆర్థికవేత్తల ఆలోచనలవల్ల వాస్తవిక అంచనాల ఆధారంగా రూపొందించే కార్యాచరణవల్ల దేశ ఆర్థిక అభివృద్ధి చెందుతుందా?... అన్నది ప్రతిపౌరుడు ఆలోచించదగ్గ అంశం.
19వ శతాబ్దపు కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో కారల్ మార్క్స్ రూపొందించిన ఆర్థిక సూత్రాలు- ప్రణాళిక ఒక శతాబ్దంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఉన్నతీకరణ చెందుతున్న సమయంలోనూ ఆచరణలో పెట్టేందుకు ఇలా ధ్వంస రచన చేస్తూ పోతే దానికి ప్రాసంగికత ఉంటుందా?
‘కలలు కనండి... వాటిని సాకారం చేసుకోండి’ అని మాజీ రాష్ట్రపతి , శాస్తవ్రేత్త అబ్దుల్ కలాం మాటలతో, ఆలోచనలతో స్ఫూర్తి పొంది వర్తమాన పరిస్థితులకనుగుణమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించడం అవసరమా? లేక 175 సంవత్సరాల క్రితం టెక్నాలజీ అంతగా వికసించని, శ్రమశక్తిపై పూర్తిగా ఆధారపడిన కాలంనాటి డైనమిక్స్ ఆధారంగా కారల్‌మార్క్స్ రూపొందించిన ఆర్థిక నమూనాను అభిమానించి ఆచరణలో పెట్టేందుకు రక్తపుఏరులు ప్రవహింపజేయాలా? ఈ సూక్ష్మ విషయాన్ని అటు మేధావులు, ఇటు యువకులు తీక్షణంగా యోచించాల్సిన సందర్భమిది. మన చుట్టూ ఉన్న పరిస్థితులేమిటో వాటిని ఎలా మెరుగుపరచుకోవాలో సమకాలీన జ్ఞాన బలిమితో ప్రయత్నించడం యుగయుగాలుగా జరుగుతున్న ప్రక్రియ.
విచిత్రమేమిటంటే మావోయిస్టులు సమకాలీన జ్ఞానాన్ని, వర్తమాన స్థితిగతుల్ని గాలికొదిలేసి తొలి పారిశ్రామిక విప్లవం తొలినాళ్ళ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని కారల్ మార్క్స్ వెల్లడించిన సూత్రీకరణలను, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో చైనాలో మావో పేర్కొన్న ‘లాంగ్ మార్చ్’ వ్యూహాన్ని రంగరించి భారతదేశంలో మావోయిస్టులు ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’ పేర హింసా మార్గాన్ని ఎంచుకుని, గ్రామీణ- అటవీ ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణాలు జరగకుండా, అభివృద్ధి పనులు సాగనీయకుండా అడ్డుకుంటూ, ధ్వంసం చేస్తూ, బుగ్గిపాలు చేస్తూ కాపలాగా ఉన్న అమాయకులను కాల్చిపారేస్తూపోతే ఏ వెలుగులకీ ప్రస్థానం? అన్న ప్రశ్న ఉదయిస్తుంది కదా?
సమాజాన్ని వెలుగుల వైపు నడపడం రాజకీయ పార్టీల లక్షణం, లక్ష్యం కావాలి గాని ఇలా హింస, విధ్వంసంతో, హత్యలతో, కాలం చెల్లిన ఆర్థిక సూత్రాలతో సమాజాన్ని వెనక్కి నడపడం భావ్యమా? అందుకు రాజకీయ పార్టీ అవసరమా? అలాంటి పార్టీని ప్రజలు తలపై పెట్టుకుంటారా?
గొప్ప ఆర్థికవేత్తగా ఎదగాలనుకుంటున్న సంహిత లాంటి మెరికల్లాంటివారు కలలుగంటున్న కాలమిది. వారి కలల్ని సాకారం చేసుకునేందుకు అవసరమైన నైపుణ్యం, జ్ఞానం, పనిచేసే శక్తి-యుక్తి అన్నీ వారిలో ఉన్నాయి. ఈ విషయం ప్రపంచమంతటా ప్రస్ఫుటమవుతోంది. దీన్ని చూసేందుకు నిరాకరిస్తూ, అటువైపు దృష్టి పెట్టేందుకు తృణీకరిస్తూ ఉష్టప్రక్షిలా మావోయిస్టులు భూమిలో తలలుదూర్చి 175 ఏళ్ళ క్రితపు ఆనవాళ్ళకోసం తరిచి చూడ్డంలో ఏమైన అర్థం కనిపిస్తోందా?
ప్రపంచమంతటా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది, తదనుగుణమైన రీతిలో ప్రజల జీవనమున్నది. దేశ అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధి. ప్రజల ఎదుగుదల అంటే దేశ ఎదుగుదల అన్న సూక్ష్మ విషయం అందరూ అంగీకరిస్తున్న సందర్భం- సమయంలో, ఎప్పుడో రాచరిక- భూస్వామ్య కాలం నాటి ఆర్థిక సూత్రాలనే భుజాలపై మోస్తూ వర్తమాన కాలంలో నాలిక గీసుకోవడానికి సైతం పనికిరాని ఆ సూత్రీకరణల ఆధారంగా మావోయిస్టులు మరణ మృదంగం మోగిస్తే మానవాళికి మేలు జరుగుతుందా?
బాల్యంలోనే ఆర్థికవేత్త మన్మోహన్‌సింగ్‌పై వ్యాసం రాసి బహుమతి పొంది పెరిగి పెద్దయ్యాక తన కాలానికి అవసరమైన రీతిలో ఆర్థిక వ్యవస్థకు ‘మార్గదర్శనం’ చేసేందుకు సిద్ధమవుతున్న సంహిత లాంటి వాళ్లు దేశంలో ఎందరో ఉన్నారు. వివిధ రంగాల్లో రాణిస్తూ తమ ఊహలకు రెక్కలు తొడుగుతున్న ప్రతిభావంతులు నడయాడుతున్న ఈ నేలపై మావోయిస్టుల హింసకు మాన్యత ఉంటుందా? మేనేజ్‌మెంట్ పాఠ్యాంశంపై లోతైన అధ్యయనాలు జరుగుతున్నాయి. వివిధ అంశాలకు అన్వయిస్తున్నారు. వివిధ రంగాలలో ప్రతిభ కనబరుస్తున్న వారు సైతం మేనేజ్‌మెంట్ గూర్చి తెలుసుకుని ఆచరణలో పెడుతున్నారు. సంహిత సైతం మేనేజిమెంట్‌పై ఆసక్తితో ఉంది. ఆ సబ్జెక్ట్ ఆమెకు కరతలామలకం లాంటిదే!
ఇలా ఎన్నో ప్రత్యేకతలతో, కొత్త కొత్త అంశాల విశే్లషణ వింగడింపులో సృజనాత్మక శైలిలో సమకాలీన సమాజ అవసరాల కనుగుణమైన పద్ధతుల్లో ఆయా రంగాలను అభివృద్ధి పరుస్తూ దూసుకుపోతున్న సందర్భంలో, ఈ మేధోస్రవంతికి కృత్రిమ మేధ తోడ్పడుతోందన్న నగ్నసత్యాన్ని పట్టించుకోకుండా మొరటుగా మావోయిస్టులు మర తుపాకులు, మందుపాతరలు పేలుస్తూ ‘కాలం’పై ‘మరక’ను సృష్టిస్తే ఎవరు శ్లాఘిస్తారు?
మానవ వనరుల పట్ల అపార గౌరవం ఏర్పడిన ఈ కాలంలో ఆ వనరులను అడవిపాల్జేసి, మలేరియా లాంటి జబ్బుల పాల్జేసి వారి జ్ఞాన సంచయాన్ని, తెలివితేటల్ని ఉత్పత్తికి వినియోగించకుండా అడవి కాచిన వెనె్నల చేస్తే ఎవరు మెచ్చుకుంటారు? ప్రత్యామ్నాయం... ప్రత్యామ్నాయమంటూ కలవరించినా ఆ ప్రత్యామ్నాయం ప్రజల శక్తి, సామర్థ్యాలను, జ్ఞానాన్ని నిరర్ధకం పాల్జేయకూడదు కదా?

-వుప్పల నరసింహం 99857 81799