Others
ప్రతిప్రకృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తల్లి భాషలో
దిక్కులు తెలియనితనం
ఆపై తూర్పూ పడమరా
ఉత్తరం, దక్షిణం అని
పలకలేనితనం ఓవైపు
వెరసి
మార్కెట్‌నే మొనగాడిగా నిలబెడుతూ
మనిషిని మాత్రం నామమాత్రంగానైనా
ఉచ్చరించని సాంఘిక విద్య సాగుతుందిక్కడ
రాజకీయ క్రీడలాడుతున్నారిక్కడ
మనిషి భాషని మూగపరుస్తున్నారిక్కడ
నకార తివాచీలతో ఆతిథ్యాలిస్తున్నారిక్కడ
కల్యాణమండపం ఖరీదు
ఓ రాష్ట్ర బడ్జెట్ అయన చోట
కోట్ల అనారోగ్యాలు కొండల్లా
కొలువుదీరడం ఓ ప్రతిప్రకృతి చర్య
త్రాసులు తూచలేని తులాభారం
పూలూ పత్రాలూ, తులసీదళాలూ
గరికార్చనలూ, ఫల పూజలూ
దేహాలు కాంతివంతమవ్వాలనే!
దెయ్యాల మార్కెట్లు వర్ధిల్లాలని కాదు
రూపుదిద్దుకున్న చట్టాలన్నీ
తుఫానులోని పూరిళ్లలా, పంటచేలలా, మూగజీవాల్లా
పైకప్పులూడి తిరగబడుతూ
బంగారు వనె్నలు కోల్పోతూ
ప్రాణాలు వదిలేస్తూ
పునరావృతమైన ఆరోగ్య తృణధాన్యాల
మేలు కలయక భోజనాలు
రుచులు అందించే
అందమైన అరతాకుల్లో ఆరగించి
హరిత హరిత ఉత్పత్తి సంతతి
నిరతం నిగనిగలాడాలని
నీలకంఠుని మెడలో నేత్ర పుష్పార్చనల
సాలోచనతో ప్లాట్‌ఫాం మీద మనిషి!