Others

నాలో నేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోగిమంట ముందు కూచొని
ఆత్మదీపం వెలిగించుకుంటూ
నాలోపలి చీకటి తొలగి
మనసంతా వెనె్నల పరచుకుంటుంది
నా యెదుట నేనే నిలబడి
ఒక్కో పురాతన ద్వేష బీజాన్ని
మంటలను అర్పిస్తుంటాను
ఎప్పటివో తెలియదు గాని
కొన్ని జ్ఞాపకాలు కూడా నాలోంచి
గబుక్కున మంటల్లో దూకేస్తుంటాయ
ఆత్మ దీపపు వెలుగుల్లో
స్వచ్ఛమైన మనసు
వెనె్నల రజనుతో కప్పివేయబడ్డాక
అద్దంలో నా ముందు నిలబడుతుంది
మునుపెన్ని బాధాతప్త జ్ఞాపకాలను
మంటలకు అర్పించానో
అన్ని పునర్జన్మ లెత్తినట్లు
మనో దర్పణంలో సాక్షాత్కరిస్తాయ
తప్పులకు లెంపలేసుకుంటూ
నిలువు గుంజిళ్ళు తీస్తాయ
నేనే అమాయకంగా
వాటిని చూస్తూ చూస్తూ మైమరిచిపోతూ
మంటల్లో దహించుకుపోతున్న
అరిషడ్వర్గాలకు తిలోదకాలు వదలుతూ
మనస్ఫూర్తిగా మంటలకు నమస్కరిస్తాను

- గుర్రాల రమణయ్య, 9963921943