Others

నవ్యతకు నాంది సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు మకరరాశిలోనికి పరివర్తనం చెందే రోజు సంక్రాంతి. ఈ రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ సంక్రాంతి పండుగ తెలుగువారికి మూడు రోజుల పండుగ పెద్దపండుగ. ముందు రోజు భోగిపండుగ. ఈ రోజున గోదాదేవి మార్గళి వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుని చేపట్టిన రోజు అని గోదారంగనాథుల వివాహాన్ని చేస్తారు. అన్నీ వైష్ణవాలయాలు, శివాలయాలు విశేషపూజల జరిపించుకునే జనాలతో కిటకిటలాడుతుంటాయ.
మరుసటిరోజు అంటే ఉత్తరాయణం ఆరంభమయ్యే రోజు సంక్రాంతి కొత్తవెలుగులు చిందే రోజు. ఆ రోజునే సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలో ప్రవేశించటమే మకర సంక్రమణం లేక ‘సంక్రాంతి’. మకర సంక్రాంతి నాడు సూర్యుడు ఉత్తరాభిముఖుడై, భూమిపైన ఉత్తరార్థ గోళంలో ప్రవేశిస్తాడు. పితృదేవతలను పూజిస్తారు. పితృదేవుళ్లకు తర్పణాలు వదులుతారు. వూరందరికీ పండుగ. వారు వీరు అనే తేడాల్లేకుండా జరుపుకునే సంక్రాంతి రోజున విశేషగౌరవాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు.
వ్యవసాయధారుల చేతికి పంట వచ్చేకాలం ఇది. కనుక రైతన్నలందరూ కొత్తపంటలను ఇంటికి తెచ్చుకుని ఆనందంతో ఉంటారు. తమకు పంట పండించడానికి సాయంచేసినవారు, తన జీవనం సాఫీగా నడవడానికి సాయం చేసిన కర్మచారులను అందరినీ పిలిచి తాను పండించిన పంటలో కొద్ద్భిగాన్ని వారికి కూడా ఇచ్చి వారినీ కూడా ఆనందింపచేస్తాడు.
జానపద కళాకారులైన బుడుబుక్కలవాళ్ల పాటలు, దాసరుల వైష్ణవ సంకీర్తనలు, జంగందేవర శైవనామాలు, గంగిరెద్దుల వాళ్ల ఆట పాటలు, సన్నాయి మేళాలు వాయంచేవారిని - ఇలాంటి వారినందరిని పిలిచి వారు పంచే జానపద సంపదను అందు కుంటూ తాను పండించిన పంటలో వారికి కొంత భాగాన్ని పంచుతూ వారిని గౌరవిస్తారు.
స్ర్తిలు సావిత్రి గౌరీవ్రతం చేస్తారు. సంక్రాంతినాడు నువ్వులు బియ్యం కలిపి శివుణ్ణి అభిషేకిస్తారు. సంక్రాంతి రోజున శివునికి నువ్వుల నూనెతో దీపం పెడితే శని దోషాలు తొలగిపోతాయని పురాణవచనం. స్ర్తిలందరూ పండు తాంబూ లాలను, పసుపుకుంకుమలను పంచుకుని ఆనందిస్తున్నారు.
మూడవరోజు అసలు కారకాలైన ఎడ్లను గోవులను పూజించుకునే రోజు. పశుజాతి చేసిన సాయాన్ని గుర్తించుకుని వాటిని గౌరవించేరోజు కనుమ పండుగ.. కొత్తపంటతో వండిన పొంగళ్లను పెట్టి కొమ్ములకు రంగులు పూసి ఉత్సవాలు చేసే పండుగే కనుమ. వ్యవసాయవృద్ధిలో తమకు చేదోడుగా వున్న పశుగణాన్ని పూజించే రోజు. పశువులను కడిగి అలంకరించి వాటిని పూజించి సాయంత్రంవేళ ఎడ్లబండ్లకు కట్టి ఊరు ఊరంతా తిప్పుతారు. దీన్ని బండ్లు తిప్పటం చేసే పండుగ ఇది. జాజు, సున్నం పట్టీల అలంకరణతో ఈ బండ్లు ఎంతో కన్నుల పండువుగా ఊరేగింపులో ఉంటాయ.
సంక్రాంతి మూడుదినాలలో బొమ్మల కొలువులను తీర్చుస్తారు. కొత్త అల్లుళ్ళను, కూతుర్లను ఇంటికి పిలిచి ఆనందంగా పిండి వంటలతో భోజనాలను ఆరగిస్తారు.ఈ పండుగకు నెలముందు నుంచి వాకిళ్లల్లో రంగవల్లులు తీర్చడం తెలుగునాట ప్రత్యేకత. కోడిపందేలు, గాలిపటాలు, హరిదాసులు, పితృతర్పణాలు, గంగిరెద్దులు, భోగిపళ్ళు, బొమ్మల కొలువులు, పశువుల పూజలు, నోములు మొదలైనవెన్నో ఈ సంక్రాంతిలో చోటుచేసుకుం టాయ. శ్రీమద్భగవద్గీత పఠనం, గంగాస్నానం, త్రికాల గాయత్రి సంధ్యావందనం, గోవిందనామ స్మరణం ఇలాంటి వాటితో పాటుగా కూష్మాండం, కంబళి, ధాన్యాదులు, లోహాలు, వస్త్రాలు, తైలదీపదానాలు చేస్తే మంచిదని శాస్త్ర వచనం. కొత్త్ధాన్యంతో అరిసెలు, పొంగలి, పులగం మొదలన పిండివంటలు వండి బంధుమిత్ర జనంతో కలసి భోజనం చేసి ఆనందించే పండుగే సంక్రాంతి.

- జంగం శ్రీనివాసులు