Others

నాకు నచ్చిన పాట..తెలిసిందా బాబు నీకు తెలిసిందా బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దొంగరాముడు చిత్రంలో పెండ్యాల సంగీత దర్శకత్వంలో సుశీల ఆలపించిన ‘తెలిసిందా బాబు నీకు తెలిసిందా బాబు’ అనే పాట నాకు చాలా ఇష్టం. బడికి వెళ్లక అల్లరి చిల్లరిగా తిరుగుతూ చెడుదారిలో పయనిస్తున్న చిన్నపిల్లవాణ్ణి మాష్టారు కఠినంగా శిక్షిస్తాడు. ఆ బాబుకి చెల్లెలు మంచి బుద్ధులు చెబుతూ పాడిన పాటే ఇది. గురువు చెప్పినట్లు వినాలని, అల్లరి పిల్లలతో ఆడవద్దని, గిల్లికజ్జాలు చేయవద్దని, ఈతలు కోతలు వద్దని ఈ పాట ద్వారా చెబుతుంది. చదువుకు సున్నా పెట్టవద్దని, గురువుకు నామం దిద్దవద్దని, పొరపాటు పనికి పోవద్దని, మర్యాదకు లోటు తేవద్దని ఆమె కోరుతుంది. వినయం మీరేటట్లు తల్లి పాదాలకు ప్రతిరోజూ మొక్కమని, మనసున చెల్లెలి మాటలు మరువక మన్నన చేయాలని, ఇరుగుపొరుగూ శభాష్ అని పొగిడేలా మెలగాలని ఈ పాట ద్వారా చెల్లెలు అన్నకు హితబోధ చేస్తుంది. అన్నను మంచి దారిలోకి తేవాలని ఈ పాట ద్వారా ప్రయత్నిస్తుంది. ఇది ఈనాటి పిల్లలకు తప్పనిసరిగా నేర్పించాల్సిన పాట. చక్కని సాహిత్యం, నైతిక విలువలను ప్రబోధిస్తూ పాడిన ఈ పాట నాకు మరీ మరీ ఇష్టం.

-సరికొండ శ్రీనివాసరాజు
వనస్థలిపురం
****

వెనె్నల రచయితలకు
సూచన
వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

ప ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.
ప కొత్త సినిమాలపై సమీక్షలు రాయాలనుకున్న ఔత్సాహికులు ముందుగా ఒకటి రెండు సమీక్షలు పరిశీలన కోసం రాసి పంపితే, పరిశీలించగలం.
ప తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే కొత్తసినిమాలను పరిశీలించే ఆసక్తి వున్నవారు, సంబంధిత వ్యాసాలు పంపితే అవీ ప్రచురణార్హమే.
ప కొత్త హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వ్యాసాలకు కూడా స్వాగతం.
ప ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాని, అపురూప చిత్రాలువుంటే పంపొచ్చు.
ప రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో పళశశళ్ఘబజూళషష్ఘశ్ఘౄజ.ష్యౄకు మెయల్ చేయగలరు.
ప ప్రచురించిన (మీ వ్యూస్ మినహా) ప్రతి వ్యాసానికి పారితోషికం వుంటుంది.

మా చిరునామా :
ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03