Others

చిత్తరువుతో ఛత్రపతికి నివాళి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయతా భావాన్ని రగిలించి జనహృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ అంటే ఆమెకు ఎనలేని గౌరవం.. పరిపాలనాదక్షుడిగానే గాక ప్రజానేతగా కీర్తిశిఖరాలను అందుకున్న శివాజీ ఆలోచనలు, ఆకాంక్షలు ఇప్పటి తరానికి తెలియజేయాలన్నదే ఆమె తపన.. తరాలు గడచినా ఎప్పటికీ స్ఫూర్తిదాతగా నిలిచే ‘్ఛత్రపతి’కి వినూత్న రీతిలో నివాళి అర్పించాలని ఆమె సంకల్పించింది.. దాదాపు పది నెలలపాటు శ్రమించి 19 అడుగుల వెడల్పు, 8 అడుగుల పొడవుతో ఓ అద్భుత చిత్తరువును ఆమె ఆవిష్కరించింది. జనం మధ్యలో రథంపై శివాజీ మహారాజు ఊరేగుతున్న దృశ్యం ఆ చిత్తరువులో నయన మనోహరంగా కనిపిస్తుంది. మహారాష్టల్రోని సతారా పట్టణానికి చెందిన శ్రుతి దండేకర్ 20,888 గుడ్డపీలికలను కుట్టుపనితో అలంకరించి ఈ భారీ చిత్తరువును తీర్చిదిద్దారు. కుట్టుపనిలో నైపుణ్యం, రంగుల మేళవింపుతో రూపొందిన ఈ చిత్తరువుకు ‘డిజిటల్ ఉమెన్స్ అవార్డు’ దక్కింది. జయ జయ ధ్వానాలు చేస్తున్న జనంతో శివాజీ మహారాజు నడివీధిలో నడయాడినట్లు ఆ చిత్తరువును చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది. అవార్డును స్వీకరించిన సందర్భంగా శ్రుతి మాట్లాడుతూ, తాను సృష్టించిన భారీ చిత్తరువు కన్నా జీవితం ఎంతో విశాలమైనదని అభివర్ణించారు. గత ఏడాది మార్చిలో చిత్తరువుకు సంబంధించిన కుట్టుపనిని ప్రారంభించి, ఈనెల 6న ఆమె పూర్తి చేశారు. పెయింటింగ్స్‌లో కనిపించే రంగుల మేళవింపు, కళా నైపుణ్యం ఈ చిత్తరువులో చోటుచేసుకోవడాన్ని ఎంతోమంది ప్రముఖులు ప్రశంసించారు. ప్రతి గుడ్డపీలికనూ జాగ్రత్తగా అతుకుతూ విభిన్న రంగులతో ఓ దృశ్యాన్ని ఆవిష్కరించడం ఎంతో శ్రమతో కూడినపని అని శ్రుతి చెబుతున్నారు. తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఇంతటి భారీ చిత్తరువును పూర్తి చేయడంలో కుటుంబ సభ్యులు ఎంతగానో సహకరించారని ఆమె తెలిపారు. ఛత్రపతి శివాజీకి నివాళిగా రూపొందించిన ఈ చిత్తరువు పూర్తవగానే తాను పడ్డ శ్రమను మరచిపోయి ఎంతో సంతృప్తికి లోనయ్యానని ఆమె గుర్తు చేస్తున్నారు. ఏ పని పూర్తి చేయాలన్నా సహనం, ఓర్పు, నైపుణ్యం, ఏకాగ్రత అవసరమని తాను తెలుసుకొన్నానని ఆమె చెబుతున్నారు. చిత్తరువు పని ప్రారంభించినపుడు తనను ఎవరు పట్టించుకొన్నా, పట్టించుకోకపోయినా- పది నెలల శ్రమ తర్వాత తన ప్రతిభను అంతా కొనియాడుతున్నారని శ్రుతి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.