AADIVAVRAM - Others

బల్దియాలో ‘పాటల వనం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషన్నాక కాస్త కళాపోషణ ఉండాలన్నారు ఓ సినీ రచయిత. కానీ, ప్రతి మనిషికి పుట్టుకతోనే దేవుడు ఏదో ఒక ప్రతిభ, కళ, గొప్పదనాన్ని ప్రసాదిస్తాడనేది భగవంతుడ్ని నమ్నే ప్రతి ఒక్కరి విశ్వాసం. ఈ రెండు అంశాలను విశ్వసిస్తూ తన మధుర గానాలాపనతో అందర్నీ మంత్రముగ్దులను చేస్తున్నారు జీహెచ్‌ఎంసీ పవన్. కొందరు పుట్టుకతోనే తమ ప్రత్యేకతను చాటుకోగా, మరికొందరు తమ వారసత్వ సంపదగా, మధ్యలో కళాంశాలపై ఆకర్షితులై రాణిస్తున్నారు. వీటన్నింటికి భిన్నంగా ఓ ప్రభుత్వ అధికారి తనదైన శైలిలో ఫోటోగ్రఫీ, గానంలో రాణించటం విశేషం. ఆయన ఎదురుపడితే సరిగమలే.. పాట ప్రస్తావిస్తే పదనిసలే.. ఆయనే జీహెచ్‌ఎంసీ సహాయ పౌరసంబంధాల అధికారి ఎస్.పవన్‌కుమార్ నాయుడు. ఫోటోగ్రఫీ, గానంపై తనలో ఉన్న కళకు ఎప్పటికపుడు పాత,కొత్తలను రంగరిస్తూ బల్దియా వనంలో పాట అంటే పవన్ అని ఎదిగాడు. సాధారణంగా ప్రభుత్వ ఆఫీసులకు వివిధ పనులపై వచ్చే సామాన్యుల పట్ల అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా, దురుసుగా ప్రవర్తించటం మన చూస్తుంటాం. కానీ పవన్ వద్దకు వచ్చి, వెళ్లే వారు తాము మళ్లీ ఇక్కడకు ఎపుడొస్తామోనని ఆలోచిస్తూ వెళ్తుంటారు. తనను నమ్ముకుని వచ్చే వారిని చక్కగా, సహృదయంతో రిసీవ్ చేసుకుని, వారి పనిచేసి పెట్టి, వారికి ఓ చక్కటి పాట విన్పించి పంపే నైజం పవన్‌కే సొంతం. పదవీ విరమణ చేసేందుకు ఆరు పదుల వయస్సులో ఉన్న పవన్ తన గానాలాపనతో సాటి ఉద్యోగులతో పాటు జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులను కూడా ఆకట్టుకున్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా విధేయతతో విధులను నిర్వహిస్తూ ఖాళీ సమయంలో పాటలు పాడుతున్న ఆయన ‘పాటల పవన్’, సింగర్ పవన్‌గా పేరుగాంచారు. ఉద్యోగంలో చేరక ముందు ఆర్కేస్ట్రాలో సింగర్ వ్యవహారిస్తున్న పవన్ తండ్రి ప్రజాసంబంధాల విభాగంలో ఓ మంచి అధికారిగా పేరుతెచ్చుకున్నారు. తన తర్వాత ఆ ప్రజాసంబంధాలు ఏర్పర్చుకుని, అందులో రాణించాలన్న తండ్రి కోరిక మేరకు పవన్‌కుమార్ జీహెచ్‌ఎంసీ పీఆర్ విభాగంలో ఉద్యోగంలో చేరారు. తన సీనియార్టీకి తగిన విధంగా ఎప్పటికపుడు మంచి హోదా, డబ్బు సంపాదించుకునే పదవులొచ్చినా, పవన్ తన తండ్రికిచ్చిన మాటకు కట్టుబడి పీఆర్ విభాగంలోనే కొనసాగుతూ వచ్చారు. మూడున్నర దశాబ్దాల క్రితం అప్పటి బల్దియా కమిషనర్ హరిశంకర్ బ్రహ్మ మదిలో పవన్ తన పాటలతో చెరగని ముద్రే వేసుకున్నారు. భారత ఎన్నికల కమిషనర్ హోదాలో కొంతకాలం క్రితం అధికార పర్యటన నిమిత్తం జీహెచ్‌ఎంసీకి వచ్చిన హరిశంకర్ బ్రహ్మ పవన్‌కుమార్‌ను పేరుతో సంభోధిస్తూ ప్రత్యేకంగా అభినందించటం ఇందుకు చక్కటి ఉదాహారణ. బల్దియా ప్రస్తానం మొదలైన నాటి నుంచి నేటీ వరకు జీహెచ్‌ఎంసీ తన ఆదాయాన్ని, పరిధిని పెంచుకున్నట్టే పవన్ కూడా గానాలాపనలో సరికొత్త పంథాను ఎంచుకుంటూ అభిమానుల ఆదరణను పెంచుకున్నారు.
‘అమ్మా’ పదం ఆయన సొంతం
నగరంలో బల్దియా ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కమిషనర్లుగా వచ్చిన వారిలో ఎవరూ పవన్‌కుమార్‌ను అభినందించని వారు లేరు. తన తోటి సిబ్బందితో పాటు తనకు ఎవరు ఎదురుపడినా అమ్మా.. అంటూ ఆప్యాయంగా పలకరించటం పవన్‌కే సొంతం. హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా రేచల్ చట్టర్జీ పనిచేసే సమయంలో- ఓ కార్యక్రమంలో బదన్ పే సీతారే..లపేటే హువే అంటూ హిందీలో పాట పాడుతూ ఆమె దృష్టిని ఆకట్టుకోవటమే గాక, అభినందించేలా మెప్పించారాయన. పవన్ బల్దియాకు ఓ గొప్ప ఎసెట్ అని రేచల్ ప్రశంసించారు. ఆ తర్వాత గ్రేటర్‌కు మొట్టమొదటి కమిషనర్‌గా వచ్చిన డా.సీవీఎస్‌కే శర్మ మొదలుకుని కమిషనర్లు, స్పెషలాఫీసర్లుగా వచ్చిన ఎస్పీ సింగ్, ఎం.టీ. కృష్ణబాబు, సమీర్ శర్మ, సంజయ్‌జాజు, సోమేశ్‌కుమార్, బి.జనార్దన్ రెడ్డి, ప్రస్తుత కమిషనర్ దాన కిషోర్ వరకు వచ్చిన ఉన్నతాధికారులంతా తన ప్రతిభకు ప్రశంసలు అందించిన వారే కావటం తన అదృష్టంగా భావిస్తున్నాడు పవన్. గతంలో ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ముఖ్య అతిధిగా హాజరైన ఓ కార్యక్రమంలోనూ ‘ఏక్ దూజే కే లియే’ చిత్రంలోని తేరేమేరే బీచ్ మే కైసా హై యే బంధన్ అంటూ గానాలాపన చేసి, బాలు అభినందనలు పొందారు. ఆ పాత హిందీ మధురగీతాలు, ముఖేశ్, మన్నాడే, మహ్మద్ రఫీతో పాటు బాలసుబ్రహ్మణ్యం, జేసుదాస్ పాటలు పావన్ నోట వినేందుకు తపించేవారు బల్దియాలో అనేక మంది. ఆయన పాడిన పాటలను వ్యాట్సప్, షేర్ ఇట్, ఫేస్ బుక్ వంటి ప్రచార మాధ్యమాల్లో పోస్టింగ్‌లు చేయించుకుని, ఆణిముత్యాల్లా విని తరలించే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న మాస్, క్లాస్ గాయకుడు పవన్. జీహెచ్‌ఎంసీలో ఉద్యోగంలో చేరక ముందు, యవ్వనంలోనే ఆయన నగరంలోని పలు ఆర్కెస్ట్రా బృందాలో పాటలు పాడుతూ వస్తున్నారు. నేటికీ కూడా స్టార్ మేకర్, స్మూలే వంటి ఆన్‌లైన్ యాప్‌లో పవన్ డాట్ 61 శీర్షికతో వందలాది పాటలు పాడుతూ, లైక్‌లు..పోస్టింగ్‌ల వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. తన పాటలతో ఇటీవలే ప్రత్యేక అల్బమ్‌ను కూడా రూపొందించి, అభిమానులు, స్నేహితులకు అందుబాటులోకి తెచ్చారు.
అర్ధాంగి..‘దారి చూపిన దేవత’
ప్రతి వ్యక్తి విజయం వెనకా ఓ మహిళా ఉంటుందంటారు. నిజమే పవన్‌కుమార్ నాయుడు ఎదుగుదల, సింగర్‌గా పేరు సంపాదించేందుకు ఆయన సతీమణి మహాలక్ష్మి ప్రోత్సాహం ఎంతో ఉంది. తెలుగు, హిందీ సినిమా పాటలతో పాటు క్లాసికల్ సంగీతంలోనూ పవన్ రాణించేందుకు ‘దారి చూపిన దేవత’ మహాలక్ష్మి. పవన్ మహాలక్ష్మిని పరిణయమాడిన కొత్తలో ప్రతి నోట విన్పించిన ‘దారి చూపిన దేవతా..నీ చేయి ఎన్నడూ వీడక.. అన్న జేసుదాసు పాట పవన్ ఎంతో మధురంగా ఆలపించి మహాలక్ష్మికి అంకితమిచ్చారు. నేటికీ తాను పని వత్తిడిలో ఉన్నపుడు, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు నేనున్నానంటూ మహాలక్ష్మి తనకు విలువైన సలహాలు, సూచనలిస్తూ ముందుకు నడిపిస్తుందంటున్నారు మన బల్దియాలోని పాటల వనమైన పవన్.

-బిమ్మిటి శ్రీధర్