Others

నాకు నచ్చిన చిత్రం.. మూగనోము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాత చిత్రాలలో ఓ అద్భుతమైన సినిమా మూగప్రేమ. సంగీత సాహిత్యాలు, హాస్య, కరుణ రసాలు మిళితమైన ఒక విశిష్టమైన దృశ్యకావ్యం ఇది. ఆనాటి సామాజిక సమస్య అయిన ధనికుల పేదలమధ్య పెరుగుతున్న అగాధం, రగులుతున్న ద్వేషం కళ్లకు కట్టేలా చిత్రించాడు దర్శకుడు. సంగీత సాహిత్యాలతోపాటుగా కథ కథనం చక్కగా సాగి చివరికి సుఖాంతం కావడం గమనించదగ్గ విశేషం. ప్రాచీన నాటక లక్షణాన్ని పుణికిపుచ్చుకున్న ఈ చిత్రం ఈనాటికీ జనరంజకంగా ఉంటుంది. జమిందారు ఏకైక పుత్రుడు నాగేశ్వర్‌రావు, నౌకరు చిత్తూరు నాగయ్య కూతురు జమునను ప్రేమిస్తాడు. దైవసాక్షిగా వివాహం చేసుకుంటాడు. సమయం చూచి చెప్పాలనుకున్న వారి పథకం తల్లక్రిందులౌతుంది. కథానాయిక అప్పటికే గర్భవతి. విషయం తెలిసిన జమిందారు తన కొడుకును వివాహం చేసుకున్నానని ఎవరికీ చెప్పవద్దని ప్రమాణం చేయించుకుంటాడు. అప్పటినుంచి ఆమె మూగనోము పడుతుంది. చివరికి వారికి పుట్టిన బిడ్డ ఎన్ని కష్టాలు పడింది? చివరికి అగ్నిపరీక్ష లాంటి జీవితాన్ని ఎలా నెగ్గింది అనే అంశంతో ఈ సినిమా అందరికీ ఆనందాన్నిస్తుంది. ‘నిజమైనా కలయైనా నిరాశలలో ఒకటేలే.. పగలైనా రేయి అయినా ఎడారిలో ఒకటేలే’ అన్న చరణాలు హృదయాన్ని పిండేస్తాయి. అనాథగా పెరుగుతున్న జమిందారు మనవడు రాబోయే తరాలకు ఆదర్శ మానవుడు అని చెప్పడం దర్శకుడి ఉద్దేశం చాలా గొప్పగా వుంటుంది. పెద్దలను, పిల్లలను ఆకట్టుకున్న ఓ కళాత్మక సాంఘిక చిత్రంగా మూగనోము ప్రేక్షకుల మదిలో కలకాలం నిలిచి ఉంటుంది.

-వి.ఆర్.రావు, హైదరాబాద్