Others

అంతరిక్షం.. అంటరానిది కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చందమామ రావే.. జాబిల్లి రావే..’ అని ఒకప్పుడు తల్లులు తమ పిల్లల కోసం పిలిచేవారు. ఇప్పుడు ఆ చందమామే ఆసక్తిగల వారందరినీ తన వద్దకు రమ్మని పిలుస్తోంది. కాలగతిలో ఇది గొప్ప పరిణామం. ఆ ‘పిలుపు’ను అందుకుని ఇటీవల చైనా చాంగే-4 పేరుతో ల్యాండర్‌ను, రోవర్‌ను అక్కడికి పంపింది. చందమామకు మరోపక్క గల స్థితిగతులపై పరిశోధనలు చేసేందుకు చైనా సన్నద్ధమైంది.
ఇక చంద్రయాన్-2 పేరిట మన దేశం ఈ ఏడాది ప్రథమార్థంలో చందమామ పైకి వ్యోమగాములను పంపనున్నది. ఇంతవరకు అమెరికా, రష్యా, చైనా దేశాల వ్యోమగాములు మాత్రమే చంద్రుడి ‘పిలుపు’నందుకుని అక్కడ కాలుపెట్టారు. ఆ ప్రయాణాన్ని స్ఫూర్తిగా తీసుకుని త్వరలోనే భారతదేశ వ్యోమగాములు చంద్రుని ‘పిలుపు’తో అక్కడికి చేరుకోనున్నారు. దశాబ్దం క్రితం చంద్రయాన్-1 ప్రయోగం జరిగినప్పటికీ మన వ్యోమగాములు అక్కడికి వెళ్ళలేదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వ్యోమనౌకతో ఈ ప్రయాణం జరుగుతోంది.
1968 డిసెంబర్ 21న ‘నాసా’ తొలిసారిగా ముగ్గురు వ్యోమగాములను చంద్రునిపై దింపింది. ఈ చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుని అప్పుడే 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ అర్ధ శతాబ్దంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు 4 లక్షల కిలోమీటర్ల గగన ప్రయాణం చేసి ‘అపోలో’ చందమామపై దిగినప్పుడు ప్రపంచమంతా సంబరపడింది. తొలిసారి మనిషి మరో గ్రహం మీద కాలుపెట్టడం గొప్ప సాహసమే కాదు, జ్ఞానానికి పరాకాష్ఠ. ఈ జ్ఞానానికి అటు చైనా, ఇటు భారత్ మరింత వనె్న తెస్తున్నాయి. చైనా పంపిన చాంగే-4 సరికొత్త పరిశోధనలు జరుపుతోంది. భూమి నుంచి కనిపించే చందమామకు మరోపక్కగల స్థితిగతులను, అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు శాస్తవ్రేత్తలు నిరంతరం పరిశ్రమిస్తున్నారు. అక్కడికి చేరుకోవడమే గొప్ప గెలుపుగా వారు భావిస్తున్నారు. తొలిసారిగా చైనా అక్కడికి చేరుకోవడం ఆ దేశ నిబద్ధతకు, పరిశోధనల సాఫల్యతకు చిహ్నం. దీంతో చైనా ప్రపంచంలో శక్తిమంతమైన దేశంగా తనకుతాను చాటుకుంది. అంతరిక్ష రంగంలో తన సత్తాచాటుకుని అగ్ర దేశమైన అమెరికాకు ఓ రకమైన ‘సవాల్’గా విసిరిందని పరిశీలకుల భావన.
కమ్యూనిస్టు దేశమైన చైనా పెద్దమొత్తంలో నిధులను ఖర్చుచేసి ఈ విజయాన్ని సాధించింది. అర్ధ శతాబ్దం క్రితం రష్యా కమ్యూనిస్టు దేశంగా అనూహ్య రీతిలో ఖర్చుపెట్టి చందమామ యాత్రను కొనసాగించింది.
కమ్యూనిస్టు దేశాలు కేవలం తమ ప్రజల భోగభాగ్యాల కోసం, వారి సంక్షేమం కోసం పనిచేస్తాయి.. అలా చేయాలని భావిస్తారు. కాని వాస్తవం మరోలా ఉందని అటు రష్యా, ఇటు చైనా నిరూపించాయి. ఈ వౌలికమైన అంశాన్ని విస్మరించి భారతదేశ చంద్రయాన్‌ను ఇక్కడి కమ్యూనిస్టులు, మావోయిస్టులు విమర్శిస్తూ ఉంటారు. ఈ ద్వంద్వ విధానం వారికి వెన్నతోపెట్టిన విద్య. అందుకే ఆ విమర్శ కాలక్రమంగా కాలగర్భంలో కలిసిపోయింది. స్వదేశీ పరిజ్ఞానంతో భారతదేశం ఎన్నో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతోంది. వర్తమాన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిపుష్టం చేసుకుంటోంది. అభివృద్ధి చెందిన దేశాల సరసన నిల్చొని భారతదేశం తన సత్తా చాటుతోంది. చంద్రయాన్-2 అందుకు తిరుగులేని నిదర్శనం.
చందమామతోనే సరిపెట్టకుండా అంగారక గ్రహంపైకి వెళ్ళేందుకు ప్రపంచం ప్రయత్నిస్తోంది. 2020 సంవత్సరం నాటికి చైనా ఈ విషయంలో కీలక అడుగు వేయగలదని తెలుస్తోంది. ఇలా ప్రపంచం ఇతర గ్రహాలపై పరిశోధనలకు ప్రాధాన్యతనిస్తున్నది. ఈ అంతరిక్ష కార్యక్రమంలో తమతమ దేశ ‘రక్షణ’ అంశాలకు అధిక ప్రాముఖ్యతనిస్తున్నారు. ఇలా బహుముఖ అంశాలతో ఈ కార్యక్రమాలు నిబిడీకృతమై ఉన్నాయి. అగ్ర దేశాలు, అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు అంతరిక్ష రంగాన్ని సవాలుగా తీసుకుని తమ శక్తిసామర్థ్యాలను వెచ్చిస్తున్నాయి. ఇదంతా మానవాళి మంచి కోసం, మనుగడ కోసం, అతని జిజ్ఞాసను తృప్తిపరచడం కోసం కొనసాగుతోంది. భారీ బడ్జెట్‌తో కొనసాగే ఈ కార్యక్రమాలు ప్రజలను మరో ‘లెవల్’లోకి తీసుకెళ్ళే ప్రయత్నంగానే ప్రపంచం భావిస్తోంది. ఉత్కృష్టమైన ఈ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి, మేధో మథనానికి, విజయ సోపానాలకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.
కాని కొందరు కమ్యూనిస్టులు, మావోయిస్టులు మాత్రం ఈ ప్రయత్నాలను ‘వర్గ దృక్పథం’తో తిలకిస్తూ విమర్శిస్తున్నారు. ఈ పురోగమన పంథాను పట్టించుకోకుండా మావోయిస్టులయితే దండకారణ్యంలోకి రమ్మని ప్రజలకు పిలుపునిస్తున్నారు. అబూజ్‌మాడ్ దుర్గమ ప్రాంతంలో ‘దండు నిర్మిద్దాం రా రమ్మ’ని యువతను ఆహ్వానిస్తున్నారు. ఈ పరస్పర విరుద్ధ కార్యక్రమాన్ని ప్రజలు నిశితంగా పరిశీలించాలి. మావోల కాలం చెల్లిన విధానాలవల్ల, కార్యాచరణ వల్ల, లోపభూయిష్టమైన వర్గదృక్పథం వల్ల పేద ప్రజలకు- కార్మిక- కర్షకులకు ఒనగూరేది ఏమీలేదని కమ్యూనిస్టు దేశాలైన రష్యా-చైనా దేశాలే నిరూపించాయి. అంతరిక్షం అంటరానిది కాదని దశాబ్దాల క్రితమే చైనా పేర్కొన్నది. కమ్యూనికేషన్లు ఇతర అవసరాల కోసం ఉపగ్రహాల ప్రయోగం కోసం డెంగ్ జియావోపింగ్ 1978 ప్రాంతంలోనే పట్టుపట్టాడు. దేశ నిర్మాణంలో, అభివృద్ధిలో అంతరిక్ష కార్యక్రమాలు దోహదపడేలా ఉండాలని ‘వ్యాపార ధోరణి’లో ఉపగ్రహాలను పంపే పనిలో పడ్డారు. నాలుగు దశాబ్దాల అనంతరం ఈ రంగంలో చైనా అగ్రగామిగా నిలిచింది.
ఈ పోకడలను పట్టించుకోకుండా భారతదేశ మావోలు స్పందిస్తే ఏమిటి అర్థం? ప్రతి దేశం తన ప్రతిష్టను పెంచుకునే పనిలో ఉంది. తదనుగుణమైన కార్యాచరణను రూపొందించుకుంటోంది. చివరకు అంతరిక్షంలోనూ ఈ పోటీ పెరిగింది. స్పేస్ స్టేషన్లపై పట్టుసాధించేందుకు కృషి జరుగుతోంది. దీన్ని తిలకించేందుకు ఇష్టపడక ఇది సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ విధానం, ఇది నష్టదాయకం, ప్రజలకు ఉపకరించనిదని సిద్ధాంతాలు ఉల్లేఖిస్తూ, వల్లెవేస్తూపోతే మిగిలదే హళ్ళికి హళ్ళి.. సున్నాకు సున్నా.. అని చరిత్ర చాటిచెబుతోంది.
భీకరమైన కమ్యూనిస్టు భావజాలంతో ప్రపంచాన్ని సమూలంగా మార్చేస్తామని కంకణం కట్టుకుని, కోట్లాది మందిని పొట్టనపెట్టుకుని విక్రమార్కునిలా ఆయా దేశాలు ప్రయత్నం చేసినా మానవుని వివేకం, వివేచన, విజ్ఞత, దార్శనికత దాన్ని తోసిరాజన్నది. ఈ విషయం గత నాలుగు దశాబ్దాల్లో స్ప ష్టంగా వెల్లడైంది. రష్యా-చైనాలో విఫలమైన ఆ భావజాలం- వ్యూహం-ఎత్తుగడలను భారతదేశంలో సఫలం చేస్తామని దండ కారణ్యంలో ఆదివాసీలతో జట్టుకట్టి వారి ఎదుగుదలను సైతం గండికొడుతూ.. పగటికలలతో మావోయిస్టులు కాలం గడుపుతూ ప్రాణాలు తీయడమే పనిగా పెట్టుకుంటే ఏమిటి ఉపయోగం? పేదలను, ఆదివాసీలను సమకాలీన సమాజంలోని ‘మేలిమి’తో జతకూర్చినప్పుడే వారి జీవితాలు బాగుపడతాయి. ఇందుకు విరుద్ధంగా పేదలను, ఆదివాసీలను అడవులకే పరిమితం చేస్తే వారెప్పుడు అంతరిక్షపు కలలుకంటారు? వాళ్ళు చందమామ రావే... జాబిల్లి రావే.. అని పాతపాట పాడుకోవలసిందేనా? చందమామపై కాలుమోపాలన్న ఉత్సాహం, ఊహ చేయకూడదా? ఇప్పటికైనా మావోయిస్టులు తమ ఊహాలోకం నుంచి బయటపడి వాస్తవిక ప్రపంచాన్ని గమనించి, ప్రజలను తమవంతుగా అటువైపు నడిపించడంలోనే మాన్యత కనిపిస్తుంది. ఎందుకంటే- అంతరిక్షం అంటరానిది కాదు.

-వుప్పల నరసింహం 99857 81799