Others
మనోరంజితాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 21 January 2019
- కె.రవీంద్రబాబు, 9052778988
చూపులు కలిసిన శుభవేళ
అవి కంటిపాపల్ని వెలిగిస్తాయ
విరిసే వేళ
కనువిందు చేసే ప్రగతిచిహ్నాలవుతాయ
పరిమళించే వేళ
ఎద సానువులగుండా సాగిపోయే
చందన సమీరాలవుతాయ
అరుణోదయ వేళ
హరిత శోభల నడుమ వెలుగొందే
దీపాంకురాలవుతాయ
మధుమాస వేళ
మది నిండిన మకరందాలతో
మరులు గొనే అభిసారికలవుతాయ
దాని అస్తిత్వం ఓ రమణీయం
లాలిత్యం దాని అభిజాత్యం
అవి భావాలకు ప్రేరణలు
బంధాలకు అనుసంధానాలు
భక్తికి సోపానాలు
వలపు జీవులకు ప్రేమ సాక్ష్యాలు
ప్రణయ జీవులకు పరిణయ వేదికలు
పువ్వులను గౌరవించడం
మన సంస్కృతి
అది సంప్రదాయంగా మారడంలో
అది మనకు అందివచ్చే
మధుర సంతకాలు
అందుకే అవి మనోరంజితాలు