Others

చలి రాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెలీ అంటూ చలి తరుముతుంది
చల్లగా మేనును తడుముతుంది
హిమ శకలాలుగా జారుతూ
సుమ పరిమళాలుగా రాలుతూ
చల్లనైన ప్రకృతి పరిష్వంగంలో వెల్లువైన
ఆకాశం దుప్పటి కింద
పరుచుకున్న పచ్చిక పరుపుమీద
విచ్చుకున్న వూహల్ని తట్టిలేపుతుంది
వేకువ ఊపిరులతో నిట్టూర్చుతుంది
మంచు స్ఫటికంలా చల్లదనాన్ని
మల్లె పరిమళాల ప్రవాహాన్ని
తనలో కలుపుకుని
తీయనైన వణుకుతో హాయని
మిగిలించింది
మధురోహల మధు భావాలను రగిలించింది
కనురెప్పల వింజామరలను ఊపుతూ
కలల కదలికలను వౌనంగా వింటుంది
ఈ చలి ఆకునుండి ఆకుకు పాకి
మేఘ మాలికను తాకి
ప్రియ భాను కిరణం చేతుల్లో
వెచ్చగా ఒదగాలని
కలలు కన్న నెచ్చెలిలా
ఋతువుల రాగమును ఆలపిస్తూ
రాత్రి తాళలయలతో
ఆదమరచి నిదురపోతుంది

- సముద్రాల శ్రీదేవి, 9949837743