Others

సవ్వడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడివడిగా సాగే
వాడి వేడి జీవితాల్లో
ఆడీ ఆడీ వాడిపోవడం
ఓడిపోవడం
కాలం సలిపే క్రీడలో భాగమే
అలజడులూ హిమవన్నగాలై
పాతాళపు లోతుల్లోకి
తోస్తూనే వుంటాయ
పాయసంలో పలుకుల్లా
సుఖాలూ శుభాలూ
రుచులనిస్తూనే ఉంటాయ్
గతుకు రోడ్లపై
జీవితపు బండి ఒడిదుడుకులు
సహజాతాలే సోదరీ
నీ జీవితం ఝరీభూతమై
సాగడమే జీవ రహస్యం
పొంగడం క్రుంగడం
మాని చూడు
మనసు మ్రానులోంచి
స్థితప్రజ్ఞత మొలకై
పొడుచుకువస్తుంది
ఆత్మజ్ఞానంతో పునీతమవుతుంది

- డా. ఎన్.వి.ఎన్.చారి, 9866610429