Others

డైరెక్టర్స్ ఛాయిస్.. పరి‘శ్రమ’పై నమ్మకంతో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాణి ఎం కొసరారు

తెలుగులో మహిళా డైరెక్టర్ల సంఖ్య చాలా తక్కువ. దర్శకత్వ విభాగానికి వచ్చిన వాళ్లలో సక్సెస్ అయిన వాళ్ల సంఖ్య కూడా తక్కువే. అయినాగానీ దర్శకురాలిగా నిలదొక్కుకునే ప్రయత్నాలు అనేకమంది చేస్తూనే ఉన్నారు. పరి‘శ్రమ’పై నమ్మకంతో కొత్తగా వచ్చిన దర్శకురాలే -వాణి ఎం కొసరారు. అందమైన తెలుగు టైటిల్
‘మరల తెలుపనా ప్రియా’
అంటూ వస్తున్న వాణితో చిట్‌చాట్
పరిశ్రమకు ఎంట్రీ ఎలా?
బేసికల్‌గా రైటర్‌ని. ‘మరల తెలుపనా ప్రియా’ టైటిల్‌తో నేను రాసిన ఓ కథ వారపత్రికలో పదిహేను వారాలపాటు అచ్చయ్యింది. మంచి స్పందన రావడంతో -ఆ కథనే అదే టైటిల్‌తో సినిమా చేస్తున్నాం.

మీ గురించి..?
ఆరేళ్లుగా పరిశ్రమలోనే ఉన్నా. షార్ట్ఫిల్మ్స్ చేసిన అనుభవం నాది. నిజానికి అవన్నీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలే.

ఏం చెబుతున్నారు?
మోడ్రన్ జనరేషన్‌లో ప్రేమ పేరిట వంచనలు ఎక్కువయ్యాయి. ఈ ధోరణి అమ్మాయిల్లోనూ కనిపిస్తుంది. ఇలాంటి రోజుల్లో -ఉన్నతవర్గానికి చెందిన అమ్మాయి స్వచ్ఛమైన ప్రేమ కోసం ఎలా పరితపించింది, ప్రేమను ఎలా సాధించుకుందీ అన్న కథే.

దర్శకురాలిగా ఫస్ట్ చాన్స్?
నా కథ అందరూ బాగుందనడంతో నాకు తెలిసిన వారి ద్వారానే సినిమాకు ప్లాన్ చేశాను. అయితే, ఏ దర్శకుని దగ్గరా పని చేసిన అనుభవం లేదు. కాకపోతే, నేను తీసిన షార్ట్ఫిల్మ్స్ అనుభవంతోనే ఫీచర్ ఫిల్మ్‌కు సిద్ధమయ్యా.

తదుపరి ప్రాజెక్టులు?
ఇంకా అంత ఆలోచనలు లేవండి. విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా సక్సెస్‌పైనే భవిష్యత్ ఆలోచనలు. దీని ఫలితం తరువాతే తదుపరి ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తా.

-శ్రీ