Others

త్యాగరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లవి: రసధునిలా ప్రవహించిన
రాగోజ్జ్వలహృదయా!
సరిగమలను శ్వాసించిన
సంగీత మహోదయా!
త్యాగయ్యా! ఇదిగో నీ
నీ కీర్తికి మా కీర్తనా..
అందుకోవయ్యా!
ఇది మా గీతార్చనా..

చరణం:

నాదసుధాసారంలో తడిసిన స్వరయోగీ!
వేదవీధిలో నడచిన వాగ్గేయ కళారవీ!
జగమేలే పరమాత్ముని నగుమోమును దర్శించి
సొగసుగా మృదంగ తాళ విన్యాసము నావించి
తెలుగుతీపి నలుదెసలకు పంచిన త్యాగయ్యా!
వెలుగుపూలు పూయించిన పుణ్యం నీదయ్యా! ॥

చరణం:

కావేరికి శ్రుతిలయలను నేర్పిన గురుదేవా!
కాలమనే తంబురా మీటిన పృథుభావా!
ఎందరో మహానుభావులను జగతికి చూపించి
ఇనకుల తిలకుని హృదయం లోపల తిలకించి
రామభక్తి సామ్రాజ్యం ఏలిన త్యాగయ్యా!
ప్రణవానికి నీకూ మరి తేడా లేదయ్యా! ॥

(నేడు త్యాగరాజస్వామి వర్ధంతి)

- రసరాజు, 6281299346