Others

తరగతి గది ఒక శోధనాశాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు ప్రశ్న వేయగానే సమాధానమిచ్చే విద్యార్థిని తెలివైన వాడిగా పరిగణిస్తారు. ప్రశ్నవేయగానే కొంతమంది పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు. పూర్వజ్ఞానంలో దాన్ని కలుపుకుంటారు. అదొక లెక్కయితే పాత లెక్కలను జ్ఞాపకం చేసుకుంటారు. అది వృథా శ్రమ కాదు. ఇచ్చిన లెక్కకు, అడిగిన ప్రశ్నకు ఏమైనా పోలికలున్నాయా? అని పరిశోధిస్తూ ఉంటారు. ఆ పరిశోధనలో సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తుంటారు. విద్యార్థి తన జ్ఞాపకాలను శోధిస్తున్నాడు కాబట్టి మనం తక్షణమే సమాధానం ఆశించటం సరైంది కాదేమో అనిపిస్తుంది. ప్రశ్న వేసిన తర్వాత పిల్లలందర్నీ శోధనా ప్రక్రియలోకి దించాలి. ఇలాంటి అలవాటే మానసికశాస్త్ర ప్రకారం కూడా సరైందని, దీనిపైన మానసిక శాస్తజ్ఞ్రులు విద్యార్థి మెదడులో ఏయే ప్రక్రియలు జరుగుతాయో వాటి ఫొటోలు తీశారు. మనకు ఒక ఫొటోలోవున్న శరీరంలోని భాగాలన్నింటి సమూహం ఇస్తే ఆ వస్తువులను రూపొందించటం ఎంత కష్టమో విద్యార్థి కూడా ఆ భాగాలన్నింటినీ అమర్చుకుని సమాధానం చెప్పవలసి ఉంటుంది. దీన్ని పరిశీలించదలుచుకుంటే ఒక కథలోని రెండు, మూడు సంఘటనలు చెప్పి కథను అల్లమనండి. దానే్న డీ-కోడింగ్ అంటారు. ఇది ఒక రకమైన విద్య. దీన్ని అలవాటు చేయటానికి శరీరంలోని రెండుమూడు అంగాలను ఇచ్చి బొమ్మను గీయటం చేయాలి. ఈ ప్రక్రియను అందరూ ఒకేలా ఒకే సమయంలో చేయలేరు. తొందరగా సమాధానం చెప్పినవాడే ఆలోచిస్తున్నాడని అనుకోవటం పొరపాటే. విద్యార్థి నేపథ్యాన్ని బట్టి ఆ ప్రక్రియ జరుగుతుంది. ఉపాధ్యాయుడు తన ఇంట్లో గంటలకొద్దీ ఆలోచించిన ప్రశ్నకు విద్యార్థి క్షణాల్లో సమాధానం చెప్పాలని ఆశించటం సరైంది కాదేమోనని నా అనుమానం. అందుకే తరగతి గది ఒక శోధనాశాల.
ఆలోచన- అవగాహన...
ఒకనాటి విద్యావేత్తలు ‘మైండ్ ఈజ్ ఏ క్లీన్ స్లేట్’ (మెదడు అనేది ఖాళీ పలక) అన్నారు. దానిమీద ఏమైనా రాయవచ్చుననే భావనను కలిగించారు. నేటి విద్యావేత్తలు మెదడు అనేది ఖాళీ పలక కాదని దానికి సంగ్రహణ శక్తి ఉందంటున్నారు. విద్య కేవలం దాన్ని ప్రేరేపించటమే. మైండ్ అనేది తీగల చుట్ట. న్యూరో కణాలతో ఏర్పడ్డ తీగలచుట్ట అది. దానికి సమాధానం అందిస్తే జ్ఞానంగా మార్చుతుంది. దానినే మనం అండర్‌స్టాండింగ్ అంటాం. ఇంద్రియాల ద్వారా పుట్టినప్పటినుంచి జ్ఞాన సంగ్రహణ చేస్తూనే ఉంటారు. కొందరు తల్లిగర్భంలో ఉన్నప్పుడే ఇది ఆరంభవౌతుందంటారు. తల్లిగర్భంలో ఉన్నప్పుడు మంచి సంగీతం, మంచి పద్యాలో, గొప్ప కథలో, చారిత్రకమైన విశిష్టతలను తల్లికి చెబుతారు. ఆ విషయ గ్రహణం తల్లిగర్భంలో ఉన్నప్పుడే జరుగుతుంది. మనం ఇచ్చే సమాచారాన్ని జ్ఞానంగా మార్చగలశక్తి మెదడుకుంది. ఆ సమాచారాన్ని ప్యాట్రన్స్‌గా గుర్తించే శక్తి, ఆలోచించే శక్తి మేధస్సులోనే ఉంది. పరిజ్ఞానంతో విద్యార్థిని ఆలోచింపచేయటమే ఉపాధ్యాయుని విధి. ఆ ఆలోచననే అవగాహన అంటాం. ఉపాధ్యాయుడు అవగాహనకు అవకాశం కల్పించాలి. ఆ అవగాహనకు ఇంటి వాతావరణం, సంస్కృతి తోడ్పడుతుంది. మేధాశక్తిని బలపరచటానికి ఆహారం ఉపయోగపడుతుంది. శిశువుకు సరైన ఆహారం ఇవ్వడం గ్రాహ్యశక్తికి దోహదం చేస్తుంది. ఆహారం మేధస్సును పుష్టికరం చేస్తుంది. పిల్లలు అవగాహనాశక్తిని పెంచేందుకు మేధస్సు కణాలను తెరిపించాలి. మానవ మేధస్సు పెద్ద కంప్యూటర్. కంప్యూటర్‌ను చార్జ్ చేయించినట్లుగా మేధస్సు కణాలను తెరిపిస్తే అది ఆలోచిస్తుంది. ఆలోచనతో అవగాహన పెరుగుతుంది. ఈ పని తరగతి గది చేయాలి.

-చుక్కా రామయ్య