Others

కేజ్రీవాల్ ‘ధ్వంస’రచన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం బెజవాడలో సత్యనారాయణపురాన్ని, మిగతా నగరాన్నీ విడగొడుతూ జనాల ప్రాణాలను హైరానా పెడుతోంది బి.ఆర్.టి రోడ్డు. సరిగ్గా ఇలాంటిదే దేశ రాజధాని దిల్లీలోనూ ఒకటి వుంది. ‘బస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్టు మార్గ్’ అంటారు దీన్ని. 2008లో హస్తినాపురంలో మూల్‌చంద్ నుంచి అంబేడ్కర్ నగర్ దాకా 5.8 కిలోమీటర్ల మేరకు దీన్ని 180 కోట్ల రూపాయల వ్యయంతో, 2008లో అప్పటి దిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ హయాంలో కాంగ్రెస్ సర్కారు నిర్మించింది. ఇదేదో ‘గురువుగారిని ఏదో చేయబోయే కోతి అయింది’అన్న చందాన వున్నదన్నారు ఎందరో.
2012లో బి.ఆర్.టి.ని పడగొట్టమంటూ విపక్షం హైకోర్టుకెక్కింది కూడాను. కానీ, కోర్టువారు గొప్ప సూక్తి ఒకటి చెప్పారు. ‘అభివృద్ధి చెందిన దేశం అంటే పేదవాళ్లందరికీ కార్లు వుండటం కాదు. సంపన్నులందరూ సిటీ బస్సులలో ప్రయాణించేదీ’అంటూ ఆ కేసు కొట్టేశారు. ఆ కథ అప్పటితో ముగిసింది. అయితే, ఆమ్‌ఆద్మీ పార్టీ దిల్లీలో తొలిసారి గెలిచి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ పగ్గాలు చేపట్టగానే ఈ బి.ఆర్.టి. (షీలాదీక్షిత్ వేయించిన రోడ్డు కదా) వాళ్లకి ‘ఐసోరు’ అయిపోయింది. దీన్ని ‘స్క్రాప్’ అన్నారు. అప్పుడు కేజ్రీవాల్ అధికారంలో ఉన్నది 49 రోజులే. ఎన్నికల్లో గెలిచి మళ్లీ సిఎం పీఠం ఎక్కడంతో ఇపుడు అరవింద్‌జీ ఈ రోడ్డు అంతు చూస్తున్నాడు.
ఇటీవలే దీన్ని పగలగొట్టడం మొదలెట్టారు. కట్టడానికి 180 కోట్ల రూపాయలైతే- పడగొట్టడానికి 12కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందట! దక్షిణ దిల్లీలో వున్న ఈ అడ్డూ, ఆపూ లేని ‘చతుశ్చక్రమార్గం’ జాగాలో దొంతర రోడ్డు నిర్మిస్తామని అంటోంది ఆమ్‌ఆద్మీ గవర్నమెంట్. మరో నెల రోజుల్లో బి.ఆర్.టి.రోడ్డు ‘్ఫనిష్’ అయిపోతుంది. మళ్లీ దిల్లీలో, కర్మకాలి గవర్నమెంటు మారేదాకా- దొంతర జంట రోడ్ల నిర్మాణ ‘కల’ రౌండ్లు కొడుతూ వుంటుంది. బై ది బై.. విజయవాడ బి.ఆర్.టి. ఎలా వున్నదో..?
‘సరి, బేసి’ కార్ల నడక మాకూ కావాలి..
ముంబయిలో రోడ్లూ, పోలీసులూ కూడా ఢిల్లీలో లాగా కాకుండా ఒకే ‘హయాం’ కిందున్నాయి. ‘కాలుష్య రక్కసి’ ప్రతాపం ముంబయిలోనూ ఎక్కువగానే వుంది. ధూళీ, ధూమం రెండూ జనాలకి స్వచ్ఛమైన గాలిని పాడుచేసి- వూపిరి పీల్చుకోడానికి అవకాశం లేకుండా చేస్తున్నది. అంచేత ఇక్కడ కూడా కార్లను వాటి నెంబర్ ప్లేట్ల ఆధారంగా సరిసంఖ్య, బేసి సంఖ్యలుగా విడదీసి వాటిని రోజువిడిచిరోజు రోడ్లెక్కించాలంటూ షాబాద్‌ఖాన్ అనే పెద్దమనిషి హైకోర్టులో ‘పిల్’ వేశాడు. తక్షణం బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్‌నీ, మహరాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డునీ, పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌నీ పిలిచి విచారించాలని ఈ ‘జనహిత వాజ్యం’ డిమాండ్ చేసింది. న్యాయమూర్తులు ఈ ‘పిల్’మీద ‘విచారిస్తాం, త్వరలోనే ఓ తేదీ ఇస్తాం’ అన్నారు. కోర్టువారు తల్చుకుంటే ఆంక్షలకి కొదువేముంటుంది?
గొర్రెల ఘనత.. పోలీస్ ఖాతాలో!
దొంగల వేటలో పోలీసు శునకాల పాత్ర అమోఘం. న్యూజిలాండ్ దేశం కుక్కలకి కాదు, గొఱ్ఱెలకు బాగా ప్రసిద్ధి. అక్కడ ఇటీవల గొఱ్ఱెల మంద ఒకటి- ‘పోలీసు పని’ చేసింది. క్వీన్స్‌టౌన్ అనే విలాస నగరం చేరువలో జరిగిందీ సంఘటన. ఒక కారు నిండా దొంగలెక్కారు. దానికి ఎలాంటి నెంబరు ప్లేటూ లేదు. కారు స్పీడుకి అడ్డూ, అదుపూ లేదు. పోలీసులు ఓ కారులో దాని వెంట పడ్డారు. లాభం లేకపోయింది. మరో డజన్ పోలీసుకార్లను సాయం పిల్చుకుని వెంటాడారు. కానీ, దొంగల కారు స్పీడు తగ్గలేదు. ఐతే, అక్కడ గొఱ్ఱెల మంద ఒకటి రోడ్డుకడ్డంగా పడి అవతలి మైదానంలోకి మూకుమ్మడిగా సాగిపోతున్నాయి. అంతే- దొంగల కారు గొర్రెల మంద మధ్యన ఇరుక్కుపోయింది. సౌత్ ఐలాండ్ ప్రాంతపు ‘ఓటాంగో’మార్గంలో ఈ గొఱ్ఱెల సాహస విన్యాసం జరిగింది. కాకపోతే ఆ గొఱ్ఱెలు అన్ని స్థానిక పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గారి ‘సొమ్ములు’. అంచేత, ‘‘పోలీసు గొఱ్ఱెల- సాహసంగా’’ స్థానికులు వీటి ఘనతను ప్రశంసించారు. భేష్..!

- వీరాజీ