Others

గణతంత్ర భారతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ అభ్రచుంబితమైన ఆ హిమశృంగమే
అలరు దివ్య మహనీయమకుటంబు
శోభామయమ్ములౌసుశ్యామ సీయలే
అంచితరమ్య భవ్యాంబరములు
శిబ్యాదిరాట్టుల చిరమైన త్యాగమే
రాజిత రమణీయ రత్నభూష
సంద్రంపు కెరటాల చక్కనౌ నురగలే
ధగధగ ద్ధగిత ముత్యాల సరులు
తే.గీ॥ పండిత కవిప్రకాండుల ప్రాభవంబె
విమల నవమందహాసమై వెలయునట్టి
భరతమాతకు జనియించు భాగ్యగరిమ
వేలజన్మాల కలుగంగ వేడుకొందు॥
సీ॥ మధ్యాహ్నమైనను మహిళామతల్లులు
నడివీధినొంటిగా నడచునాడు
తానుపండించిన ధాన్యరాశికి, రైతు
మంచిరేటును నిర్ణయించునాడు
సంతోషమయమైన సమసమాజంబన్న
మధురోహసాకారమైననాడు
పనికిమాలినవారు, పనిలేనివారును
లేక దేశంబు చరించునాడు
తే.గీ॥ నోట్లు మద్యమ్ముపారక ఓట్లతంతు
భరతభూమికై ఘనముగా జరుగునాడు
మతములన్నియునొక్కటైమసలునాడు
నాడు నిజమైన గణతంత్రవేడుకౌను॥

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949