Others

చబ్బీస్ జనవరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బానిసత్వం నుంచి భవిష్యత్తుకై అడుగేసిన రోజిది
వందల సంవత్సరాల వెట్టికి
చరమగీతం పాడి
స్వపరిపాలన దిశగా
రాజ్యాంగాన్ని రాసిన సుదినం
స్వాతంత్య్ర భావనను ప్రతీ
పౌరుడు మోస్తూ గణతంత్రదేశంలో
నిలువెత్తు అభివృద్ధికి సాక్షి
డెబ్భై ఏళ్లకాలంలో
నా దేశం నడుస్తూ, పరిగెడుతూ
విపంచిలో విలువని పెంచిన
అద్భుతమైన రోజు
బడుగు బలహీన వర్గాల ఆశలకి
ఊతమిస్తూ నడిపించినది
స్వేచ్ఛ నుంచి సౌభ్రాతృత్వంకై
అడుగులేస్తూ..
సకల జనాలని మమేకం చేసే
మరపురాని పండుగ
సమరయోధుల ఆకాంక్షలని
వరుసక్రమంలో గుర్తుచేసుకొని
సర్వకాల సర్వావస్తలలో
ముందుండి నడిపించినవారు
అంబేద్కర్ సారథ్యంలో భారత భాగ్యాన్ని
రచించి ప్రపంచ పటంలో
ప్రత్యేకతని ఆపాదించిన
చబ్బీస్ జనవరి
మాకెప్పుడూ అపురూపమే..
భావితరాలకి భరోసాని కల్పించే
రాజ్యాంగ పుస్తకానికి
ఆపాదమస్తకం ప్రణమిల్లుతూ
జరుపుకుందాం..

- పుష్యమీ సాగర్, 9010350317