Others

బుజ్జి బుజ్జి పాపాయి.. (నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెమినివారి ‘ఆడబ్రతుకు’లోనిదీ పాట. ఆచార్య ఆత్రేయ కలం నుంచి జాలువారిన గీతానికి విశ్వనాథన్ రామ్మూర్తి బాణీ, పిబి శ్రీనివాస్ గాత్రం ప్రాణం పోశాయి. చిత్రంలో ఈ పాటను యన్టీ రామారావు, దేవిక, రాజమ్మ పిల్లలపై చిత్రీకరించారు. హీరో యన్టీఆర్‌కు పిబి శ్రీనివాస్ పాడటమే అరుదు. అలాంటి తక్కువ గీతాల్లో ఇదొకటి. సాహిత్యంలో ప్రత్యేకత ఉంటేనే దర్శక నిర్మాతలు పీబీ చేత పాడించేవారని అంటూండేవారు. ఈ పాట వింటే మాత్రం అది నిజమేనని అనిపిస్తుంది. చిత్రంలో ఓ సందర్భంలో కథానాయిక యింటికి వచ్చిన కథానాయకుడు -చిన్న పిల్లలతో ఆడుకుంటున్న ఏడాది వయసున్న బాబు ముద్దొచ్చే రూపాన్నిచూసి ఆప్యాయంగా ఎత్తుకుని పరవశమైన సందర్భంలో వచ్చే పాట ఇది. ఆ పరవశానికి కారణం ఆ బిడ్డ తన కొడుకనే విషయం తెలీదు. రక్తస్పర్శ కారణంగానే బంధం అనుబంధంతో బలపడి ఆనందం తన్మయత్వానికిలోనై బాబును లాలిస్తూ పాడుతూ చిన్ననాటి అనుభూతుల్ని నెమరేసుకుంటూ తన జీవితంలో ప్రేయసిగా వచ్చిన ఆమె భార్య అయ్యి తనను మోసగించిందన్న అపోహతో భావనకులోనై ఆ బాధను వ్యక్తపరుస్తూ పాడుకునే సన్నివేశం కూడా. మొదటి చరణంలో అమాయకత్వం నిండిన ఏమీతెలీని తన బిడ్డతో నేను కూడ పసితనంలో నీలాగే ఉండుంటాను. బంగారు ఉయ్యాలలో పవళించి హాయిగా ఊగి ఉంటానని అమాయకంగా చెప్తున్నట్టుగా ఉంటుంది. అందుకే ఆనాటి అచ్చటను ఈనాడు ముచ్చటగా మమత పెరిగి మనసు మురిసిందని బోసి నవ్వుల బాబుతో ముద్దులాడుతూ అంటాడు. అలా వీరి ఇరు హృదయాలు ఒకటైనందునే, నిన్ను ఏ తల్లికన్నదో మనకు ఏ బంధమున్నదో అర్థంకాని ఆనందంలో వేదాంతాన్ని లాలి పాటలో వ్యక్తపరుస్తాడు. ఈ పాట సన్నివేశంలో ఇంకా ఎవరైనా ఇలా ఎన్ని కోణాలలోనైనా మంచి అర్థాలు తీసుకోవచ్చు. తమిళ రీమేక్ కథను ఇంత చక్కగా గొప్పగా రూపకల్పన చేస్తూ చిత్రాన్ని దర్శకుడు వేదాంతం రాఘవయ్య తెరకెక్కించారు. మంచి కుటుంబ కథాచిత్రంగా నిలిచిన ‘ఆడబ్రతుకు’లో పాటలన్నీ బావుంటాయి.
-పీవీఎస్పీ రావు, అద్దంకి