Others

శతమానం భవతి (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నో సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి. అప్పుడప్పుడొచ్చే కొన్ని చిత్రాలు మాత్రం ఎదలోతుల్లో కొంతకాలం తిష్టవేస్తాయి. అలాంటి చిత్రాల్లో ఇటీవలే వచ్చిన శతమానంభవతి ఒకటి. సుప్రసిద్ధ నిర్మాత దిల్‌రాజు రూపొందించిన చిత్రమిది. దర్శకుడు సతీష్ వేగేశ్న, సంగీతం మిక్కీ జె మేయర్. కథాబలం కలిగిన చిత్రానికి ప్రకాష్‌రాజ్, జయసుధ, శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ తోడవ్వడంతో -ఆసక్తికరమైన చిత్రంగా రూపుదిద్దుకుంది. సీనియర్ నటుడు నరేష్ ఓ ప్రత్యేకమైన పాత్రలో సున్నితమైన హాస్యాన్ని అందించి చిత్రానికి మరింత బలం చేకూర్చాడు. ఏడాదిలో ఒక్కసారైనా కొడుకు, కూతుళ్లతో గడపాలని అహరహం తాపత్రయపడే దంపతుల పాత్రలకు ప్రకాష్‌రాజ్, సహజనటి జయసుధ ప్రాణం పోశారు. వాళ్ల కోరిక తీర్చేందుకు హీరో శర్వా ఎలాంటి సెంటిమెంట్ ప్రయోగాన్ని అస్త్రంగా ప్రయోగించాడన్న ప్రధాన కథకు.. బంధువర్గంలోని అమ్మాయి అయిన హీరోయిన్ అనుపమతో శర్వా సాగించే సన్నితమైన రొమాన్స్, పల్లెటూరి అందాలు, సునిశితమైన హాస్యాన్ని కలబోసి ఓ మంచి సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు సతీష్ వేగెశ్న. కుటుంబ కథలకు కాలం చెల్లిపోతుందన్న నమ్మకాలు బలపడుతున్న సమయంలో ఇలాంటి కథలతో దర్శకులు కొత్త ఆశలు చిగురిస్తూనే ఉన్నారు. కుటుంబ కోణంలో ప్రేమలను చూపిస్తూ, ఆప్యాయతలకు ప్రాణంపోస్తూ దర్శకుడు సతీష్ వేగెశ్న తెరకెక్కించిన శతమానం భవతి చిత్రం నాకు చాలా ఇష్టం. కథ చిన్నదే కావొచ్చు, దాని ప్రయత్నం బలంగాను, నిజాయితీగాను, ఆమోదయోగ్యంగావుంటే -ఆడియన్స్ ఆదరించని సినిమా అంటూ ఉండదని చెప్పడానికి శతమానం భవతి చిత్రం ఒక ఉదాహరణ. ఇందులోని పాటలు, పల్లెటూరి అందాలు, యాస సంభాషణలు, జనాల అలవాట్లు.. ఇలా ఒక ఊళ్లోని వాస్తవిక జీవితాల మధ్య ఆడియన్స్ నిలబడ్డారా? అన్న భావన కలుగుతుంది సినిమా చూస్తున్నంతసేపూ. స్పీడ్ యుగంలో యువతీ యువకుల తరంలో ఇలాంటి మంచి చిత్రాలు రావడం అరుదు. అందరూ మెచ్చినా, అందరూ చూసిన గొప్ప చిత్రమిది. ఇలాంటి చిత్రాలు తెలుగు పరిశ్రమ నుంచి మరిన్ని రావాలి. కనీసం ఇలాంటి సినిమాలతోనైనా -కుటుంబాల మధ్య, ఆయా కుటుంబాల్లోని మనుషుల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలు పురుడుపోసుకుంటాయని ఆశిద్దాం.
-సిహెచ్ రమాదేవి, హైదరాబాద్