Others

శృంగార నర్తకి.. శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇవ్వాళ వస్తున్న చిత్రాల్లో హీరోయిన్లు సైతం ఐటెం సాంగ్స్ చేస్తున్నారు, కాసుల కోసం. గతంలో సినిమాల్లో శృంగార నృత్యాలకు సంబంధించి అక్కచెల్లెళ్లు జయమాలిని, జ్యోతిలక్ష్మి పేరు ముందుగా వినపడేది. అగ్ర హీరోలనుంచి వర్ధమాన హీరోలతో కూడా ఈ సోదరీమణులు నటించి మెప్పించారు. ఒకానొక సమయంలో మీ చిత్రంలో జయమాలిని నృత్యం వుందా? లేకపోతే జతపరచండి అని పంపిణీదారులు డిమాండ్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. సినిమాలలో శృతిమించిన నృత్యాలలో నటించినా, నిజ జీవితంలో జయమాలిని పరమభక్తురాలు. షూటింగ్ లేని సమయాల్లో ఇంట్లో పూజా మందిరం దాటి వచ్చేది కాదు. శనివారం వేకువ జామున తడిబట్టలతో ఆలయంలో ప్రదక్షిణలు చేసేది. ఆమె అసలు పేరు అలివేలుమంగ. దర్శకుడు విఠలాచార్య జయమాలినిగా మార్చాడు. అగ్ర హీరోలతోపాటు వర్ధమాన హీరోల సరసన కూడా పలు చిత్రాల్లో నటించింది. నేటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వద్ద సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న అధికారిని వివాహం చేసుకొని సినిమా రంగానికి స్వస్తి చెప్పింది. గిడుతూరి సూర్యం దర్శకత్వంలో రూపొందిన కొండపిడుగు చిత్రం కోసం రూపొందించిన సన్నివేశంలో ఓ దృశ్యమిది.

-పర్చా శరత్‌కుమార్ 9849601717