Others

వివరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరమాణువంత
పనితనం లేకున్నా
పలకరింపుకో బదులు
పలికేవారు కరువైనా
తెడ్డున్నా చెయ్యి
కాల్చుకునే తీరు తప్పకున్నా

అవని తనదే
ఆకాశం తనదే
ఆ మాటకొస్తే
నింగీ నేలా
లోకమంతా
తనదనుకోవడం
పరిమితులెరుగని దురాశ
పరమానందాన్ని
దరిచేరనివ్వని దురాశ

వినే తీరు విచక్షణ
పెంచి తీరాలి
అనే తీరు ఆలోచన
పంచి తీరాలి
తినే తీరుని బట్టి కదా
ఎవరి ఆరోగ్యమైనా

వివరం వేయి తీరులుగా
వినయం లక్షదారులుగా
వెలుగొందే చోట
విలువలపైనే తగని మక్కువ
తనకోసం ఎవరో రావాలని కాక
ఎవరి కోసమైనా తానొక
అభయహస్తమవ్వాలన్న మమకారం
మనిషిని మనిషిగా మనిషి ప్రేమించడమైనా..
మనిషి మనిషిలో మనిషై జీవించడమైనా...

- డా. కొల్లు రంగారావు