Others

స్ట్రెచ్‌మార్క్స్ పోతాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గర్భం ధరించినప్పుడు బరువు పెరగడం, రంగు మారడం వల్ల గీతలు పడతాయి. వాటినే స్ట్రెచ్‌మార్క్స్ అంటారు. ఈ సమయంలో ఉన్నట్టుండి బరువు పెరగడం వల్ల చర్మం అడుగున ఉన్న ఫైబర్ విరిగి స్ట్రెచ్‌మార్క్స్ వస్తాయి. కొన్నిసార్లు వంశపారంపర్యంగా ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు, బిడ్డ మరీ బరువుగా ఉన్నప్పుడు కార్టిజోన్ ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు, స్టెరాయిడ్ క్రీములు వాడినా, హార్మోనుల అసమతుల్యత ఉన్నా ఇలా స్రెచ్‌మార్క్స్ రావచ్చు. ఈ సమస్య వచ్చిన తరువాత కాకుండా ముందునుంచీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే స్ట్రెచ్‌మార్క్ మరీ ఎక్కువగా రాకుండా జాగ్రత్త పడవచ్చు.
* కడుపుతో ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రాధాన్యమివ్వాలి.
* పోషకాహారం ఎక్కువగా తీసుకోవాలి. జంక్‌ఫుడ్, మిఠాయిలు, శీతలపానీయాలకు దూరంగా ఉండాలి.
* యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, ఈ, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్లు ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవాలి. అంటే నిమ్మపండ్లు, తోటకూర, క్యారెట్, చిలగడ దుంపలు, క్యాప్సికం, పుచ్చకాయ వంటివాటిని ఎక్కువగా తీసుకోవాలి.
* మంచినీళ్లు, పండ్లు, కూరగాయ రసాలు తీసుకోవాలి.
* నిపుణుల ఆధ్వర్యంలో యోగా, స్ట్రెచెస్ వేయడం చేయాలి. క్రమం తప్పకుండా నడవాలి. ఒకేసారి బరువు పెరగకుండా చూసుకోవాలి.
* సమస్య అదుపులో ఉండాలంటే రెటినాల్, కొలాజిన్, జోజోబా ఆయిల్, విటమిన్ ఈ, ట్రెటినాయిక్ క్రీములు వాడాలి.
* అలాగే డెలివరీ తరువాత స్ట్రెచ్‌మార్క్స్ మరీ అధికంగా ఉంటే మైక్రోడెర్మాబ్రేషన్, లేజర్ చికిత్సల వల్ల ప్రయోజనం ఉండవచ్చు. కాకపోతే ఈ చికిత్సల్ని విడతలు విడతలుగా తీసుకోవాల్సి ఉంటుంది. అదీ ఫలితం వస్తుందనే నమ్మకం లేదు.
* కలబంద గుజ్జులో చెంచా వీట్ జెర్మ్, ఆలివ్‌నూనె, కోకోబటర్ కలిపి పొట్టపై పూతలా వేసుకోవాలి. అరగంటయ్యాక చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తుంటే స్ట్రెచ్‌మార్క్స్ కొద్దిగా తగ్గుతాయి.
*