Others

పిల్లలను ప్రేమిద్దాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలను పెంచడం ఒక కళ. అది అంత ఆషామాషీ విషయం కాదు. తల్లిదండ్రులు కోపాన్ని, ఒత్తిడిని అదుపుచేసుకుని కాస్త సంయమనంతో చిన్ని చిన్ని చిట్కాలను పాటించి ఆ చిన్ని మనసులను గెలుచుకోవచ్చు. మరి అవేంటో చూద్దామా..
* పిల్లలకు ఏదైనా పోటీల్లో నెగ్గినా, ర్యాంకు వచ్చినా వారిని అభినందించండి.
* అప్పుడప్పుడూ పిల్లల స్కూలు ఫంక్షన్లకు, స్కూలు నుంచి పిల్లలను తీసుకురావడానికి వెళుతూంటే వారికి చాలా సంతోషంగా ఉంటుంది.
* సైకాలజీ ప్రకారం కొడుకు తల్లిని, కూతురు తండ్రిని అమితంగా ప్రేమిస్తారు. అలాగని కొడుకు తండ్రిని, కూతురు తల్లిని ప్రేమించదని కాదు. ఏది ఏమైనా మీరు ప్రేమిస్తున్న విషయాన్ని పిల్లలకు చెబితే బాగుంటుంది.
* పిల్లలకు చిన్నవయసు నుంచే మానవతా విలువలను గురించి చెప్పడం, మహనీయుల చరిత్రలు కథలు చెప్పడం అవసరం. ఇవి వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి.
* పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాల గురించి చిన్నవయసు నుంచే చెబుతూ ఉండాలి. పిల్లలను అడపాదడపా గుళ్ళకు తీసుకువెళ్లాలి.
* మీ పిల్లలు చెబుతున్న ప్రతి విషయాన్ని మీరు ఎంతో ఓపికగా వినండి. చిన్నప్పుడు మీరు చెప్పే మాటలు పెద్దలు వినకపోతే మీకు ఎంత కోపం వచ్చిందో.. ఇప్పుడు వారికి అంతకన్నా ఎక్కువ కోపం వస్తుంది.
* తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాల్లో ఎంత బిజీగా ఉన్నాసరే.. పిల్లలను వారి దగ్గరే ఉంచి చదివించాలి. హాస్టల్లోనో, అమ్మమ్మ, నానమ్మల దగ్గర ఉంచో చదివించకూడదు.
* ఇంట్లో అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు ఆర్పే అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు.
* పిల్లలు ఉదయానే్న కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం చేయడం, వారానికి ఒకసారి గోర్లు కత్తిరించుకోవడం వంటివి మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు. కాబట్టి మీరు ఈ విషయాల్లో ముందు పద్ధతిగా ఉండాలి.
* పిల్లల్ని ఎప్పుడూ అతిగా దండించడం, అతిగా విమర్శించడం చేయకూడదు.
* ఇంట్లో ఎక్కడి వస్తువులు అక్కడే ఉండే విధంగా అలవాటు చేసుకుంటే.. పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది.
* ఏదైనా తిన్న తరువాత రేపర్స్‌కానీ, చెత్తకానీ చెత్తబుట్టలో వేయాలి. ఇంట్లో ఎక్కడైనా పనికిరాని పేపర్లు, చాక్‌లెట్ కాగితాలు కనబడితే చెత్తబుట్టలో వేయడం పిల్లలకు అలవాటు చేయాలి.
* ఇంట్లో టేబుల్ కాలెండర్ వంటిది పెట్టి ప్రతిరోజూ తేదీ, వారాలను మార్చే పనిని పిల్లలకు అప్పగించాలి. అప్పుడు గోడ కాలెండర్‌ను కూడా నెలకాగానే మీరు చెప్పకుండానే వారు మార్చేస్తారు.
* ప్లిలలు టీవీ కానీ, మొబైల్ కానీ చూస్తున్నప్పుడు తిట్టి టీవీ ఆఫ్ చేయడమో, మొబైల్ లాక్కోవడమో చేయడం కన్నా ఇప్పుడు చదువుతావా? పది నిముషాల తర్వాత చదువుతావా? అని అడిగి వారికే చాయిస్‌ను ఇవ్వండి.
* ఏ బట్టలు హాంగర్లకు తగిలించాలో, ఏవి వాషింగ్ మెషీన్‌లో వేయాలో, ఏవి పాత బట్టల పెట్టెలో వేయాలో అలాగే చెయ్యండి. అప్పుడు పిల్లలు కూడా మీ అడుగు జాడల్లోనే నడుస్తారు.
* పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వండి. దాన్ని పొదుపు చేయడమూ నేర్పండి.
* పిల్లల ఐక్యూ పెరిగేలా మంచి పుస్తకాలు కొని, తల్లిదండ్రులు చదివి, పిల్లల చేతా చదివించండి.
* పజిల్స్, రిడిల్స్ ఇచ్చి వారి మెదడుకు పదును పెట్టండి.
ఇలా ముందు మీరు మారి, పనులు చేస్తే పిల్లలు కూడా మిమ్మల్ని అనుసరించి బుద్ధిగా నడుచుకుంటారు.